NTR Bharosa PENSION SCHEME:
NTR BAROSA PENSION SCHEME ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల 66 లక్షలమంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. వారికి సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని పెంచింది. దీనిపై చంద్రబాబు ఇప్పటికే సంతకం చేశారు. అదే సమయంలో ఈ పథకం పేరును మార్చారు. “ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024″. SBI HRMS Login – Salary Slip / Pension Details Download.
ఇదివరకు వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా పెన్షన్ గా మార్చారు 2024. NTR BAROSA PENSION SCHEME ఈ పేరుతోనే జీఓ కూడా విడుదల అయింది. జులై 1వ తేదీ నుంచి 4,000 రూపాయల పింఛన్ ను ఆంధ్రప్రదేశ్ లో ప్రజలూ పొందనున్నారు. పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానుంది. అంటే- ఏప్రిల్, మే, జూన్ నెలలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన 3,000 రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలను కలిపి ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందించనున్నారు.
జులైలో చెల్లించాల్సిన 4,000లకు కొత్తగా ఏప్రిల్, మే, జూన్ నుంచి అందాల్సిన వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలను అర్హులైన లబ్దిదారు అందరికి అందించాలని చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది, నూతన తెలుగుదేశం ప్రభుత్వం. వికలాంగులకు హామీ మేరకు ఎన్టీఆర్ భరోసాపెన్షన్ అందించనున్నారు .. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 3,000 రూపాయల పింఛన్ అందుతుండగా ఆ మొత్తం రెట్టింపయింది. జులై నుంచి 6,000 రూపాయలను తీసుకుంటారు.
NTR BAROSA PENSION SCHEME increased to 15000
NTR BAROSA PENSION SCHEME 2024 దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ ఛైర్‌కు పరిమితమైన వారికి చెల్లించే పింఛన్ మొత్తం కూడా భారీగా పెరిగింది. గతంలో ప్రతి నెలా వారికి 5,000లను ప్రభుత్వం చెల్లిస్తోండగా.. ఇప్పుడు నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడది 15,000 రూపాయలకు పెరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పింఛన్ మొత్తం 5,000ల నుంచి 10,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం. సామాజిక భద్రత కింద చెల్లించే పింఛన్ల కోసం ప్రభుత్వం ఏకంగా సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 66 లక్షలమందికి పైగా లబ్దిదారులు పింఛన్ మొత్తాన్ని అందుకున వారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.