AP High Schools New Time table – Schools (8th, 9th & 10th Classes) Conduct Guidelines 2020

AP High Schools New Time table – Schools (8th, 9th & 10th Classes) Conduct Guidelines 2020

AP High Schools New Time table – Schools (8th, 9th & 10th Classes) Conduct Guidelines 2020 : SCERT Latest Timetable for Schools in AP. Class 8th starting from november 23rdbinstructions released by CSE AP. Class 8th starting from november 23rd instructions timetable. December 23rd నుండి పాఠశాల నిర్వహణ సమయం మారిన నేపథ్యంలో. High Schools New time table -2020 సమయం 9:30- 4:15.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

AP High Schools New Time table – Schools (8th, 9th & 10th Classes) Conduct Guidelines 2020

  • ప్రతి సోమ, బుధ మరియు శుక్ర వారాలు 9వ తరగతి విద్యార్థులు.
  • ప్రతి మంగళ, గురు మరియు శని వారాలలో 8వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలి.

23_11_20   సోమవారం నుండి Upper primary, High schools నందు , 8వ తరగతి ప్రారంభ వివరాలు 23 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు.

క్రమేణా ఉన్నత పాఠశాలల్లో అన్ని తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు.

Jagananna Vidya kanuka Vidya Varostavalu Day wise Program Details download

  • డిసెంబర్ నెల 23 సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
  • ఇప్పటికే ఈ నెల 2 నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉండటం తో పాటు హాజరు శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 8వ తరగతి విద్యార్థులకు కూడా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది. 8, 9 తరగతుల విద్యార్థులు రోజుమార్చి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10 వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.
  • ఈ మూడు తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
  • 14వ తేదీ తరువాత అప్పటి పరిస్థితి సమీక్షించుకుని 1-5 తరగతులపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
  • ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు జరుగుతున్న పాఠశాలలు చలికాలం కారణంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని మంత్రి సురేష్ తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వారి  పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో  పెట్టుకుని  తరగతి గదికి 16 మందికి మించకుండా గదుల్లో గానీ, వరండాలో గానీ, చెట్ల నీడలో గానీ కూర్చోబెట్టే విధంగా  ప్లాన్ చేసుకుని వాటి ప్రకారమే తరగతులు నిర్వహించవలెను.

SCERT Latest Timetable for Schools in AP

  • ఏపీలో పాఠశాలలకి కొత్త టైం టేబుల్‌
  • 10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ హాజరు కావాలి
  • మధ్యాహ్నం తర్వాత ఆన్‌లైన్‌లో బోధన
  • అన్ని రకాల కోవిడ్‌ జాగ్రత్తలతో ఎస్సీఈఆర్టీ నూతన విధివిధానాలు

విద్యార్థుల నుంచి మెరుగైన రీతిలో స్పందన కనిపిస్తుండడంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుండడంతో విద్యా శాఖ కోవిడ్‌ నుంచి రక్షణ చర్యలను చేపడుతూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతుండగా, సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. 8, 9 తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులను చేపట్టనున్నారు. 10వ తరగతి విద్యార్థులు ప్రతి రోజూ హాజరు కావలసి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తాజా టైమ్‌ టేబుల్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ మేరకు 9వ తరగతి విద్యార్థులు సోమ, బుధ, శుక్రవారాల్లో 8వ తరగతి విద్యార్థులు మంగళ, గురు, శనివారాల్లో పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9.30నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్న భోజనం అనంతరం 1.30గంటలకు ఇళ్లకు పంపిస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయి.

ఎస్సీఈఆర్టీ తాజా టైం టేబుల్‌

  • ఉదయం 9.30 నుంచి 9.45 వరకు: ప్రార్థన, కోవిడ్‌–19 ప్రతిజ్ఞ (తరగతి గదిలో). సాధారణ సమావేశం నిషిద్ధం.
  •  9.45 నుంచి 10.25 వరకు : మొదటి పీరియడ్‌
  • 10.25 నుంచి 10.35 వరకు : ఆనంద వేదిక / భౌతిక దూరాన్ని పాటిస్తూ పాఠశాల ఆవరణలో నడవడం, చేతులు కడుక్కోవడం / మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం
  • 10.35 నుంచి 11.15 వరకు : రెండవ పీరియడ్‌
  • 11.15 నుంచి 11.20 వరకు : మంచినీటి విరామం (వాటర్‌ బెల్‌)
  • 11.20 నుంచి 12.00 వరకు : మూడవ పీరియడ్‌
  • 12.00 నుంచి 12.10 వరకు : ఆనంద వేదిక (కథలు చెప్పడం / చిత్రలేఖనం / పాఠ్యాంశాలకు సంబంధించిన నాటకీకరణ / చేతులు కడుక్కోవడం / ప్రాణాయామం, మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం.
  • 12.10 నుంచి 12.50 వరకు : 10వ తరగతి విద్యార్థులకు నాల్గవ పీరియడ్, 8/9వ తరగతి విద్యార్థులకు భోజన విరామం
  • 12.50 నుంచి 1.30 వరకు : 8/9వ తరగతి విద్యార్థులకు నాల్గవ పీరియడ్, 10వ తరగతి విద్యార్థులకు భోజన విరామం
  • 1.30 : విద్యార్థులు ఇంటికి వెళ్లుట
  • 1.30 నుంచి 2 వరకు :  ఉపాధ్యాయుల భోజన విరామం.
  • 2.00 నుంచి 2.15 వరకు : ఆన్‌లైన్‌ బోధన, విద్యార్థులకు వాట్సప్‌ ద్వారా సమాచారం అందించేందుకు ఉపాధ్యాయుల సమావేశం.
  • 2.15 నుంచి 4.00 వరకు : వాట్సప్‌ / దూరదర్శన్‌ / దీక్షా / అభ్యాస యాప్‌ / యూట్యూబ్‌ / ఫోన్‌ ద్వారా సామూహిక సంభాషణ, విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం వంటి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ, పర్యవేక్షణ.
  • 4.00 నుంచి 4.15 వరకు : మరుసటి రోజుకు ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం.
Scroll to Top