School Assembly (Prayer) on 19th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి- ఆణిముత్యం

School Assembly (Prayer) on 19th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి- ఆణిముత్యం

School Prayer 19th Sep, 2019 పాఠశాల అసెంబ్లీ – AP / Telangana Today’s News, Good Poem, Today’s Good News, Today’s GK, Today’s Good Word, Today’s Good News, Today’s Nationalism, National / International Days, Today’s Child, Today’s Story, The Great Man’s Word, Today’s Proverb etc for School Assembly on 19th September, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

School Assembly (Prayer) on 19th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి- ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ – నేటీ ముఖ్యమైన వార్తలు

  1. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ‘జనగణన’: పదేండ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కల ప్రక్రియకు కేంద్రం సమాయత్తమవుతోంది. 2021 జనాభా లెక్కల కోసం 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 30 వరకు సమగ్ర జనాభా గణన చేపట్టనున్నట్టు కేంద్ర హోంశాఖ ఆధీనంలోని రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ శాఖ కమిషనర్‌ వెల్లడించారు.
  2. భారత్‌లోకి ఉగ్రవాదులు పొరుగుదేశం నుంచి వస్తున్నారు చంద్రుడి నుంచి కాదు: యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు: పోలాండ్ నేత రిషార్డ్: కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాకిస్థాన్ తెగ గొంతు చించుకుంటున్నా ప్రపంచ దేశాలు మాత్రం ఆ దేశానికి మద్దతు తెలపట్లేదు.
  3. బోటు జాడ దొరికింది: పాపి కొండల్లో నీటిలో మునిగి పదుల మందిని బలి తీసుకున్న బోటు జాడ దొరికింది. సోనార్‌ సిస్టమ్‌ ద్వారా 7080 మీటర్ల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం బోటు ఎక్కడుందో కనిపెట్టారు.
  4. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధించాలని సుజాతరావు కమిటీ చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసుకు బ్రేక్ పడనుంది.
  5. ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎం కోర్సుల్లో ‘ట్రిపుల్ తలాక్’ సిలబస్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని బరైలీలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే రోహిల్ ఖండ్ యూనివర్శిటీ సిలబస్‌లో చోటుచేసుకుంది. యూనివర్శిటీ ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు.
  6. అరుదైన ఘనత సాధించిన వినేష్ ఫొగాట్: భారత మహిళ రెజ్లర్ వినేష్ ఫొగాట్ అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచ ర్లెజింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన 53 కిలోల బౌట్‌లో సిల్వర్ మెడలిస్ట్ సారా హిల్డె‌బాండ్ర్‌పై 82 తేడాతో విజయం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించింది.

నేటీ సుభాషితం

“అన్ని కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకోవటానికి.”

“Silence is the best answer for all stupid questions.. Smiling is the best reaction in all critical situations.”

మంచి పద్యం

ప్రాణులందరిలోన నెవ్వాడు చూచు
పరమ విభునిని; తనలోన పరులనెవ్వ
డుదరిసించు; పరులనెవ్వడు దరిసించు
తనవలెనతడు మానవోత్తముడుగాదె!

నేటీ జీ.కె

ప్రశ్న: సుప్రీంకోర్టు జడ్జీలు పదవీ కాలం కంటే ముందే విరమణ చేయాలంటే వారి రాజీనామా పత్రాలను ఎవరికి పంపాలి?

జ: రాష్ట్రపతి

మహానీయుని మాట

” పని మొదలు పెడితే అపవద్దు.
మధ్యలో వొదలిపెట్టవద్దు.
ఫలితం గురించి ఆలోచించకుండా
పని పూర్తి చేయడమే మనిషి పని. “

నేటీ మంచి మాట

” నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి.
ముందున్న కాలికి గర్వం లేదు….
వెనక ఉన్న కాలికి అవమానం లేదు…
ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని…!! “


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చరిత్రలో ఈ రోజు 19 సెప్టెంబర్

ప్రత్యేక దినాలు

తెలుగు మాధ్యమాల దినోత్సవం

జననాలు

★1887: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు. (మ.1973)
★1905: చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు మరియు రంగస్థల, సినిమా నటుడు.
★1911: బోయి భీమన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ పురస్కార గ్రహీత. (మ.2005)
★1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, సుప్రసిద్ధ నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2010)
★1929: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు మరియు దర్శకుడు. (మ.2002)
★1935: మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016)
★1965: సునీతా విలియమ్స్, యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి మరియు నాసా వ్యోమగామి.

మరణాలు

▪️1965: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ. 1900) .
▪️2014: ఉప్పలపు శ్రీనివాస్, ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
▪️2015: నడిచే గణితవిజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.2192015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933).

Scroll to Top