Telangana Schools close from 24-03-2021 – Hostels and colleges Close

Telangana Schools close from 24-03-2021 – Hostels and colleges Close : As Covid-19 cases rise, Telangana to decide on closing down schools again. Sencond Time Schools Close in Telangana State. Carona Cases increased and Attack Schools Students Daily. తెలంగాణ లో రేపటి నుంచి పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు.

FA1 Question Papers 2024: Download (Updated)

Telangana Schools close from 24-03-2021 – Hostels and colleges Close

‘‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ అక్కడక్కడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతున్నందున కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి.

తెలంగాణ లో రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేత

ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ర్టంలోని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి.

విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్‌లైన్‌ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. రాష్ట్ర ప్రజానీకం ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలి. విధిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

These closure orders apply to all hostels, gurukul schools, government and private educational institutions in the state except medical colleges.
Teachers, however, will have to continue attending duties as schools or other educational institution institutions will remain closed only for students.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top