AP Departmental Test Online Telugu Exam Pattern 2023
APPSC విభాగ పరీక్షలు అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సూచనలు. APPSC డిపార్ట్మెంటల్ పరీక్షలు ఆన్లైన్ అభ్యర్థులకు ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత టెస్టులో 2023 సూచనలు / మార్గదర్శకాలు / అభ్యర్థులకు AP విభాగ పరీక్షలు మార్గదర్శకాలు / psc.ap.gov.i n సూచనలను: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కంప్యూటర్ ద్వారా AP విభాగ పరీక్షలు నిర్వహించడం కానుంది బేస్ టెస్ట్ (CBT) మరియు APPSC దరఖాస్తు అభ్యర్థులకు విభాగ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సూచనలను ఇచ్చింది. కాబట్టి, ఆన్లైన్ డిపార్ట్మెంటల్ పరీక్షలకు వెళ్ళే ముందు అభ్యర్ధులు సూచనలను పాటించాలి.
AP Departmental Test Online Exam Pattern – Guidelines in Telugu 2023
డిపార్ట్ మెంటల్ టెస్ట్ – ఆన్ లైన్ పరీక్షా విధానము
# అభ్యర్ధి గంట ముందుగా పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి.
# పరీక్షా సమయానికి ౩౦ నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి.
# రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతఏ అభ్యర్ధిని లోపలికి అనుమతించరు.
# మీకు కేటాయించబడిన సిస్టమ్ నందు పరీక్షల లింక్ “లాగిన్ స్క్రీన్ ” అందుబాటులో ఉంటుంది ..ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి తెలియజేయాలి.
#10 నిమిషాల ముందు మీరు “లాగిన్ ” అవ్వాల్సి ఉంటుంది.
# లాగిన్ ఐడి = రోల్ నంబర్ (మీ హాల్ టికెట్ నెంబర్).
# పాస్ వర్డ్ = పరీక్ష రోజు మాత్రమే ఇవ్వబడుతుంది.
# ఇన్విజిలేటర్ పాస్ వర్డ్ ను ఉదయం పరీక్షకు అయితే 8.50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే 1.50 నిమిషాలకు ప్రకటిస్తాడు.
# ప్రశ్నలను , మరియు ఆప్షన్స్ ను కాపి చేయటం కాని నోట్ చేయటం కాని చేయకూడదు. అలా చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును.
# లాగిన్ అయిన తరువాత తెరపై ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్ లో మీ వివరాలు చెక్ చేసుకొని Confirm పై క్లిక్ చేయాలి.
# Detailed Exam Instructions వాటిని అర్ధం చేసుకొన్న తరువాత I AM READY TO BEGEN పై క్లిక్ చేయాలి.
# ప్రశ్నల యొక్క జవాబులు గుర్తించటానికి మౌస్ ను మాత్రమే వాడాలి.
# ఈ ఆన్ లైన్ పరీక్ష నందు టైమర్ కనపడుతూ ఉంటుంది .ఇంకా ఎంత టైముందో అది సూచిస్తుంది.
# మీ యొక్క ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నల రంగు మారుతూ ఉంటుంది.
- White (Square) – మీరు ప్రయత్నించని ప్రశ్నలు.
- Red(Inverted Pentagon) – మీరు జవాబు ఇవ్వని ప్రశ్నలు.
- Green (Pentagon) – మీరు జావాబులు పూర్తి చేసిన ప్రశ్నలు.
- Violet (Circle) – ఆ ప్రశ్న చూసారు అయితే జవాబు తరువాత గుర్తిస్తారు ( marked for Review).
- Violet ( Circle with a Tick mark) – ఆ ప్రశ్నకు జవాబు గుర్తించారు కాని Review కొరకు మార్క్ చేశారు.
# ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి . ఆ సమాదానం SAVE చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.
# Review & Next బటన్ నొక్కిన ఆప్రశ్న పరిశీలనకు ఉంచబడి తరువాత ప్రశ్న వస్తుంది.
# ఒక ప్రశ్నకు జవాబు తీసేయాలని అనుకుంటే CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి.
# SECTION NAME పై కర్సర్ ను ఉంచిన ఆ సెక్షన్ నందు జవాబు గుర్తించినవి , ఇంకా జవాబు గుర్తించాల్సినవి, తరువాత పరిశీలనకు ఉంచినవి సూచిస్తుంది .
# ఒక వేళ మీరు అక్షరములు పెద్దవిగా చూడాలనుకుంటే.. ఇన్విజిలేటర్ అనుమతితో పైన ఉన్న ఫాంట్ సైజ్ ఎంపిక చేసుకొని పెద్దవిగా చూడవచ్చు
# PWD అభ్యర్ధులకు 120 నిమిషముల తరువాత కూడా అదనంగా ఇంకో 20 నిమిషాలు SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది.
# ఏ విధంగానైనా system log out అయినా మనం ఇచ్చిన జవాబులన్నీ save అయి ఉంటాయి. ఏ టైమ్ లో పరీక్ష ఆగిపొయిందో ఆ టైమ్ నుండి మరలా మొదలవుతుంది.
# ప్రతీ తప్పు జవాబుకు మైనస్ మార్కులు ఉంటాయి. గుర్తుంచుకోండి.
# పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఒక షీట్ ఇవ్వబడుతుంది దానిపై లాగిన్ ఐడి ,పాస్ వర్డ్ రాయాలి.
# ఎట్టి పరిస్థితిలో key board ముట్టుకో రాదు .ముట్టుకుంటే ID lock అవుతుంది . అప్పుడు మీ ఇన్విజిలేటర్ సహాయం తీసుకోండి.
డిపార్టుమెంటు పరీక్షల మాక్ టెస్ట్(మాదిరి పరీక్షలు) ల కొరకై కింది లింక్ ఓపన్ చేయండిhttps://psc.ap.gov.in/(S(1ss4tuxzwrcg4fqznmt521s1))/HomePages/DepartmentalMockTests.aspx