School Assembly (Prayer) on 16th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి- ఆణిముత్యం

School Assembly (Prayer) on 16th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి- ఆణిముత్యం

School Prayer 16th Sep, 2019 పాఠశాల అసెంబ్లీ – AP / Telangana Today’s News, Good Poem, Today’s Good News, Today’s GK, Today’s Good Word, Today’s Good News, Today’s Nationalism, National / International Days, Today’s Child, Today’s Story, The Great Man’s Word, Today’s Proverb etc for School Assembly on 16th September, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

School Assembly (Prayer) on 16th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి- ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు

  1. భారత్‌తో యుద్ధంలో ఓడిపోతామని అంగీకరించిన పాక్ ప్రధాని: భారత్‌తో యుద్ధంలో ఓడిపోతామని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పరోక్షంగా అంగీకరించారు.
  2. తెలంగాణలో కొత్త మోటార్ చట్టం అమలుకు ‘నో’: కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని అమలు చేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. శాసనసభలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
  3. గోదావరిలో ఘోర ప్రమాదం.. పర్యాటక బోటు గల్లంతు: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిలో పర్యాటక బోటు (పున్నమి) మునిగిపోయింది. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర బోటు గల్లంతైనట్లు గుర్తించారు. ప్రమాదం సమయంలో బోటులో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
  4. 2030 వరకు ఇస్రో భారీ ప్రయోగాల షెడ్యూల్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2030 వరకు భారీ ప్రయోగాలకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. వచ్చే ఏడాదిలో సూర్యునిపై పరిశోధనకు ఆదిత్య ఉపగ్రహ ప్రయోగం చేయనుంది. 2021లో గగన్‌యాన్ పేరుతో మానవ సహిత ప్రయోగం, 2024లో చంద్రయాన్-3, మంగళ్‌యాన్-2 ప్రయోగం చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది.
  5. ఇండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్: టాస్ పడకుండానే రద్దైన తొలి టీ 20: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. వర్షం కారణంగా తొలుత టాస్ వాయిదా పడింది.

నేటి సుభాషితం

“మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లడతాయి.”

“ADOPTING THE RIGHT ATTITUDE CAN CONVERT A NEGATIVE STRESS INTO A POSITIVE.”

“గొంతు పెంచడం కాదు. నీ మాట విలువ పెంచుకో. వాన, చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు.”

“Good things come to those who wait. But better things come to those who work for it”

నేటి జీ.కె

ప్రశ్న 1 : హరప్పా ప్రజలకు కింది ఎవరితో అంతర్జాతీయ సంబంధాలు ఉండేవి?

జ: మెసపటోమియా

ప్రశ్న 2 : 236 ద్వీపాలు ఉన్న ఆసియా ద్వీపకల్ప దేశమేది?

జ: హాంకాంగ్

మంచి పద్యం

చెవిని గూడుగట్టి చెప్పెడు మాటలు
విన్నవారు నిజము ఖిన్నులైరి
సర్వనాశనమైరి సర్వము గోల్పోయి
కైక గాథమనకు గరపలేదె?


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 16

సంఘటనలు

2016 ఆపిల్ సి.ఇ.ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐఫోన్ 7 ను విడుదల చేసాడు.

జననాలు

1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, ప్రముఖ తెలుగు కవి. (మ.1928)
1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ ప్రముఖ గాయని. (మ.2004)
1923: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడు. (మ.2015)
1945 : భారత రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం జననం
1954 : సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి బైర్రాజు రామలింగరాజు జననం.
1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి.
1975: మీనా, దక్షిణ భారత సినిమా నేటీ.

మరణాలు

1763: సలాబత్ జంగ్, మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్ జా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.
1931: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జ.1858)
1932: రోనాల్డ్ రాస్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857)
1987: దొడ్డపనేని ఇందిర, ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (జ.1937)
2012: సుత్తివేలు, ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
2013: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. (జ.1920)
2016: బొజ్జా తారకం, ప్రముఖ హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)

జాతీయ దినాలు

అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం.

మహానీయుని మాట

” నువ్వు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు బాధ్యత తీసుకుంటే ఓడిపోవు ”

నేటీ మంచి మాట

” కోపం మనసులో కాదు మాటలో మాత్రమే వుండాలి
ప్రేమ మాటలో కాదు మనసులో వుండాలి “

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.