School Assembly on 20th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం

School Assembly on 20th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం

పాఠశాల అసెంబ్లీ – 20th August, 2019 : నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

School Assembly on 20th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం


నేటి వార్తలు 20-08-2019

  1.  తెలంగాణ గవర్నర్ నరసింహన్‌కు అస్వస్థత.. ఢిల్లీకి పయనం
  2.  సైనిక్‌ స్కూళ్లలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన
  3. ఏపీ బేవరేజస్‌లో సేల్స్‌ సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్‌ ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్టు/ అవుట్‌సోర్స్‌ ప్రాతిపదికన
  4. భూటాన్ దేశం తోటి స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
  5. ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని ఆపనంతకాలం పాకిస్తాన్ తో చర్చలు అసాధ్యమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
  6. ముస్లింల ప్రయోజనాల కోసమే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
  7. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలలో కురిసిన కుంభవృష్టి వలన 28 మంది మృతిచెందగా, 22 మంది గల్లంతయ్యారు.
  8. భారతదేశానికి సమగ్ర విద్యుత్ విధానం అవసరమని ముఖ్యమంత్రి కేసిఆర్ పేర్కొన్నారు.
  9. ఐరోపా అథ్లెటిక్స్ పోటీల్లో భారత స్టార్హిమదాస్ స్వర్ణ పతకం సాధించారు.
  10. నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం కానున్నాయి.

మహానీయుని మాట

” మనం కేవలం విజయాల నుంచే పైకి రాలేము. అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. “

నేటీ మంచి మాట

” మాటకు మాట ప్రతీకారం కాదు… మౌనమే దానికి సమాధానం… “


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి చిట్టి కథ

ఒక రాజ్యం లో ఒక బిచ్చగాడు ఉండేవాడు.
అతను రాజభవంతి దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవంతిలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు.
ఒక రోజు రాజుగారు అందరికీ విందు ఇస్తున్నారు అనేవార్త విన్నాడు.
ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది.
తన దుస్తులు చూసుకున్నాడు అన్ని చిరిగిపోయాయి.
ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు.
రాజభవనము దగ్గరకి వెళ్లి కాపలా వారిని బ్రతిమిలాడి, దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు.
ఎంతో ధైర్యం కూడగట్టుకొని , చాలా వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు.
అతన్ని చూడగానే రాజు. “నీకేమి కావాలి” అని అడిగాడు .దానికి ఆ బిచ్చగాడు రాజు గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు. “రాజా! నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి.
రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ “ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు ,ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు”. అన్నాడు.
బిచ్చగాడి ,కళ్ళ వెంట నీరు రాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు.
ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని ధరించి అద్దములో చూచుకొని మురిసిపోయాడు బిచ్చగాడు .
అయితే రాజు గారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజూ గారి దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది …
ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తనవెంట త్రిప్పేవాడు.
రాజా దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని.
రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు ఆనందంగా లేదు. బైట ఎక్కడో దాచిన తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారవేస్తారేమో అని భయం.
క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది . ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు . కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారంతో ఆ మూట వదిలేవాడు కాదు. అతని తోటి వారు అతనిని చూసి, ధరించిందేమో రాజు దుస్తులు మోసేదెమో పాత గుడ్డలు అని హేళన చేస్తూ , “పీలిక గుడ్డల మనిషి ” అని పేరు పెట్టారు. చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి మంచం పై నుండి లేవలేక పోయేవాడు…
పక్కనున్న జనాలు అతని తలగడ దగ్గర ఉన్న పాతబట్టల మూటను చూశారు. అది చూసి, ఎంత విలువైన చిరగని ,తరగని దుస్తులు ధరించినా కూడా బిచ్చగాడికి ,ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు.
వాటి సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి , ఏ రోజూ సంతోషమును పొందలేదు గదా ! అని బాధ పడ్డారు.
ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం అందరమూ కూడా ఈ అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా మోస్తూ ఉంటాము .
అవి ఏమిటంటే శత్రుత్వము, ఈర్ష్య ,ద్వేషము ,కోపము ,తన భాధలు మొదలగునవి ఎన్నో జ్ఞాపకాలు . అంతే కాదు ఈ భావనలతో మాటి మాటికీ దుర్గుణాలను, దుఃఖాన్ని గుర్తుతెచ్చుకుంటూ జీవితంలోని అందమైన ,సంతోషమైన వాటిని అనుభవించలేము , గుర్తించలేము కూడా !ఎపుడో ,ఎక్కడో జరిగిన సంఘటనలను ఎక్కడకిక్కడ ,ఎప్పటికప్పుడు వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాతబట్టల మూట లాగా , ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు , అశాంతికి కారణము.

చరిత్రలో ఈరోజు ఆగష్టు 20th, 2019

సంఘటనలు

1828: బ్రహ్మసమాజాన్ని రాజా రామమోహనరాయ్ స్థాపన
2015 – తాడేపల్లిగూడెంలో నిట్ (నేషనల్ ఇంస్టిట్యూట్ ఓఫ్ టెక్నాలజీ) సంస్థకు శంకుస్థాపన జరిగింది.

జననాలు

1833: బెంజమిన్ హారిసన్, అమెరికా 23వ అధ్యక్షుడు. (మ.1901)
1858: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (మ.1931)
1920: రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక గ్రంథ రచయిత.
1927: ఎ.వెంకోబారావు, ప్రముఖ సైక్రియాట్రిస్ట్. (మ.2005)
1928: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (మ.1994)
1931: బి.పద్మనాభం , తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (మ.2010)
1935: సి. ఆనందారామం, కథా, నవలా రచయిత్రి.
1935: గౌరు తిరుపతిరెడ్డి, ప్రముఖ వాస్తునిపుణుడు (మ.2016)
1944: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1991)
1946: ఎన్.ఆర్. నారాయణ మూర్తి, 1981లో ఇన్ఫోసిస్ని స్థాపించినవారు.
1947: వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (మ.2015)
1974: ఏమీ ఆడమ్స్, అమెరికా దేశానికి చెందిన నటి మరియు గాయకురాలు.

మరణాలు

1923: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు వాగ్గేయకారుడు. (జ.1856)
1930: చార్లెస్ బాన్నర్‌మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్. (జ.1851)
2012: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925)
2014: మహమ్మద్‌ తాజుద్దీన్‌ ఖాన్‌, పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత, అధ్యాపకుడు, పాత్రికేయుడు.

జాతీయ / అంతర్జాతీయ దినాలు

1897: మలేరియా వ్యాధి ‘ఎనాఫిలాస్’ అనే ఆడ దోమ కాటువల్ల సంభవిస్తుందని ప్రముఖక శాస్త్రవేత సర్ రోనాల్డ్ రాస్ చాటిచెప్పిన రోజుని మలేరియా నివారణ/ప్రపంచ దోమల దినోత్సవంగా పాటిస్తారు.
1944: సద్భావనా దినోత్సవం – (రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా)

నేటి జాతీయం

తేలు కుట్టిన దొంగలా

దొంగతనానికి ఇంట్లో దూరిన దొంగ తేలు కుట్టినా (పట్టుబడతాడు కాబట్టి)అరవలేడు. అదే విధంగా తాము ఉండకూడని పరిస్థితిలో ఉన్నవారు అట్టి సమయంలో తమకు ఏదైనా నష్టం జరిగినప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఏమీ చెయ్యలేరు.

మహానీయుని మాట

” విజయానికి ఒకే ఒక్క మార్గం మరొక్కసారి ప్రయత్నించడమే. “

నేటీ మంచి మాట

” నేను ఏ పని చేయలేను అని అనుకున్నందువల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ‘ప్రయత్నిస్తాను’ అనుకున్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. “

నేటి ఆణిముత్యం

చక్కఁ దలంపఁగా విధివశంబున నల్పునిచేతనైన, దాఁ
జిక్కి యవస్థలం బొరలుఁ జెప్పఁగ రాని మహాబలాఢ్యుఁడున్
మిక్కిలి సత్త్వసంపదల మీఱిన గంధగజంబు మావటీఁ
డెక్కియదల్చి కొట్టికుదియించిన నుండదె యోర్చి? భాస్కరా!

భావం:

ఎన్నరాని బలముగలవాడైనా, దైవగతిచే అల్పుని చేతనైన పరిభవింపబడును. మదపుటేనుగు బలాధికమైనాను మావటికి లోబడి ఓర్చి ఉండునుగదా?

నేటి సూక్తి.

విజేత అవ్వాలంటే ఎవరినో ఓడించాల్సిన అవసరం లేదు, ముందు మనల్ని మనం గెలవాలి.
———- గౌతమ బుద్ధుడు.

నేటి ప్రశ్న:

“ నా గొడవ” పుస్తక రచయిత ఎవరు?

జవాబు: కాళోజీ నారాయణరావు.