Chittoor SSA 297 Outsourcing Jobs filling Notification – Vacancies, Guidelines

Chittoor SSA 297 Outsourcing Jobs filling Notification : Vacancies, How to apply Chittoor SSA Outsourcing Posts, Guidelines and Post wise Vacancies. Chittoor District ssa.ap.nic.in recruitment 2018 ssa.ap.gov.in login chittoor ssa recruitment 2018-19 ap ssa notification 2018 ssa chittoor recruitment 2018 chittoor ssa outsourcing jobs 2018 spd ssa ap ssa.ap.nic.in Chittoor District. చిత్తూరు ఎస్‌ఎస్‌ఏలో పొరుగు సేవల ఉద్యోగాలు 297 పోస్టుల భర్తీకి సన్నాహాలు నెలరోజుల్లో నియామకాలు. సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో పొరుగు సేవల ద్వారా ఖాళీ పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.. ఆ శాఖ ఎస్పీడీ గుర్రం శ్రీనివాస్‌ జిల్లాల వారీగా ఎస్‌ఎస్‌ఏలో ఖాళీ పోస్టులను అన్నింటిని భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.. దీంతో ఇప్పటివరకు నియామకాల్లో ఉన్న అడ్డంకులను పరిష్కారం కానున్నాయి.. జిల్లా వ్యాప్తంగా 297 పోస్టులను పొరుగు సేవల ద్వారా నియమించనున్నారు.. వీటిలో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, మండల వనరుల కేంద్రాల్లో బోధన, బోధనేతర పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలని మూడు నెలల క్రితం ప్రకటన వెలువడింది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Chittoor SSA 297 Outsourcing Jobs filling Notification

అయితే నియామకాల్లో పలు జిల్లాలో దళారులు ప్రవేశించి అక్రమాలకు తెరదీశారు. రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడంతో నియామకాలు నిలిపివేశారు.. నిరుద్యోగులు అధికంగా ఉండటం.. పోస్టుకో రేటు నిర్ణయించి వసూలు చేయాలని దళారులు రంగ ప్రవేశం చేసిన విషయం విదితమే.

పారదర్శకంగా నియామకాలు

రాష్ట్ర ఎస్పీడీ.. పొరుగు సేవల ద్వారా నియామకాలు అన్నింటినీ పారదర్శకంగా చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. వీటికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశారు. ఎక్కడైనా అక్రమాలు చోటుచేసుకున్నట్లు రుజువైతే క్రిమినల్‌ చర్యలు తప్పవని అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులను.. ఎస్పీడీ హెచ్చరించినట్లు సమాచారం. పకడ్బందీగా నెల రోజుల్లో నియామకాలు పూర్తి చేయాలని తాజాగా ఆదేశించారు. కేజీబీవీల్లో సీఆర్టీ, ఎస్వో, తదితర బోధన పోస్టులకు జిల్లా పాలనాధికారి పర్యవేక్షణలో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేస్తారు. బోధనేతర సిబ్బంది పోస్టులు ఎస్‌ఎస్‌ఏ సంచాలకులు ఆదేశాలకు అనుగుణంగా నియామకాలను ఏజెన్సీ భర్తీ చేస్తుంది. జిల్లాకు నెల్లూరు ఏజెన్సీ ద్వారా పోస్టింగ్‌ చేపడతారు. ఈ ఏజెన్సీకి చిత్తూరులోని లక్ష్మీనగర్‌ కాలనీలో కార్యాలయం ఉంది.

జిల్లా కమిటీ ఇలా..

ఈ పోస్టుల భర్తీకి జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటవుతుంది. కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్‌, కన్వీనర్‌, సభ్యులుగా జిల్లా విద్యాశాఖాధికారి, ఎస్‌ఎస్‌ఏ పీవో, డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఉంటారు. నియామక ఏజెన్సీల ద్వారా అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కమిటీ పర్యవేక్షిస్తుంది. నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు పాటిస్తారు. ఇందులో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మార్గదర్శకాలు ఇలా.

పోస్టుల నియామకాలకు హాజరయ్యే అభ్యర్థులు, గత జులై ఒకటో తేదీకి 18ఏళ్లు నుంచి 30ఏళ్ల లోపు వయస్సు కల్గిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 44ఏళ్లు, దివ్యాంగులకు 49ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలను అన్నింటిని పరిగణలోకి తీసుకుం టారు. దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి ప్రతిభావంతుల జాబితాను కమిటీ ప్రకటిస్తుంది. జాబితా రూపకల్పనలో ముందుగా స్థానికతకు ప్రాధ్యాన్యత ఇస్తారు. రోస్టర్‌ ప్రకారం ఆ పోస్టుకు అర్హులు లేని పక్షంలో పక్క మండలం వారికి అవకాశం కల్పిస్తారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసిన జాబితాను జిల్లా కమిటీ క్షుణంగా పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తుంది. నియామకాల్లో ప్రభుత్వంలో రెగ్యులర్‌, పోస్టుల భర్తీకి అనుసరిచే విధానాలే అమలవుతాయి.

పోస్టుల వివరాలు ఇలా..

జిల్లా కార్యాలయ పరిధిలోని పొరుగు సేవల ద్వారా భర్తీ కానున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

 1. సీఆర్పీలు 33, 
 2. పార్ట్‌టైమ్‌ బోధకుల్లో ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌ 116, 
 3. వర్క్‌ ఎడ్యుకేషన్‌ 106, 
 4. పీఈటీ ఎడ్యుకేషన్‌ 13, 
 5. కేజీబీవీ పీఈటీలు 2, 
 6. సీఆర్టీలు జీవశాస్త్రం 1, 
 7. భౌతికశాస్త్రం 1, 
 8. ఆంగ్లం 2, 
 9. డీఎల్‌ఎంటీలు 2, 
 10. డీటీఈవో 7, 
 11. ఎంఐఎస్‌ సమన్వయకర్తలు 8, 
 12. సహిత విద్యలో ఎంఆర్‌లు 4, 
 13. హెచ్‌ఐలు 2 పోస్టులు ఉన్నాయి.

Chittoor SSA 297 Outsourcing Jobs filling Notification

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.