Prakasam District SSA Recruitment Notification 2018 – Vacancies, Apply Details

Prakasam District SSA Recruitment Notification 2018 – Vacancies, Apply Details, Eligibility Criteria, SelrSelec Process and Post wise Vacancies : Prakasam SSA Outsourcing Posts Recruitment Notification download. సర్వశిక్షా అభియాన్‌లో ఉద్యోగాలు. జిల్లా యూనిట్‌గా నియామకం, ఒంగోలు విద్యాశాఖలో ఉద్యోగాలు సాధించాలనుకుంటున్న జిల్లాకు చెందిన నిరుద్యోగులకు కొంత మేర ఊరట కలగనుంది. డీఎస్సీ కంటే ముందుగానే సర్వశిక్షా అభియాన్‌లోని ఖాళీలను పొరుగు సేవల పద్ధతిలో భర్తీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన దస్త్రాన్ని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్‌ అనుమతికి పంపినట్లు తెలిసింది. దీంతో ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఖాళీల భర్తీకి దాదాపు ఆమోదం లభించినట్లే. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని బోధన, బోధనేతర సిబ్బంది భర్తీ ఉంటుంది. వచ్చే నెల పదో తేదీలోగా ఖాళీలన్నింటినీ ప్రతిభ ఆధారంగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మూడు, నాలుగు రోజుల్లో జిల్లా కేంద్రం నుంచి వెలువడే నోటిఫికేషన్‌లో అన్ని వివరాలు తెలుస్తాయి. నవంబర్‌ 17వ తేదీలోపు నియామక ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగులంతా విధుల్లో చేరేలా ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ నుంచి మార్గదర్శకాలు అందాయి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Prakasam District SSA Recruitment Notification 2018 – Vacancies, Apply Details 

Prakasam District SSA Recruitment Notification 2018 - Vacancies, Apply Details

ప్రకాశం జిల్లాలో 75 ఖాళీల భర్తీ

జిల్లాలో 75 పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం లభించినట్లు తెలిసింది. ఇందులో సీఆర్పీలు-19, ఎస్‌వో-2 ఉండగా మిగిలినవి డీఎల్‌ఎంటీలు, ఎంఐఎస్‌ సమన్వయకర్తలు, ఐఈఆర్టీ సమన్వయకర్తలు, సీఆర్టీ, పీఈటీలు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, కార్యాలయ సబార్డ్‌నేట్‌ తదితర విభాగాల్లో భర్తీ చేస్తారు.

SSA Posts Exam Pattern – రాత పరీక్ష ఆధారంగానే..

బోధనా సిబ్బంది నియామకాలను రాత పరీక్ష ద్వార ఎంపిక చేయనున్నారు. దీనికి జిల్లా కలెక్టర్‌ లేదా సంయుక్త కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉండి డీఈవో, డైట్‌ ప్రధానాచార్యులు ఎస్‌ఎస్‌ఏ పీవో సభ్యులుగా ఉండి కమిటీ నియామకం ఉంటుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ పరీక్షను 100 మార్కులకు బహుళైచ్ఛిక విధానంలో నిర్వహిస్తారు. బోధనేతర సిబ్బంది నియామకాలు రిజర్వేషన్‌, రోస్టర్‌ పద్ధతిలో జరుగుతాయి. వీటికి సంబంధించి 1ః2 నిష్పత్తిలో అభ్యర్థులను ముఖాముఖి ద్వారా ఎంపిక చేస్తారు.

SSA Posts అర్హతలివీ

 1. ఈ ఏడాది జులై ఒకటో తేదీ నాటికి ఓబీసీ అభ్యర్థులు 39 ఏళ్లు, బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు 44 ఏళ్ల లోపు ఉండాలి.
 2. కేజీబీవీ ఎస్‌వో పోస్టులకు 50 శాతం మార్కులతో పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
 3. సీఆర్టీలు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేయడంతో పాటు టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
 4. పీఈటీలు ఇంటర్మీడియెట్‌తో పాటు వ్యాయామ విద్యలో డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
 5. డీఎల్‌ఎంటీలు డిగ్రీతో పాటు బీఈడీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ల ధ్రువీకరణ ఉండాలి.
 6. పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు పదో తరగతితో పాటు చిత్రలేఖనం, కమర్షియల్‌ ఆర్ట్స్‌, ఆర్కిటెక్చర్‌ డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
 7. సీఆర్పీలు పీజీ సోషియాలజీ, సోషల్‌ వర్కర్‌ లేదా బీఈడీతో పాటు టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వీటికి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రకాశం డిస్ట్రిక్ భర్తీ కానున్న SSA పోస్టులు

మొత్తం పోస్టులు–76
కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు–2
కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు–16
ఓకేషనల్ టీచర్లు–12
పీఈటీ–3
కంప్యూటర్ ఇన్స్ట్రుక్టర్లు–11
విలీన విద్యా భోదకులు–1
ఏఎన్ఎమ్–1
కుక్–4
సీఆర్పీ–19
పార్ట్ టైం ఇన్స్ట్రుక్టర్లు–2
MIS కోఆర్డినేటర్–1
అటెండర్–2

SSA Posts Selection Process

టీచింగ్ పోస్టులకి రాత పరీక్ష.
మిగిలిన పోస్టులకి జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక
ఇంటర్వ్యూకి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు.

SSA Posts Recruitment Committee

కమిటీ లో కలెక్టర్ గారు లేదా సంయుక్త కలెక్టర్ గారు,డీ ఈ ఓ గారు,SSA పీఓ గారు,డైట్ ప్రిన్సిపాల్ గారు సభ్యులు
కలెక్టర్ గారు రెండు లేక మూడు రోజులలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Age limit

ఈ ఏడాది జూలై 1 నాటికి ఓసీలు 39 ఏళ్లలోపు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 44ఏళ్లు, దివ్యాంగులు 49 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి.

SSA Recruitment Educational Qualification:

 • స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు 50 శాతం మార్కులతో పీజీ లేదా బీఈడీ పూర్తిచేసి ఉండాలి.
 • సీఆర్టీ పోస్టుకు 50 శాతం మార్కులతో డిగ్రీ, సమానమైన విద్య, ఏపీ టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
 • పీఈటీ పోస్టుకు ఇంటర్‌ తో పాటు, వ్యాయామ విద్యలో డిప్లొమా,
 • సైట్‌ ఇంజనీర్లకి బీటెక్‌ లేదా బీఈ…
 • సీఆర్పీకి పీజీ సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ లేదా బీఈడీతో పాటు టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
 • పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు పదో తరగతితో పాటు, చిత్రలేఖనం, కమర్షియల్‌ ఆర్ట్స్‌, ఆర్కిటెక్చర్‌లో డిప్లొమా పొంది ఉండాలి.
 • డీఎల్‌ఎంటీలు డిగ్రీతో పాటు బీఈడీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
 • అటెండర్లకు పదో తరగతి ప్రామాణికంగా తీసుకోనున్నారు.

How to Apply Prakasam SSA Posts

ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటారు.
జిల్లా కేంద్రం నుంచి వెలువడే నోటిఫికేషన్‌లో అన్ని వివరాలు ఉంటాయి.

Important Dates of SSA Recruitment

మండల, పాఠశాల స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఎస్‌ఎస్‌ఏ సన్నాహాలు చేస్తోంది.
డిసెంబర్ నెల 17వ తేదీలోపు నియామకాలను పూర్తిచేసి ఎంపికైన వారు విధుల్లో చేరేలా చర్యలు చేపడతారు.
ఎస్‌ఎస్‌ఏ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్‌పీడీ) మార్గదర్శకాలకనుగుణంగా జిల్లాస్థాయి కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకోనుంది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Prakasam SSA Vacancy List Of Schools Click Here
Prakasam SSA Vacancy Post Wise Qualifications Click Here
Application Form for SSA Jobs Click Here
Enclosures of SA Posts
Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.