Postal DacPay App Service – India Post Payments Bank App Dowload. Indian Postal Payment Bank – IPPB has launched a new app (DacPay) for its customers. How to use India Postal Bank DakPay App – India Post Payments Bank launches digital payment app: The Department of Post (India Post) and the India Post Payments Bank (IPPB) on Tuesday launched a new digital payment app ‘DakPay’ for its customers to operate their banking service online.
DacPay app is available in 12 languages of India along with English- Hindi, Bengali, Marathi, Telugu, Tamil, Urdu, Gujarati, Malayalam, Kannada, Oriya, Punjabi and Assamese.
Postal DacPay App Service – India Post Payments Bank App Dowload
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB కస్టమర్ల కోసం సరికొత్త యాప్ రూపొందించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్-DoP సహకారంతో డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ ‘డాక్‌పే’ని పరిచయం చేసింది. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, లా అండ్ జస్టిస్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘డాక్‌పే’ యాప్‌ని లాంఛ్ చేశారు.
Ravi Shankar Prasad@rsprasad (Dec 15) : Taking the vision of PM @narendramodi’s financial inclusion and #AatmaNirbharBharat forward, @IndiaPostOffice today launched DakPay – a UPI based digital payments app for inter-bank fund transfers, merchant payments service and also access to various postal products.
- పోస్టల్ బ్యాంక్ నుంచి ‘డాక్‌పే’యాప్
- దేశంలో ఎక్కడికైనా క్షణాల్లో నగదు పంపిణీ
- గ్రామీణ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు
- అన్ని బ్యాంక్ అకౌంట్లు డాక్‌పేకి అనుసంధాన వెసులుబాటు
మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి దేశంలో ఎక్కడికైనా తక్షణం నగదు పంపిణీ చేసే సౌకర్యాన్ని తపాలా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ‘డాక్‌పే’ పేరుతో మొబైల్ డిజిటల్ పేమెంట్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. డాక్‌పే యాప్ ద్వారా అన్ని బ్యాంకు అకౌంట్లను అనుసంధానం చేసుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చని ఐపీపీబీ తెలిపింది. నగదు బదిలీ, చెల్లింపులతో పాటు పోస్టల్ శాఖ అందిస్తున్న వివిధ సేవింగ్స్ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చు.
DockPay App Provid Services
UPI : ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు సురక్షితంగా, వేగంగా నగదు బదిలీ.
VDC : రూపే డెబిట్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లకు డిజిటల్ విధానంలో చెల్లింపులు చేయొచ్చు.
DMT : దేశంలో ఎక్కడి బ్యాంకు ఖాతాకైనా తక్షణం నగదు బదిలీ చేసుకోవచ్చు.
APS : ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసుల్లో భాగంగా ఇంటి వద్దనే వేలి ముద్ర వేయడం ద్వారా బ్యాంకు సేవలు పొందవచ్చు.
Bill Payment : దేశ వ్యాప్తంగా 470కిపైగా వ్యాపార సంస్థలకు నగదు రహిత లావాదేవీలు చేయొచ్చు. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఉంటుంది.
Postal Schemes : తపాల శాఖ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, సుకన్య సంవృద్ధి ఖాతా వంటి వివిధ ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చు.