Check Ammavodi Eligibility Details – Ammavodi Rules – Ammavodi Helpline Numbers for problem solving School Education Commissioner Veerabhadra. The Ammavodi 15000 amount may not be credited to your account for the following reasons. అమ్మఒడి అర్హుల వివరాలు సరిచూసుకోండి – పాఠశాల విద్య కమిషనరు వీరభద్రుడు. అమ్మఒడి అంమౌంట్ పడకపోవడానికి ఈ కారణాలు ఉండవచ్చు, వాటిని సరిచూసుకోండి. లేకుంటే అమ్మఒడి ఆర్ధిక సహాయం ఎట్టిపరిస్థితుల్లోనూ అందదు.
జగనన్న అమ్మఒడి అర్హుల వివరాలు సరిచూసుకోవాలని పాఠశాల విద్య కమిషనరు వి.చినవీరభద్రుడు తెలిపారు. అమ్మఒడి కార్యక్రమం అమలు తీరుపై అధికారులతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు, సంరక్షకులు తమ Bank Account Number, IFSC Code, Rice Card Number వంటి వివరాలు ‘అమ్మఒడి’ వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలని సూచించారు. వివరాల్లో లోపాలుంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి సరిదిద్దుకోవాలన్నారు. ఎటువంటి అభ్యంతరాలు, అర్జీలైనా ఆన్లైన్ ద్వారా ‘అమ్మఒడి’ వెబ్ పోర్టల్ లో మాత్రమే సరిచేసుకోవాలని పేర్కొన్నారు. ‘అమ్మ ఒడి’ విజయవంతానికి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులను కమిషనరు ఆదేశించారు. అర్హుల ఖాతాల్లో నగదు జమయ్యేంతవరకూ సంబంధిత శాఖల ప్రతినిధిని డిప్యూటేషన్ వేయాలన్నారు.
Check Ammavodi Eligibility Details – Ammavodi Rules – Ammavodi Helpline Numbers for problem solving School Education Commissioner Veerabhadra.
అమ్మఒడి నిబంధనలు
అమ్మఒడి అంమౌంట్ పడకపోవడానికి ఈ కారణాలు ఉండవచ్చు, వాటిని సరిచూసుకోండి.
1. 31.08.2020 నాటికి 5 సంవత్సరాలు నిండకపోయినా
2. 19.12.2020 తల్లికి మరియు విద్యార్థికి adhaar number లేకపోయినా
3. 19.12.2020 నాటికి ration card లేక rice card లేకపోయినా, లేదా card hold/inactive లో ఉన్నా,
4. 4 చక్రాల వాహనం కుటుంబం లో ఎవరి పేరు న ఉన్నను,
5. నిర్ధేశించిన పొలం కన్నా ఎక్కువ ఉన్నా
6. గతంలో income tax returns వేసినను,
7.current bill గత 6 నెలలు లో నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువ కట్టినను,
8. ఒక తల్లి తన ఇద్దరు పిల్లలకు వేరు, వేరు account numbers ఇచ్చినను,(అనగా ఒక చోట తల్లి account మరొక చోట సంరక్షణకు ని account number ఇవ్వడం)
9. Bank account మనుగడ లో లేకపోయినా,
10. కుటుంబం లో government pension/ salary(CFMS ద్వారా) పొందుతున్న వారికి
అమ్మఒడి ఆర్ధిక సహాయం ఎట్టిపరిస్థితుల్లోనూ అందదు
మస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్
- అమ్మ ఒడి సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా సాధికార సర్వేతో సరిచూసి ఈ నెల 20న మొదటి అర్హులైన తల్లుల జాబితా ను విడుదల చేస్తాం.
- ఈ జాబితాలను స్కూలు/ కళాశాల, గ్రామ /వార్డు సచివాలయ నోటీసు బోర్డు ల్లో ప్రదర్శిస్తాం. జాబితాల్లో తల్లులు లేదా సంరక్ష కుల ఆధార్ నెంబర్, బ్యాంక్ అక్కౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నెంబర్లలో తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత హెచ్‌ఎంలను సంప్రదించాలి.
- అనర్హులు గా తేలితే వార్డు/గ్రామ సచివాలయాల్లో తమ అర్హతలకు సంబంధించిన పత్రాల నకళ్ళను ఈ నెల 25లోగా అందజేయాలి.
- వీటిని వారు ఆన్‌లైన్‌లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) పరిశీలనకు అందజేస్తారు.
- ఈ నెల 26న అమ్మఒడి తుది జాబితా విడుదల చేసి, 27, 28 తేదీల్లో గ్రామసభ/వార్డు సభల్లో పెట్టి ఆమోదం తీసుకున్న అనంతరం 30న కలెక్టర్‌కు సమర్పిస్తాం’ అని డీఈవో చెప్పారు.
Check Ammavodi Invalid Mothers Names
Amma Vodi Official website at jaganannaammavodi.ap.gov.in