e Paper Sharing in pdf is illegal – warning to netizens | Not Sharing News Paper
e Paper Sharing in pdf is illegal – warning to netizen. Warning to netizens for Newspaper pdf shared copies. Papers should not sharing in the PDF format of WhatsApp and Telegram Group and it is illegal. పిడిఎఫ్‌లో న్యూస్ పేపర్ షేరింగ్ చట్టవిరుద్ధం – నెటిజన్లకు హెచ్చరిక. నెటిజన్లూ బహుపరాక్.. న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలు షేర్ చేశారో. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఇకపై న్యూస్‌పేపర్ల పీడీఎఫ్ కాపీలు షేర్ చేయడం చట్టరీత్యా నేరం. ఈ మేరకు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) హెచ్చరించింది. ఈ-పేపర్లను పీడీఎఫ్‌గా మార్చి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం నేరమని పేర్కొన్న ఐఎన్ఎస్.. అలా షేర్ చేసే అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించాలని దినపత్రికల యాజమాన్యాలను కోరింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
e Paper Sharing in pdf is illegal – warning to netizens | Not Sharing News Paper
పేపర్స్ ను పీడీఎఫ్ రూపంలో వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లో పెట్టకూడదు
కాబ్టటి ఈ విషయాన్ని ఆయా దినపత్రికలన్నీ తమ యాప్‌లు, వెబ్‌సైట్లలో హెచ్చరికలు జారీ చేయాలని సూచించింది. న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలను సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరికలు చేయాలని ఐఎన్ఎస్ సూచించింది. అలాగే, పీడీఎఫ్‌లు, ఇమేజ్‌ల డౌన్‌లోడ్లను నియంత్రించేందుకు కనిపించని కోడ్‌ను వాటిల్లో ఇమడ్చాలని కోరింది. ఫలితంగా షేర్ చేసే వారిని సులభంగా గుర్తించవచ్చని ఐఎన్ఎస్ వివరించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});