School Prayer News on 4th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం

School Prayer News on 4th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం

School Prayer 4th Sep, 2019 పాఠశాల అసెంబ్లీ – AP / Telangana Today’s News, Good Poem, Today’s Good News, Today’s GK, Today’s Good Word, Today’s Good News, Today’s Nationalism, National / International Days, Today’s Child, Today’s Story, The Great Man’s Word, Today’s Proverb etc for School Assembly on 4th September, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.
?


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

School Prayer News on 4th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు

  1. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..: మండల, జిల్లా పరిషత్‌ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంతో దూషించడాన్ని సహించే ప్రసక్తే లేదు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాము’ అని ఈ సందర్భంగా సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
  2. భారత పర్యటనను రెండోసారి రద్దు చేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇలా రద్దు చేసుకోవడం ఈ ఏడాది ఇది రెండోసారి.
  3. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. నెరవేరబోతున్న ఉద్యోగుల కల: ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలని కమిటీ నిర్ణయించినట్లు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని తెలిపారు.
  4. ఉద్యోగాలు ఊడతాయ్.. ఇకపై నేనే రాస్తా: కేసీఆర్: ఇకపై ఒక్కో గ్రామానికి ఏడాదికి 7 వేల మొక్కలు మంజూరు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 85శాతం మొక్కలు బతకాలి.. లేకుంటే ఉద్యోగాలు ఊడతాయని సీఎం వార్నింగ్ ఇచ్చారు.
  5. పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్: ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు కిందటి సంవత్సరం రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే… తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఉత్తర్వులు జారీ అయ్యాయి.
  6. విచిత్రమైన రికార్డు సృష్టించిన వెస్టిండీస్: ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 12 బ్యాట్స్‌మెన్లు బ్యాటింగ్‌ చేసిన తొలి జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.

నేటి సుభాషితం

“దురభ్యాసాలను మానాలంటే, వాటికి వ్యతిరేకమైన మనోవృత్తులను అవలంబించటమే ఉపాయం.”

“The only remedy for bad habits is counter habits.”

మంచి పద్యం

పుట్టగానే భువిని పుట్టును భేదంబు
గుడిసెలోన మిగుల కుములునొకడు
రాజ సౌధ మందు రాజిల్లు నితరుడు
నిల్వ నీడలేక నీల్గు చచ్చు నొకడు

(పద్మశ్రీ డా. టి. వి. నారాయణ గారు రచించిన “శ్రుతి సౌరభము” అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)

నేటి జీ.కె

ప్రశ్న: చైతన్యపురి సమీపంలోని మూసీనది తీరంలో లభించిన ప్రాకృత శాసనం ఎవరిది?

జ: గోవిందవర్మ

మన సామెతలు/జాతీయములు


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆగవేగము/ఆఘమేఘాల మీద

వివరణ: అతి వేగము == వాడు ఆగమేగాల మీద వచ్చాడు

ఆటవిడుపు

వివరణ: విశ్రాంతి దినము ….ఒకప్పుడు బడులలో, ఇప్పుడు ఆదివారం లాగా, ఏ అమావాశ్యకో పౌర్ణమికో ఆటవిడుపు ఇచ్చేవారు దానినే ఆటవిడుపు రోజు అని అంటారు.

ఆటు, పోటు

వివరణ: సముద్రములో వచ్చునవి….. జీవితములో కష్టాలను ఆటుపోటులతో పోల్చడము సర్వసాధారణము.

చరిత్రలో ఈరోజు, సెప్టెంబర్ 4

సంఘటనలు

1781: 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్నగరం, “బహియా డి లాస్ ఫ్యూమ్” (పొగల లోయ – వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది
1833: మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ – న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, “పేపర్ బాయ్స్ ” అందరూ “ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు” జరుపుకోవచ్చును.
1866: మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
1870: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
1882: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ ‌లోని పెరల్ స్ట్రీట్ స్టేషను)
1885: న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి “కేఫ్టీరియ” ను ప్రారంభించారు.
1888: జార్జ్ ఈస్ట్‌మెన్ తన మొదటి “రోల్ ఫిల్మ్” కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసాడు.
1933: మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il.
1967: భారతదేశంలోని కొయ్‌నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు
2009: కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

జననాలు

1825: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (మ.1917)
1906 : మాలిక్యులర్‌ బయాలజీ కి మార్గదర్శకుడు మాక్స్‌ డెల్‌బ్రక్జననం (మ.1981).
1924: కె.వి.రఘునాథరెడ్డి, రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002)
1935: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు రచయిత. (మ.2004)
1962: కిరణ్ మోరే, భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ .
1971 : దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ క్లూసెనర్జననం.
1987 : రితు పాతక్ , ప్రముఖ బాలీవుడ్ నేపధ్య గాయిని.

మరణాలు

1965 : ఉత్తమ సేవాదృక్పథం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ స్విట్జర్ మరణం (జ.1875).
1999: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966)
2007: భమిడిపాటి రాధాకృష్ణ, ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత. (జ.1929)
2007: వై.రుక్మిణి, తెలుగు, తమిళ మరియు హిందీ నటి.

మన పండుగలు/జాతీయ దినోత్సవాలు

ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం. (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్)

Disclaimer: TeacherNews.in is an informational web site. The content given in this site has been collected from various web sources. For any changes on the content we refer to visit the Official website to get the latest & Official details.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here