AP Bhasa Utsavalu Conduct Guidelines 2020- 21 | Vidyardi Vikasam Day wise Schdule : AP Language festival 2020-21 Innovative program called Vidyardi Vikasam Guidelines Day wise Scheduled Activities. AP Implementation of Innovative program called Vidyardi Vikasam (Child Holistic Development) conducting in Government Elementary, Secondary and Sr.Secondary Schools in AP Certain instructions released. భాషా ఉత్సవాలు 2020-21 మార్గదర్శకాలు – ప్రాథమిక, సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాల, కళాశాలలలో 21.12.2020 నుండి 31.12. 2020 తేదీ వరకు భాషా ఉత్సవాలు 2020-21 జరిపించాలి.ఈ కార్యక్రమం నిర్వహణకు మండల స్థాయిలో విద్యాశాఖాధికారి గారి అధ్యకతన ఒక మండల కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో అందరూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు భాషా ఉపాధ్యాయులు కూడా ఉంటారు.మండల కమిటీ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించుటకు బడ్జెట్ కు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చును.
AP Bhasa Utsavalu Conduct Guidelines 2020- 21 | Vidyardi Vikasam Day wise Schdule
ప్రతీ మండలానికి భాషా ఉత్సవాల నిర్వహణకు అమౌంట్ ఇవ్వబడుతుంది.కావున ఒక బ్యానర్ మరియు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు, స్నాక్స్, మంచి నీరు ఇవ్వవలసి ఉంది. AP Bhasa Utsavalu Conduct Guidelines 2020- 21 | Vidyardi Vikasam Day wise Schdule.

నిర్వహించవలసిన కార్యక్రమాలు (Programs to be organized)
a) వ్యాసరచన (Essay Competitions ) : భారతదేశం లోని భాషలను ప్రోత్సహిందునట్లు వ్యాసరచన పోటీ నిర్వహించాలి. ముఖ్యంగా “ఏక్ భారత్ – శేష్ భారత్” లో భాగంగా మనకు పంజాబీ భాషకు సంబంధించి వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. భారత రాజ్యాంగము పై కూడా వ్యాసరచన నిర్వహించాలి
b) రోల్ పై (Role Play) : పంచతంత్ర కథలతో డ్రామా వేయించవచ్చు. COVID 19 పై మానసిక ఆరోగ్యం / స్వాతంత్ర్ర ్రమరయోధుల జీవితాలపై “రోల్ ప్లే” మొదలగునవి నిర్వహించవచ్చు
c) భాషా క్రీడలు (Language Sports) : సామెతలు / పద్య పురాణం / చాటువు పద్యాలు మొదలైన వాటిలో పోటీలు నిర్వహించవచ్చు d) పద్య క్రీడలు (Poem Games):: పాటలు పాడుట, పంజాబీ పాటలు పాడుట మొదలైనవి నిర్వహించవచ్చు
e) వ్రాత పోటీలు (Reading & Writing Competitions) : ఒకటి లేదా రెండు వాక్యాలను పంజాబీలో వ్రాయుట COVID 19 భద్రతకు సంబంధించి చిత్రలేఖనము, పంజాబీ పరన పోటీలు మొదలగునవి నిర్వహించవచ్చు.
రోజువారీ కార్యక్రమం (Day wise Programe):
- 21.12.20 :పాఠశాల స్థాయిలో వ్యాస రచన పోటీలు జరిపించాలి.
- 22.12.20 : మండల స్థాయిలో వ్యాస రచన పోటీలు
- 23.12.20: పాఠశాల స్థాయిలో నాటికలు పోటీలు
- 24.12.20 మండల స్థాయిలో నాటిక పోటీలు
- 26.12.29:పాఠశాల స్థాయిలో భాషా క్రీడలు
- 27.12.20: మండల స్థాయిలో భాషా క్రీడలు
- 28.12.20 పాఠశాల స్థాయిలో పద్యాల పోటీలు
- 29.12.20 మండల స్థాయిలో పద్యాల పోటీలు
- 30.12.20 పాఠశాల స్థాయిలో చదవడం, రాయడం పోటీలు
- 31.12.20 మండల స్థాయిలో చదవడం, రాయడం పోటీలు
విద్యార్థులు ఇంటి వద్ద నుండి కూడా పోటీలో పాల్గొనవచ్చును. వారు రాసిన పత్రాలను ఉపాధ్యాయులు గాని, CRP లు గాని తీసుకొని మండల స్థాయి పోటీలకు పంపించవచ్చును. మండల విజేతలను ప్రతీ అంశమునకు సంబందించి ముగ్గురిని బహుమతులుకు ఎంపిక చేయాలి.
- ప్రాథమిక స్థాయి (1 నుండి 8 తరగతులు) నుండి ముగ్గురు,
- సెకండరీ స్థాయి 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ముగ్గుర్ని విజేతలుగా ప్రకటించి సర్టిఫికెట్స్, బహుమతులు ఇవ్వాలి. విజేతల పేర్లు, ఫొటోస్, వీడియోస్ ప్రతీ రోజూ సాయంత్రానికి జిల్లాకు పంపించాలి.
- ప్రతీ పాఠశాల నుండి తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉండాలి.
- ఉపాధ్యాయులు అందరూ బాధ్యత వహించి విద్యార్థులకు సూచనలు ఇవ్వాలి.
కార్యక్రమ నిర్వహణకు సూచనలు : (Program Management Instructions)
- MEO, HM, Senior Telugu Pandit, Senior English Assistant, Hindi Pandit, CRP లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి
- ప్రతి Activity & Documentary చేసి జిల్లాకు పంపాలి
- ఎవరైనా విద్యార్థులు ఏంటి నుండే పాల్గొంటే అవకాసం ఇవ్వండి
- ప్రతి పారశాల నంద్పీ ప్రాతినిధ్యం ఉండాలి
- పుస్తకాలను బహుమతులుగా ఇవ్వండి
- Snacks పిల్లలకు Arrange చెయ్యండి
AP Bhasa Utsavalu Prizes
ప్రథమ ,ద్వీతీయ ,తృతీయ బహుమతులు ఇవ్వాలి అంతకంటే ఎక్కువైనా ఇవ్వవచ్చు.
ఈ కార్యక్రమము నిర్వహించుటకు గాను ఎలిమెంటరీ స్థాయికి రూ:2,563/- మరియు సెంకండరీ ప్లాయికి రూ :2,380/- వెరసి మొత్తము రూ:4,943/- ప్రకారం ప్రతి మండలమునకు నిధులు విడుదల చేయబడును.
Note : పోటీలలో COVID నిబంధనలు పాటించాలి. శానిటైజర్ లు, మాస్కులు ఉండాలి.