School Assembly on 27th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం

School Assembly on 27th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ – 27th August, 2019 : AP / Telangana Today’s News, Good Poem, Today’s Good News, Today’s GK, Today’s Good Word, Today’s Good News, Today’s Nationalism, National / International Days, Today’s Child, Today’s Story, The Great Man’s Word, Today’s Proverb etc for School Assembly on 27th August, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

School Assembly on 27th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ : నేటి వార్తలు 27th August, 2019 (Today News)

  1. బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ కసరత్తు: రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌, సీనియర్‌ అధికారులతో సీఎం భేటీ అయ్యారు.
  2. కాళేశ్వరం పిటిషన్లపై విచారణ వాయిదా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వాయిదా వేసింది.
  3. 100 అడుగుల లోతు కుంగిపోయిన భూమి: ఇటీవల కాలంలో జిల్లాలో భారీగా వర్షాలు కురువడంతో భూమి లోపలకు కుంగిపోయిన సంఘటన కడప జిల్లా చింతకొమ్మ దిన్నెమండలం బయినపల్లెలో చోటుచేసుకుంది.
  4. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా పద్మ ప్రమాణం: ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారం చేశారు.
  5. 318 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం. ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా. శతకంతో చెలరేగిన రహానె. 100 పరుగులకే కుప్పకూలిన విండీస్‌: టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా(5/7) విజృంభించడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

మహానీయుని మాట

“బాధే బలవంతుణ్ణి చేస్తుంది.
భయమే ధైర్యవంతుణ్ణి చేస్తుంది.
వైఫల్యమే వివేకవంతుణ్ణి చేస్తుంది.”

నేటీ మంచి మాట

“బంధాన్ని కాపాడుకోడానికి తల వంచాల్సివస్తే వంచేయి కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సివస్తే ఆ బంధాన్ని వదిలేయ్.”

చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 27

సంఘటనలు

1995 : ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి.
1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
2003: దాదాపు గత 60, 000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరగా వచ్చింది.

జననాలు

1898: రాజరత్నం పిళ్ళై, ప్రముఖ నాదస్వర విద్వాంసుడు. (మ.1956)
1908: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001)
1908: లిండన్ బి జాన్సన్, సుప్రసిద్ధ రాజకీయవేత్త, రచయిత. (మ.1973)
1909: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970)
1928: వోలేటి వెంకటేశ్వర్లు, ప్రముఖ సంగీత విద్వాంసుడు. (మ.1989)
1933: నాన్సీ ఫ్రైడే, స్త్రీ లైంగిక తత్వం మరియు స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి (మ.2017).
1955: వల్లూరు శివప్రసాద్, ప్రముఖ నాటకకర్త.
1957: నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
1963: సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ సినిమా నటి.
1972: ఖలీ, భారతీయ మల్లయోధ నిపుణుడు, నటుడు.

మరణాలు

1534: ఇస్మాయిల్ ఆదిల్‌షా, బీజాపూరు (1510 నుండి 1534 వరకు) సుల్తాను. (జ.1498)
1976: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923)
2002: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911) .
2006: హృషికేష్ ముఖర్జీ, సుప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1922)
2010: కంభంపాటి స్వయంప్రకాష్, ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు లైంగిక వ్యాధుల నిపుణుడు. (జ.1962)

నేటి సుభాషితం

“ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి”

“Darkness cannot drive out darkness; only light can do that. Hate cannot drive out hate; only love can do that.”

మంచి పద్యం

సతము వెలుగొందునది దివ్య శాంతిసుమ్ము
రాగమి సుమింత లేకుండ యాచరించు
యజ్ఞమయ మైన కర్మమ్ము నందుసుమ్ము
ఋషులు చూపినదియ్య దమృతపుబాట

(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన “శ్రుతి సౌరభము” అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)

నేటి జీ.కె


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రశ్న: ‘మా’ నది భూటాన్‌లో ఉంది. మరి ‘పో’ నది ఎక్కడ ఉంది?

జ: ఇటలీ

మన జాతీయములు

ఆలస్యం అమృతం విషం

వివరణ:  దేవ… దానవులు పాల సముద్రాన్ని చిలికి నప్పుడు అమృతము పుట్టింది. దానిని దేవ దానవులకు పంచడానికి శ్రీహరి పూనుకున్నాడు. మహావిష్ణువు ముందుగా దేవతలకు అమృతాన్ని పంచుతు.. మధ్యలో దానవులు వస్తే ఆగమని చెప్పుతూ వచ్చాడు. వారు ఆలాగె ఆగారు. చివరకు అమృతం అంతా దేవలకే సరిపోయింది. దానవులకు మిగలలేదు. తీసుకోవడములో ఆలస్యం చేస్తే అమృతం విషం అవుతుందని ఈ సామెత పుట్టింది. ఆలస్యం చేస్తే అమృతం అయినా విషం అవుతుందని ఈ సామెతకుఅర్థం. చేయవలసిన పని నిర్దిష్ట సమయానికి చేయని యెడల జరుగు అనర్థమును హెచ్చరించు సందర్భములో ఈ సామెతను వాడెదరు.

ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె

వివరణ:
పెళ్ళి అయిన తర్వాత అప్పటి వరకు అమ్మ చీర కొంగు పట్టుకుని తిరిగే మగ పిల్లలు పెళ్ళాం మోజులో పడి అమ్మని నిర్లక్ష్యం చేస్తారు.ఆలి మాటకి విలువ ఇస్తూ అమ్మ మాటని పెడ చెవిన పెట్టే కొడుకులను ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఆలి తీపి (బెల్లం), అమ్మ ఘాటు (అల్లం) లా అనిపిస్తోంది అని ఈ సామెత అర్ధం.