How to increase immunity in children at Home 2023 – What kind of food should be given to children to increase immunity? : ఇంట్లోనే ఎలా చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెరిగేలా చూడాలి, పిల్లలకూ కొవిడ్ వచ్చే అవకాశాలున్నాయని వినిపిస్తోన్న వార్తలు భయం కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నా. రోగనిరోధక శక్తి పెరగాలంటే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి.
How to increase immunity in children at Home – ఎలా చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెరిగేలా చూడాలి
రోగనిరోధకత శక్తి చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముందు నుంచీ సరైన పోషకాహారం తీసుకోని వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. చిన్నారులకు ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు అందేలా చూసుకోవాలి. అంటే బి-కాంప్లెక్స్ విటమిన్ సి, డిలు. వీటికోసం భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, పాలు, నట్స్, పొట్టుతో ఉన్న ధాన్యాలు… అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే… ఆహారంలో వైవిధ్యం ఉండాలి. ముఖ్యంగా జింక్, ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు, మాంసకృత్తులు ఇమ్యూనిటీని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
For Proteins
- పాలు, పెరుగు, వేరుసెనగలు, గుడ్డు లాంటి వాటి నుంచి మాంసకృత్తులు లభిస్తాయి
- మొలకెత్తిన గింజలు, పెరుగు, పొట్టుతో ఉన్న పప్పుదినుసుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఆహారంలో చీజ్, పనీర్, సోయా నగ్గెట్స్ వంటివీ తినేలా చూడండి.
For Iron, zinc
- ఐరన్, జింక్ కోసం నువ్వులు, గసగసాలు, పుట్టగొడుగులు, గుడ్లు, మాంసం, రొయ్యలు, పాలకూర, పుదీనా, గోంగూర, సెనగలు తినిపించొచ్చు.
For Vitamin-C
- తాజాపండ్లలో విటమిన్-సి దొరుకుతుంది. ఇందుకు ఉసిరి, నిమ్మ, బత్తాయి, జామ తీసుకోవాలి. లేదంటే కాస్త నిమ్మరసం అయినా తినే ఆహారంలో చేర్చండి.
- అప్పుడే ఇనుముని సరిగ్గా శరీరం స్వీకరించగలుగుతుంది. హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
For Vitamin-D
- విటమిన్-డి కోసం గుడ్డులోని పచ్చసొన, నెయ్యి, బటర్, కాలేయం పెట్టొచ్చు. అయితే వీటి నుంచి చాలా కొద్దిమొత్తంలో మాత్రమే దొరుకుతుంది. అందుకే ఒంటికి తగినంత ఎండతగిలేలా చూసుకుంటే… ఈ పోషకాన్ని శరీరం తయారు చేసుకుంటుంది.
ఇవన్నీ వ్యాధినిరోధక శక్తిని పెంచేవే.
For Vitamin-A
- విటమిన్-ఎ… కోసం గుమ్మడి, బొప్పాయి, క్యారెట్, గుడ్డు… ఎక్కువ మోతాదులో క్రమం తప్పకుండా చిన్నారులకు అందివ్వాలి.
- చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి. వాటికి బదులుగా ఇంట్లోనే పండ్లు, కూరగాయలతో చేసే స్నాక్స్ (వెజిటేబుల్ కట్‌లెట్, చీజ్ దోసె, రగడా, డోక్లా, రాగి దోశ, ఫ్రెంచ్ టోస్ట్) చేసి తినిపించాలి.
Exercise
- ఆహారంతో పాటు తగిన వ్యాయామమూ అవసరమే.