Nutrition Month Celebrations in AP Schools From 3rd Sep to 30th Sep 2019 | పోషకాహార మాసోత్సవాలు

Nutrition Month Celebrations in AP Schools From 3rd Sep to 30th Sep 2019 | పోషకాహార మాసోత్సవాలు Guidelines 

Nutrition Month Celebrations in AP Schools From 3rd Sep to 30th Sep 2019. The Ministry of Education released the Advanced Nutrition Program in all Government schools from 3 to 30 Sep month. 3 నుంచి పాఠశాలల్లో పోషకాహార మాసోత్సవాలు – Guidelines to Teachers and head masters from Issued orders Education department. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘రాష్ర్టీయ పోషణ్‌ మాస్‌’ కార్యక్రమాన్ని ఈనెల 3 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Nutrition Month Celebrations in AP Schools From 3rd Sep to 30th Sep 2019 | పోషకాహార మాసోత్సవాలు

ఈ కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, స్థానికులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని సూచించింది. సర్వశిక్షా అభియాన్‌ జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

1st week Program Activities 

3 నుంచి 8వ తేదీ వరకు మొదటి వారం రోజుల్లో వైద్య ఆరోగ్యశాఖ సహకారం తీసుకుని రక్తహీనతగల విద్యార్థులను గుర్తించడం, బాలబాలికల బరువు, ఎత్తులు బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ), ఇమ్యునైజేషన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కార్యక్రమాలను టీచర్లు, విద్యార్థుల బృందం నిర్వహిస్తుంది.

2nd week Program Activities 

9 నుంచి 15వ తేదీ వరకు రెండో వారం పోషకవారంగా నిర్వహణ. కార్బొహైడ్రేట్స్‌ ప్రాధాన్యత, ప్రోటీన్స్‌, ఫ్యాట్‌, విటమిన్‌, మినరల్‌ ప్రాధాన్యతలను విద్యార్థులకు వివరించడంతోపాటు ఐరన్‌ పోలిక్‌ సప్లిమెంట్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతారు. కిచెన్‌ గార్డెన్లపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఇందులో స్కూల్‌ ఏఎన్‌ఎం, పీఈటీ, సైన్సు టీచర్ల బృందం పాల్గొంటొంది.

3rd week Program Activities

16 నుంచి 22వ తేదీ వరకు మూడోవారం విద్యార్థులకు వ్యాసరచన, పోషకాహారంపై చర్చా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పెయింటింగ్‌, ఎగ్జిబిషన్‌ పోటీలను ఉపాధ్యాయులు, విద్యార్థుల బృందం నిర్వహిస్తుంది.

4th week Program Activities 

 23 నుంచి 29వ తేదీ వరకు 4వ వారం కార్యక్రమాలుగా పోషకాహారంపై చర్చ నిర్వహిస్తారు. 8, 9 తరగతుల విద్యార్థులకు ఎనీమియా, హ్యాండ్‌వాష్‌, పోషక విలువల ఆహారం, డయేరియా, విటమిన్లు, మినరల్స్‌ గురించి తెలియజేస్తారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top