How to get lost or stolen cellphones | Cell phone is gone .. Take it at www.ceir.gov.in
Contents
show
How to get lost or stolen cellphones | Cell phone is gone .. Take it at www.ceir.gov.in. How to find stolen Mobil Phone. సెల్‌ఫోన్ పోయిందా.. పట్టేయొచ్చు : పోగొట్టుకున్న, అపహరణకు గురైన సెల్‌ఫోన్ ఎక్కడుందో కనిపెట్టేందుకు, పనిచేయకుండా చూసేందుకు ప్రత్యేక పోర్టల్ సేవలను ప్రభుత్వం విస్తరిస్తోంది. గత సెప్టెంబరులో ముంబయిలో ఈ సేవ ఆరంభం కాగా, ఇప్పుడు దేశ రాజధాని దిల్లీ ప్రాంతానికి విస్తరించారు. 2020లో దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to get lost or stolen cellphones | Cell phone is gone .. Take it at www.ceir.gov.in
How to get lost or stolen cellphones
Step 1 : దిల్లీలోని మొబైల్ చందాదారులు www.ceir.gov.in (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ను ఇందుకోసం ఆశ్రయించాలి.
Step 2 : ప్రతి సెల్‌ఫోన్‌కు ఉండే ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) సంఖ్యను,
Step 3 : ఫోన్ పోయిందని పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు వివరాలు,
Step 4 : వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను ఈ పోర్టల్‌లో నమోదు చేస్తే,
అన్ని టెలికాం నెట్‌వర్క్‌ల పరిధిలో ఆ ఫోన్ పనిచేయకుండా నిరోధిస్తారు.
సెల్‌ఫోన్‌లో వేరే సిమ్‌కార్డు వేసి, ఎక్కడ వాడినా తెలిసిపోతుంది.
పోలీసులు వెంటనే ఆచూకీ కనిపెట్టడం వీలవుతుందని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత ఇదీ
ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెల ఐఎంఐఈ నెంబరు ప్రత్యేకంగా ఉంటుందని, అయితే కొందరు నేరస్తులు ఈ సంఖ్యను కూడా క్లోన్‌చేసి, చోరీచేసిన ఫోన్లకు వాడుతున్నారన్నారని టెలికాం కార్యదర్శి అన్షు ప్రసాద్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఒక ఐఎంఈఐ సంఖ్యను నిరోధిస్తే, పలు ఫోన్లు పనిచేయకుండా పోవచ్చని, ఈ సమస్య రాకుండా, చోరీకి గురైన ఫోన్ మాత్రమే పనిచేయకుండా చేయడం ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకతగా వివరించారు. ఈ ఫిర్యాదులన్నింటికీ కేంద్రియ రిజిస్టర్ ఉంటుంది కనుక, అన్ని నెట్‌వర్క్ సంస్థలూ కనిపెడతాయని స్పష్టం చేశారు. ఇందువల్ల ఫోన్లు చోరీచేసినా, విక్రయించడం ఆగుతుందని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to get lost or stolen cellphones at www.ceir.gov.in