SBI has introduced a bumper offer for government employees SGSP

SBI has introduced a bumper offer for government employees SGSP Account Benefits in Telugu

State Bank of India has introduced a bumper offer for government employees SGSP Account Benefits in Telugu. sbi sgsp application form, sbi sgsp application form pdf, sgsp account benefits in telugu, sgsp form pdf, sbi sgsp application form download, state government salary package application form, sbi sgsp form pdf, sbi sgsp apply online. ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. A special package for all employees of AP and TS state government employees through SBI branches. Their salary accounts, which come as a package, are considered a State Government salary.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

SBI has introduced a bumper offer for government employees SGSP Account

ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్‌బిఐ శాఖల ద్వారా జీతాలు తీసుకుంటే వారందరికీ ప్రత్యేక ప్యాకేజీ అందించనుంది. ఈ ప్యాకేజీ కిందికి వచ్చిన వారి వేతన ఖాతాలను స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీగా పరిగణిస్తారు.

అందుకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సేవింగ్‌ ఖాతాలను ఎస్‌బిఐ ప్రకటించిన స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీగా మార్చుకోవాల్సి ఉంటుంది. అలా మార్చుకుంటే, ఇతర ఖాతాదారులతో పోలిస్తే కొన్ని మెరుగైన సేవలు, రాయితీలు, ప్రయోజనాలు పొందవచ్చని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. ఏదైనా సేవింగ్స్‌ ఖాతాలో కనీసం 500 రూపాయిల నిల్వ ఉండాలనే నిబంధన ఉంది

అయితే, ఎస్జీఎస్పీ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ ఉన్నా ఎలాంటి జరిమానా పడదు. ఈ ఖాతాలు ఉన్నవారు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకునే విషయంలోనూ పరిమితులు ఉండవు.

సాధారణంగా వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయల వరకు బీమా ఉంటుంది. ఇందుకోసం రుణం తీసుకున్న సమయంలో ఖాతాదారే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎస్జీఎస్పీ ఖాతాదారులకు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే 30 లక్షల రూపాయిల బీమా వర్తిస్తుంది. వ్యక్తిగత, గృహ, విద్యా రుణాలు తీసుకున్నవారి నుంచి బ్యాంకులు రుణం మొత్తం ఆధారంగా ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తాయి. ఎస్జీఎస్పీ ఖాతాదారులు తీసుకునే రుణాలకు సంబంధించి, ప్రాసెసింగ్‌ ఫీజులో 50 శాతం రాయితీ లభిస్తుంది. లాకర్‌ ఛార్జీల్లో 25 శాతం రాయితీ పొందవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా వీరికి ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం ఉంటుంది. అంటే, ఖాతాలో నగదు లేకపోయినా రెండు నెలల వేతనంతో సమానమైన మొత్తం ముందుగానే తీసుకోవచ్చు. అయితే, నిర్ణయించిన గడువులోగా దీనిని చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని ఎస్‌బిఐ అధికారులు చెబుతున్నారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top