Lockdown extension until 17 May | Permission to these
Lockdown extension until 17 May | Permission to these : దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు.లాక్ డౌన్ పొడిగింపు తాజా ఆంక్షలు-అనుమతి వీటికే.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Lockdown extension until 17 May | Permission to these
■ ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 17వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధించిన లాక్ డౌన్ మే 3న ముగియనుండగా.. విపత్తు నిర్వాహణ చట్టం-2005 ప్రకారం మరో రెండు వారాలు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
👉 లాక్ డౌన్ లో అనుమతి లేనివి
● పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, క్రీడా ప్రాంగణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, సాంస్కృతిక కేంద్రాలు మూసివేసే ఉంటాయి.
● మతపరమైన కేంద్రాలు తెరుచుకోవు
● అత్యవసరం కాని పనులకు రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు అనుమతి లేదు.
● 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్ల పిల్లలు, గర్భిణీలు ఇళ్లలోనే ఉండాలి.
● రెడ్ జోన్లలో సైకిళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్ లు, ట్యాక్సీలకు అనుమతి ఉండదు.
● సెలూన్లకు కూడా అనుమతి లేదు.
● అంతర్ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
👉 వీటికి అనుమతి
● గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వ్యవసాయ పనులకు అనుమతి ఉంటుంది
● రెడ్ జోన్లలో ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్ సెంటర్లకు అనుమతి
● ఆరెంజ్ జోన్లలో ట్యాక్స్ సేవలకు డ్రైవర్, ఒక సహాయకుడి సాయంతో అనుమతి
● గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడి
● గ్రీన్ జోన్లలో 50 శాతం ప్రయాణీకులతో బస్సుకు అనుమతి
👉పెళ్లికి 50 మంది.. అంత్యక్రియలకు 20 మంది.
● బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి, భౌతికదూరం పాటించాలి
● బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి కంటే మించి ఉండరాదు
● వివాహాల వంటి శుభకార్యాలకు 50 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు
● అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు
● బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా వేయాలని ఆదేశం
● బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, పొగాకు నమలడం నిషేధం