School Assembly (Prayer) on 12th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం

School Assembly (Prayer) on 12th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం

School Prayer 12th Sep, 2019 పాఠశాల అసెంబ్లీ – AP / Telangana Today’s News, Good Poem, Today’s Good News, Today’s GK, Today’s Good Word, Today’s Good News, Today’s Nationalism, National / International Days, Today’s Child, Today’s Story, The Great Man’s Word, Today’s Proverb etc for School Assembly on 12th September, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

School Assembly (Prayer) on 12th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ నేటి వార్తలు

1. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్ర బిందువుగా మారిందని భారత్ స్పష్టం చేసింది.
2. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపైనే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
3. చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానానికి ఇస్రో ప్రయత్నాలు కొనసాగిస్తుంది.
4. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగం పనితీరు బాగుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసించారు.
6. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా బండారు దత్తాత్రేయ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
7. ప్రో కబడ్డీ సీజన్-7 లో మంగళవారం జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ పై యు ముంబా గెలిచింది.
8. ‘కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌’.. మహారాష్ట్ర ఎన్నికల తరువాత ముహూర్తం: ‘‘తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
9. గన్నుతో స్కూల్‌కు వచ్చిన విద్యార్థి..ఇది తప్పుకాదా అన్న టీచర్‌ను..: పుస్తకాలు చేత పట్టుకోవాల్సిన ఓ విద్యార్థి ఏకంగా ఓ పిస్టల్‌ను స్కూల్‌కు తీసుకు వచ్చాడు. ఇది తప్పు అంటూ మందలించిన ఉపాధ్యాయుడికే చుక్కలు చూపించాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధా నగర్‌ జిల్లాలో జరిగింది.
10. నేడు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు: నేడు కొన్ని ప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. గురువారం మణుగూరు ఖాజీపేట్‌ల మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్ రైలు రద్దైంది.భద్రాచలం డోర్నకల్, విజయవాడ భద్రాచలం రైళ్లు కూడా రద్దయ్యాయి.
11. యూకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. భారత విద్యార్థులకు మేలు..: యూకేలోని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2012లో రద్దు చేసిన రెండేళ్ల పోస్ట్స్టడీ వర్క్ వీసాను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
12. గణేష్ నిమజ్జనం సందర్భంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం: గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం సెలవు ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరితో పాటు మేడ్చల్ జిల్లాకు సెలవు వర్తిస్తుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
13. ఆరుదైన రికార్డు సాధించిన ఆసీస్ ఆల్ రౌండర్: మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ మహిళ జట్టుతో జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ అరుదైన రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌లో రెనీస్ బోస్ వికెట్ తీసిన పెర్రీ 150 వన్డే వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా రికార్డు సాధించింది.

నేటి సుభాషితం

“గొంతు పెంచడం కాదు. నీ మాట విలువ పెంచుకో. వాన, చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు.”

“Good things come to those who wait. But better things come to those who work for it”

మంచి పద్యం

చెవిని గూడుగట్టి చెప్పెడు మాటలు
విన్నవారు నిజము ఖిన్నులైరి
సర్వనాశనమైరి సర్వము గోల్పోయి
కైక గాథమనకు గరపలేదె?


(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన “శ్రుతి సౌరభము” అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)

నేటి జీ.కె

ప్రశ్న: 236 ద్వీపాలు ఉన్న ఆసియా ద్వీపకల్ప దేశమేది?

జ: హాంకాంగ్


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చరిత్రలో ఈరోజు, సెప్టెంబర్ 12

సంఘటనలు

♦️ 686: బీజాపూరు రాజ్యం, ఔరంగజేబుతో యుద్ధంలో ఓడిపోయి, మొఘల్ సామ్రాజ్యం కలిసిపోయింది. ఆదిల్‌షాహీ వంశ పతనం.
♦️ 2008: సెప్టెంబర్ 12 తేదీని మొదటిసారిగా ప్రపంచ నోటి ఆరోగ్య దినంగా ప్రకటించారు. 1978 సెప్టెంబర్ 12వ తేదీనాడు ఎఫ్ డి ఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య రక్షణ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది.

జననాలు

1854: ఎప్ డి ఐ వ్యవస్థాపకుడు డాక్టర్ చార్లెస్ గాడన్ జన్మించారు.
1885: గౌస్ బేగ్ సాహెబ్, పేరాల ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలిసు జులుమును భరించి క్రమశిక్షణతో సత్యాగ్రహంచేసి మునిసిపల్ శాసనాన్ని రద్దుచేయించారు
1886 : ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు సవాయి గంధర్వ జననం (మ.1952).
1892: తల్లావఝుల శివశంకరస్వామి ప్రసిద్ద సాహితీవేత్త. భావకవితా ఉద్యమ పోషకుడు. (మ.1972)
1920: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (మ.2005)
1925: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (మ.2017)
1943 : ఆధునిక తెలుగు నిఘంటుకర్త రవ్వా శ్రీహరి జననం.
1952: అల్లాబక్షి బేగ్ షేక్‌, రంగస్థల రచయిత మరియు నటుడు.
1972 : ఆంగ్ల నటుడు మరియు మార్షల్ ఆర్టిస్ట్ జాసన్ స్టాథమ్ జననం.

మరణాలు

2009: నార్మన్ బోర్లాగ్, హరిత విప్లవ పితామహుడు.
2009: రాజ్‌సింగ్ దుంగార్పూర్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు.
2010: స్వర్ణలత, దక్షిణ భారత గాయని. (జ.1973)

మన పండుగలు/జాతీయ దినోత్సవాలు

ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం

మహానీయుని మాట

“ఒంటరిగా ఉన్నపుడు ఆలోచనల్ని నలుగురిలో ఉన్నపుడు నాలుకని అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం మన అదుపులో తప్పకుండా ఉంటుంది.”

నేటీ మంచి మాట

“నీ కళ్ళు అందంగా ఉంటే ఈ ప్రపంచానికి నువ్వు నచ్చుతావు. అదే నీ దృష్టి అందంగా ఉంటే ఈ ప్రపంచం నీకు నచ్చుతుంది.”

నేటీ సూక్తి :

సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే
వారికి మిగతా మంచి అలవాట్లూ
వాటంతటవే వస్తాయి.

———— స్వామి వివేకానంద.

నేటీ ప్రశ్న:❓

మానవ శరీరంలో అత్యధికంగా లభించే లోహం ఏది ?

జవాబు : క్యాల్షియం.

Scroll to Top