SBI Housing Loan interest rate reduced | Do you know how much benefit in Telugu

SBI Housing Loan interest rate reduced | Do you know how much benefit in Telugu

ఎస్బీఐ హౌసింగ్ లోన్ వాళ్లకు పండగే ! ఎంత వడ్డీ తగ్గిందో తెలుసా ?


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

➥స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గృహ రుణాలు తీసుకున్న వాళ్లందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.35 శాతం తగ్గించిన వెంటనే ఎస్బీఐ కూడా మొట్టమొదటగా వడ్డీ రేట్లలో కోత విధించింది. ఏ ప్రభుత్వ రంగ బ్యాంకూ చేయని సాహసాన్ని చేసి ఎస్బీఐ పండుగలకు ముందే తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

➥రెపో రేటును హౌసింగ్ లోన్‌కు జూన్ 2019లో లింక్ చేసిన ఘనత కూడా ఎస్బీఐ దక్కించుకుంది. దీన్ని బట్టి ఆర్బీఐ తన వడ్డీ రేట్లను సమీక్షించిన ప్రతీ సారీ .. వీళ్ల వడ్డీ రేట్లు కూడా ఎలాంటి ప్రత్యేక సమీక్షా లేకుండా మారిపోతాయి. ఇది చాలా మంచి ప్రయోజనం. ఎందుకంటే.. ఆర్బీఐ సమీక్ష తర్వాత బ్యాంకులు మళ్లీ వడ్డీ రేట్లను సమీక్షిస్తేనే కస్టమర్లకు ప్రయోజనం ఉంటుంది.

➥ఇక రోజు ఎస్బీఐ తగ్గించిన 35 బేసిస్ పాయింట్స్ తగ్గింపు నేపధ్యంలో ఎలాంటి ప్రయోజనం దక్కబోతోందో ఓ సారి చూద్దాం.

➥ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.25 లక్షల రుణాన్ని 20 ఏళ్లకు తీసుకున్నారని అనుకుందాం. దానికి ఎస్బీఐ ఇప్పటివరకూ వసూలు చేస్తున్న వడ్డీ 8.60 శాతం ఉందని లెక్కిద్దాం. ఈ లెక్కన అసలు రూ.25,00,000 + వడ్డీ రూ.27,44,977 అవుతుంది. దీనికి నెలనెలా ఈఎంఐ రూ.21854 అవుతుంది.

➥అదే తాజాగా మారిన వడ్డీ రేట్ల ప్రకారం అదే రూ.25 లక్షల మొత్తం, 20 ఏళ్ల సమయానికి 8.15 శాతం వడ్డీగా లెక్కిద్దాం. ఇప్పుడు అసలు రూ.25,00,000 + వడ్డీ 26,12,394 అవుతుంది. దీనికి నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.21302 అవుతుంది. అంటే నెలనెలా రూ.550 వరకూ తగ్గుతుంది.

➥ఓస్.. అంతేనే అనుకోవద్దు. ఎందుకంటే.. ఈ మొత్తం ఎఫెక్ట్ మీ చెల్లింపు కాలపరిమితి పూర్తయ్యేసరికి రూ.1,32,583 ఆదా అవుతుంది. అంటే.. ఆర్బీఐ చేసిన ఈ చిన్న మార్పు వల్ల మీ జేబుకు ఎంత ఆదా చేస్తోందో తెలిసి ఉంటుంది. source: goodreturns in.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
SBI Bumper Offer low interest rate on housing Loan Click here

Scroll to Top