CM Jagans review meeting on Education with collectors on 24th June 2019

CM Jagans review meeting on Education with collectors on 24th June 2019 

CM Jagans review meeting on Education with collectors – సదస్సులో విద్యాశాఖపై సమీక్ష, కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సమీక్ష, సీఎం జగన్ కామెంట్స్, అమరావతి. ఆంధ్రప్రదేశ్‌లో నిరక్షరాస్యత 33 శాతం ఉంది.జాతీయ స్థాయి సగటు కన్నా ఎక్కువ. అందుకే తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పెట్టాం. విద్యా రంగం నాకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో ఒకటి.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

CM Jagans review meeting on Education with collectors on 24th June 2019

* స్కూల్స్‌ ఫొటో గ్రాఫ్స్‌ తీసి, వాటిని అభివృద్ధి చేస్తాం
* ఫ్యాన్లు, ఫర్నిజర్, ప్రహరీగోడ, బాత్‌రూమ్స్‌ అన్నింటినీ బాగుచేస్తాం
* ప్రతి స్కూలును ఇంగ్లిషు మీడియం స్కూలుగా మారుస్తాం
* తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం.
* యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం.
* పిల్లలకు షూలు కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తాం.
* మధ్యాహ్న భోజనంలో నాణ్యతకూడా పెంచుతాం.
* ఇవన్నీ చేశాక ఏ పిల్లవాడుకూడా ప్రయివేటు స్కూలుకు పోవాలన్న ఆలోచన రాకూడదు.
* స్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు కు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం.
* కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని నూటికి నూరుపాళ్లూ అమలు చేస్తాం.
* ప్రయివేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
* దేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదు.
* ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు, అది సేవ మాత్రమే.
* జనవరి 26 నుంచి అమ్మ ఒడి చెక్కుల పంపిణీ.
* యూనిఫారం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నాం.ఇందులో అవినీతి చాలా ఎక్కువగా ఉంది.
* ప్రయివేటు స్కూలుకు తప్పనిసరిగా గుర్తింపు ఉండాలి, కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో టీచర్లు కూడా ఉండాలి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top