Summative 1 Exam Dates 2018 – సంగ్రహణాత్మకానికి సిద్ధం

Summative 1 Exam Dates 2018 – సంగ్రహణాత్మకానికి సిద్ధం : సంగ్రహణాత్మకానికి త్మకానికి సిద్ధం నవంబర్ 12 నుంచి 29 వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు: ఈ విద్యాసంవత్సరంలో పాత పద్ధతిలో వివరణాత్మక విధానంలో ఎస్‌ఏ-1 పరీక్ష నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకు ఇప్పటికే పరీక్ష పత్రాల తయారీకి సబ్జెక్టు నిపుణులతో విజయవాడలో కార్యశాల నిర్వహించారు. ప్రస్తుతం వివరణాత్మకతతో పాటు బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. ప్రతి పరీక్షకు బిట్‌ పేపరు ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ సరఫరా చేస్తుండగా, 1 నుంచి 9వ తరగతి వరకు డీసీఈబీ (జిల్లా ఉమ్మడి పరీక్ష నిర్వహణ సంస్థ) సరఫరా చేస్తోంది. ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు మూల్యాంకనం ఉంటుంది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

FA1 Question Papers 2024: Download (Updated)

Summative 1 Exam Dates 2018 – సంగ్రహణాత్మకానికి సిద్ధం

ప్రాథమిక పాఠశాలలకు..
22న తెలుగు, 24న ఆంగ్లం, 26న గణితం, 27న పరిసరాల విజ్ఞానం పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో 50 మార్కులకు, పరీక్ష సమయం 9.30 నుంచి 12 గంటల వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.

పదో తరగతికి మూల్యాంకనంలో మార్పు

★ పదో తరతిలో పబ్లిక్‌ పరీక్ష పత్రం 80 మార్కులకే ఉండగా, మిగిలిన 20 అంతర్గత మార్కులుంటాయి.

గత ఏడాది విద్యాశాఖ కొన్ని మార్పులు చేసింది.

★ కొత్త విధానం ప్రకారం నాలుగు ఫార్మేటివ్‌లు 200 మార్కులను పది శాతానికి కుదిస్తారు. మిగతా పది శాతం మార్కులు ఎస్‌ఏ-1 మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. దీంతో పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ-1 మార్కులకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
★ 18 రోజుల పాటు పరీక్షలు

ఈనెల 12 నుంచి 29 వరకు ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

★ 6, 7, 8 తరగతులకు ఉదయం 10 నుంచి 12.45 గంటల వరకు, 9, 10వ తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

కాలపట్టిక..

▪12న ఓరియంటల్‌ భాష (సంస్కృతం, ఒరియా, పర్షియా) పేపరు-1
▪13న వృత్తివిద్య పేపరు-2)
▪15న ప్రథమ భాష పేపరు-1
▪16న తెలుగు ‌్ర 17న హిందీ
▪19న ఆంగ్లం-1
▪20న ఆంగ్లం-2
▪ 22న గణితం-1
▪24న గణితం-2
▪ 26న భౌతికశాస్త్రం
▪ 27న జీవశాస్త్రం
▪28న సాంఘికశాస్త్రం-1
▪ 29న సాంఘికశాస్త్రం-2


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top