Preponment and Stepup SGT, LP’s , School Assistants, Head Masters, Chnage Increment, FR22a(i), FR22B and brief Information
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Abount Preponment brief Information
PRC 1993 Scale అమలు వరకు ప్రతి వేతన సవరణ ఉత్తర్వులలో Senior Employee/Teachers కు వార్షిక వేతనాభివృద్ధి తేదీని జూనియర్తో సమానంగా ముందుగా పొందుటకు ప్రీపోన్మెంటు సదుపాయం కల్పించబడింది. 1999, 2005 PRC ఉత్తర్వులలో ఇట్టి సిఫారసులు లేని కారణంగా రివైజ్డ్ పే స్కేల్లో వేతన నిర్ణయం కారణంగా జూనియర్ల కంటే సీనియర్లు ఆలస్యంగా ఇంక్రిమెంటు పొందటం జరుగుతున్నది.
PRC 2010 సిఫారసులలో ఈ అసంబద్ధతను తొలగిస్తూ ప్రీపోన్మెంట్ సౌకర్యం వర్తింప చేయబడింది. దీని అమలు వలన ఒకే కేడర్లో పని చేస్తూ సీనియర్ , జూనియర్ ఉపాధ్యాయులకు తేది. 1.7.08 నాటికి ఒకే స్టేజిలో వేతన నిర్ణయం జరిగి తదుపరి Junior Increment Date Snior Increment Date కంటే ముందుగా ఉన్నట్లయితే Junior Increment Date నాటికే Senior కూడా Increment Sanction చేయబడుతుంది.
Junior : DSC-2002 ద్వారా నియామకం పొందిన ఒక SGT అక్టోబర్ 2004 లో రెగ్యులర్ స్కేలు వేతనం రూ. 5470/- పొందినాడు. ఆర్పిఎస్ 2010 లో అతని వేతనం రూ. 10900/- లుగా నిర్ణయించబడుతుంది. తదుపరి Increment తేది. 1.10.08 నాటికి వేతనం రు. 11200/- లుగా వృద్ధి చేయబడుతుంది.
Senior :DSC 2001 ద్వారా నియామకం పొందిన ఒక ఎస్జిటి జనవరి 2002న సర్వీసులో చేరి జనవరి 2004 లో వేతనం రూ. 5470/- గా నిర్ణయించ బడుతుంది. వీరికి ఆర్పిఎస్ 2010 లో తేది. 01.07.08 నాడు వేతనం రూ. 10900/- లుగాను , తదుపరి ఇంక్రిమెంట్ తేదీ జనవరి 2009 న రూ. 11200/- గాను నిర్ణయించ బడుతుంది.
Above Example Senior అయిన Teacher , Junior Teaher కంటే three months late గా Incremernt పొందుతున్నాడు. ప్రస్తుత ప్రీపొన్మెంట్ ఉత్తర్వుల మేరకు సీనియర్ ఉపాధ్యాయుని ఇంక్రిమెంట్ తేదీ జనవరి నుండి జూనియర్ ఉపాధ్యాయుని Increment date October Prepon కి చేయబడుతుంది.
Abount Stepup brief Information
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నిబంధనలు :
- 1. సీనియర్, జూనియర్ ఉపాధ్యాయుని నియామకం ఒకే యూనిట్లో జరిగి ఉండాలి. అనగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ , మున్సిపల్ ,ఎయిడెడ్లలో పని చేసే వారికి అదే యూనిట్లో పని చేసే వారితో పోల్చుకోవాలి.
- 2. సీనియర్, జూనియర్లు ఒకే పే స్కేలు కలిగి ఉండాలి.
- 3. సీనియర్ , జూనియర్లు ఇద్దరూ ఒకే పే స్కేలు , ఒకే సబ్జెక్టు మరియు ఒకే ప్రమోషన్ ఛానల్ కలిగిన కేటగిరీలోనికి పదోన్నతి పొంది ఉండాలి.
- 4. పదోన్నతి పొందుటకు ముందు క్రింది కేడరు పోస్టులో జూనియర్ యొక్క వేతనం సీనియర్ వేతనముకంటే తక్కువగా గాని లేక సమానముగా గాని ఉండాలి.
- 5. ఎఫ్ఆర్ 27 ప్రకారము సీనియర్ వేతనమును జూనియర్ వేతనముతో సమానము ( స్టెప్అప్) చేసిన తదుపరి సీనియర్ ఉపాధ్యాయునికి వార్షిక ఇంక్రిమెంట్ స్టెప్అప్ జరిగిన తేదీనుండి ఒక సంవత్సరమునకు మంజూరు చేయబడుతుంది.ఒక వేళ జూనియర్ వేతనము ఎఫ్ఆర్ 31(2) ప్రకారం ఇంక్రిమెంటు తేదీకి రీ ఫిక్స్ చేయబడియుంటే సీనియర్ వేతనము కూడా అదే విధంగా సదరు తేదీకి జూనియర్తో సమానంగా స్టెప్అప్ చేయబడును.
- 6. Senior Promotion పొందిన తదుపరి జూనియర్ దిగువ క్యాడరులోనే 6/12/18/24 సం||ల స్కేలులో వేతన నిర్ణయం పొంది తదుపరి పదోన్నతి పొందిన సందర్భములో జూనియర్ వేతనముతో సీనియర్ వేతనం స్టెప్అప్ చేయబడును.
- 7. Senior Promotion పొందినప్పుడు ఎఫ్ఆర్ 22( ఎ)( 1) ప్రకారం వేతన నిర్ణయం జరిగి, జూనియర్ పదోన్నతి పొందినప్పుడు ఎఫ్ఆర్ 22బి ప్రకారం వేతన నిర్ణయం జరిగిన సందర్భములో వీరి వేతనంలో కలిగే అసమానతను స్టెప్అప్తో సరి చేస్తారు.
- 8. Senior Pay కంటే Junior Pay (a) అదనపు అర్హతలకు మంజూరు చేయబడిన అదనపు ఇంక్రిమెంట్ల వల్ల కానీ ( b) కుటుంబ నియంత్రణ అమలుకు జారీ చేయబడిన వ్యక్తి గత వేతనము వలన గాని (c) జూనియర్కు మంజూరు చేయబడిన ప్రొత్సహక ఇంక్రిమెంట్లు వలనగాని పెరిగినట్లైతే , వీరి వేతనములో వచ్చిన వ్యత్యాసమును ఈ ఉత్తర్వుల ప్రకారం స్టెప్అప్ చేయు అవకాశము లేదు.
- 9. PRC 2010 సిఫారసు మేరకు పీఆర్సీ అమలు తేది. 01.07.2008 నాటికి పై నిబంధనల మేరకు జూనియర్ ఉపాధ్యాయుని కంటే సీనియర్ ఉపాధ్యాయుడు తక్కువ వేతనం పొందుతుంటే ఆ తేడాను సవరించిన తదుపరి ఆర్పిఎస్ 2010 స్కేళ్ళలో వేతన నిర్ణయం చేయబడుతుంది.
Example: DSC 89 లో 17.07.89 న 1010-1800/1010 వేతనంతో నియామకమైన A and B అనే ఇరువురు SGT లలో సెలక్షన్ లిస్ట్ ప్రకారం సీనియర్ అయిన
(a) అనేఉపాధ్యాయుడు ప్రథమ నియామకం తేదీకే , బిఎస్సీ , బిఇడి (మాథ్స్) అర్హతలు కలిగి, AAS స్కీములో 8 సం||ల స్కేలు తీసుకున్న అనంతరం 12.09.98 న SA (Maths ) Promotion పొందినందున FR 22 ( B)(రి) ప్రకారం వేతనం స్థిరీకరణ జరిగింది.
(b) అనే ఉపాధ్యాయుడు ఇంటర్, టిటిసి అర్హతలతో ఉద్యోగంలో చేరి తరువాత కాలంలో బిఎస్సీ , బిఇడి అర్హతలు సంపాదించి , 8/16 సం||ల స్కేళ్ళు తీసుకున్న అనంతరం 1.03.2006 న స్కూల్ అసిస్టెంట్ మాథ్స్గా ప్రమోషన్ పొందాడు. అతని వేతనం FR 22 B ప్రకారం స్థిరీకరించ బడింది. ఆ కారణంగా (B) అనే ఉపాధ్యాయుడు (A) కంటే 1 or 2 ఇంక్రిమెంట్లు అదనంగా వేతనం పొందే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో (A) వేతనాన్ని (B)కి ప్రమోషన్ పోస్టులో వేతన స్థిరీకరణ జరిగిన (1.03.06 / 01.07.06) తేదీ నాడు స్టెప్అప్ ద్వారా సమానం చేస్తారు. ఆ తదుపరి ఒక సంవత్సరం తర్వాత వార్షిక ఇంక్రిమెంటు ఇస్తారు. అటు పిమ్మట 01.07.08 నాటి వేతనం ఆధారంగా PRC 2010 లో Pay fixation జరుగుతుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
(adsbygoogle = window.adsbygoogle || []).push({});