Supreme Court Green Singal on AP Panchayat Elections 2021 – Revised Schdeule , సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటీషన్ కొట్టివేత
Supreme Court Green Singal on AP Panchayat Elections 2021 – సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటీషన్ కొట్టివేత, ఏపీలో యథావిధిగా పంచాయతీ ఎన్నికలు. AP Gram Panchayat Elections Revised Schdeule Downlaod.
- పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
- ఎన్నికల ప్రతి సారి వాయిదా పడుతున్నాయి
- ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి
- దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా?
- ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగం
- కరోనా ఉన్నప్పుడు ఎన్నికల కావాలన్నారు
- ఈసీని తప్పు పడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు.
– జస్టిస్ కౌల్
ఏపీలో యథావిధిగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఏపీలో యథావిధిగా పంచాయతీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలపంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నంటినీ కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు.