ఇంటింటి సర్వే నవరత్నాల పథకాలు -సంక్షేమ పథకాల లబ్ధిదార్ల ఎంపిక – అనర్హులు వెరివేత

ఇంటింటి సర్వే నవరత్నాల పథకాలు -సంక్షేమ పథకాల లబ్ధిదార్ల ఎంపిక – అనర్హులు వెరివేత

‘రేషన్‌’ కుదింపునకు కసరత్తు
వేర్వేరుగా కార్డుల జారీకి ప్రభుత్వం సన్నాహాలు,
ఆరోగ్యశ్రీ కార్డులపై సర్వత్రా ఆసక్తి


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇంటింటి సర్వే నవరత్నాల పథకాలు -సంక్షేమ పథకాల లబ్ధిదార్ల ఎంపిక – అనర్హులు వెరివేత

వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదార్ల ఎంపికకు బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయనున్నారు. ఈ సర్వే వచ్చే జనవరి నెల 20వ తేదీ వరకూ కొనసాగుతుంది. జిల్లాలో 14.69 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. జిల్లాలో ఉన్న కుటుంబాల కంటే లక్షన్నర వరకూ అదనంగా కార్డులున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఉమ్మడి కుటుంబాల నుంచి కొత్తగా వివాహమైనవారు వేరు పడి కార్డులు తీసుకోవడం వల్ల చిన్న కుటుంబాల సంఖ్య పెరిగి జనాభా నిష్ప్తత్తిలో ఉండాల్సిన గణాంకాల కంటే కుటుంబాల సంఖ్య పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహిస్తున్న సర్వే వల్ల రేషన్‌ కార్డులపై నిశితంగా పరిశీలించనున్నారు.
 

ఇంటింటి సర్వే నవరత్నాల పథకాలు -సంక్షేమ పథకాల లబ్ధిదార్ల ఎంపిక - అనర్హులు వెరివేత

వైఎస్సార్‌ నవశకం పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని తలపెట్టారు. నవరత్నాల పథకాలు ప్రతి ఒక్క పేద వారికి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వీటిలో

  1. నూతనంగా రేషన్‌ బియ్యం అందచేసేందుకు ఒక కార్డు, 
  2. సామాజిక పింఛన్లు పొందేందుకు మరోకార్డు, 
  3. ప్రతి కుటుంబానికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు. 

Not Eligible Persons for Navarthnalu 

  1. ఇందుకు ఐదు లక్షల వరకూ గరిష్ట పరిమితిని విధించా రు.
  2.  ప్రభుత్వ అధికారులు, 
  3. ఇన్‌కం టాక్సు పేయర్లు

 కాకుండా మిగతా వారంతా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే ఈ కార్డు పొందవచ్చని అధికారులు తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా ఒక కారు ఉన్నా ఆరోగ్యశ్రీకి అర్హులే. ‘జగనన్న విద్యా దీవెన’ ద్వారా ‘అమ్మఒడి’, ఇతర స్కాలర్‌షిప్‌లు, నైపుణ్య కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణకు హాజర య్యేలా ఈ కార్డును అందిస్తారు. ‘జగనన్న వసతి దీవెన’ కార్డు ద్వారా ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఈ కార్డు అందిస్తారు. వీటితోపాటు ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన జాబితాలనూ ఈ సర్వేలో గుర్తిస్తారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విద్యా, వైద్య, సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకూ తెల్లరేషన్‌ కార్డులు ప్రమాణికంగా తీసుకుంటున్నారు. బియ్యం నాణ్యతగా లేవని వినియోగించకుండా తిరిగి డీలర్లకే విక్రయించే ప్రక్రియకు అడ్డుకట్ట వేసేందుకు, బియ్యం తీసుకోని వారికి సంక్షేమ పథకాలు మాత్రమే వర్తింపజేసేందుకు వీలుగా వేర్వురుగా కార్డులిచ్చే వ్యూహంతోనే ప్రభుత్వం ఈ సర్వేకు పూనుకుందని డీలర్లు భావిస్తున్నారు. బియ్యం కార్డులు విడిగా ఇవ్వడం వల్ల అవసరమైన వారే తీసుకుంటారని, దీని వల్ల రేషన్‌ అక్రమ వ్యాపారానికి బ్రేక్‌ పడుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేగాక ప్రత్యేక సర్వే వల్ల బోగస్‌ కార్డులు కొన్ని బయటపడతాయని కొంతమంది అధికారులు చెబుతుండగా సర్వే పేరుతో కొన్ని కార్డులు తొలగిస్తారనే ప్రచారమూ ఉంది. ఇప్పటికీ రేషన్‌ కార్డుల్లేని నిరుపేదలు ఎంతో మంది ఉండగా ధనికులు సైతం తెల్లకార్డులు కలిగి ఉన్నారు. కొన్ని బోగస్‌ కార్డులు కూడా డీలర్ల వద్ద ఉన్నాయని చాలా కాలంగా విమర్శలున్నాయి. ఆధార్‌తో అనుసంధానం చేసినా ఇప్పటికీ రేషన్‌ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికీ రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ జరుగుతూనే ఉంది. ఇటువంటి అక్రమాల నిరోధానికి త్వరలో ఇంటింటికి రేషన్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అలాగే బియ్యం మాత్రమే తీసుకునేందుకు వీలుగా రేషన్‌ కార్డుల నుంచి సంక్షేమ పథకాలను వేరు చేయనున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కొంత సొమ్ము ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ కార్డులపై తీవ్ర ఆసక్తినెలకొంది. తెల్లరేషన్‌ కార్డు ప్రమాణికం కాకుండా రూ.5 లక్షల ఆదాయం లోపు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం వల్ల వైద్య ఖర్చుల తగ్గేందుకు ఉపయోగపడతాయని చాలామంది ఆశలు పెట్టుకున్నారు.

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.