AP SSC Exams Postpone – ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

AP SSC Exams Postpone – ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా : Andra Pradsh 10th Class Exams 2021 Postpone – AP Government postpone SSC exams amid covid cases, to review the issue in July,2021. – ఏపీ ప్రభుత్వం ప్రకటన.

ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. జూలైలో మరోసారి సమీక్ష జరిపి.. అప్పటి పరిస్థితుల బట్టి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి పదో తరగతి పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటిదాకా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చినా.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

AP SSC Exams Postpone – ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఇదిలా ఉంటే టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టగా.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనితో పది పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది. ప్రస్తుతానికి స్కూల్స్ తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. టీచర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించలేదంటూ ప్రభుత్వం ఆఫిడివిట్ దాఖలు చేయగా.. పూర్తి వివరాలు కోరుతూ హైకోర్టు తదుపరి విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది.

మహమ్మారి కారణంగా బిఎస్‌ఇఎపి గత ఏడాది ఎస్‌ఎస్‌సి లేదా 10 వ తరగతి పరీక్షలను రద్దు చేసింది, అయితే, అలాంటి చర్య ఇంకా ప్రకటించబడలేదు. గత సంవత్సరం విద్యార్థులందరూ తదుపరి తరగతికి ఉత్తీర్ణులయ్యారు. 2019 లో మొత్తం ఉత్తీర్ణత శాతం 94.88 శాతంగా ఉంది. మొత్తం 6.2 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

  • టీచర్లకు టీకాలు వేసిన తర్వాతే పరీక్షలు.
  • హైకోర్టుకు నిర్ణయాన్ని వెల్లడించిన ప్రభుత్వం
  • టీచర్లకు టీకాలు వేసిన తర్వాతే పరీక్షలు.
  • హైకోర్టుకు నిర్ణయాన్ని వెల్లడించిన ప్రభుత్వం
  • పరీక్షల నిర్వహణపై జులైలో సమీక్ష.

ఉపాధ్యాయులకు టీకాలు ఇచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో శ్రీకాకుళానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని సూచించింది.
ఈ సందర్భంగా పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ తరఫున న్యాయవాది తెలిపారు.
దీనిపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించిన కోర్టు.. అనంతరం విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.

FA Marks Online Entry Process (FA 1 & 2) Click here

Leave a Comment

Your email address will not be published.