AP Legislative Council Cancel by AP Cabinet 2020 | Cancel of AP Legislative Council

AP Legislative Council Cancel by AP Cabinet 2020  | Cancel of AP Legislative Council

శాసనమండలి రద్దు ..క్యాబినెట్ ఏకగ్రీవ నిర్ణయం
AP Cabinet approval for cancellation of council. AP Legislative Council Cancel by AP Cabinet 2020 | Cancel of AP Legislative Council.
జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇదే ప్రధాన అజెండాతో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అందరూ ఊహించినట్లుగానే నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే మండలి రద్దు కాదు అనే చంద్రబాబునాయుడు, టిడిపి నేతలకున్న దింపుడు కళ్ళెం ఆశలు ఆవిరైపోయింది.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

 AP Legislative Council Cancel by AP Cabinet 2020 | Cancel of AP Legislative Council  AP Legislative Council Cancel by AP Cabinet 2020 | Cancel of AP Legislative Council

శాసన మండలి రద్దుకు ఏ.పి. మంత్రివర్గం ఆమోదం

ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాసేపట్లో ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రతిని కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు. గతంలో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలను ఆధారంగా చేసుకొని మండలి రద్దుకు రాష్ట్ర కేబినెట్‌ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఉభయసభల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది.
శాసన, న్యాయపరంగా ఉన్న చిక్కులను పరిగణలోనికి తీసుకొని, తదుపరి ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయం బ్లాక్‌ 1లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైన కొద్దిసేపటికే మండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top