Corona without Symptoms Patient – Central Government New Guidelines

Corona without Symptoms Patient – Central Government New Guidelines : లక్షణాలు లేని కరోనా విజృంభణ – కేంద్రం మార్గదర్శకాలు ఇవే. సాధారణంగా కరోనా రెండు రకాలుగా వ్యాపిస్తుంది కొందరికి లక్షణాలు కనిపిస్తాయి వారికి సిమిటమాటిక్ కరోనా సోకినట్టు. మరి కొందరిలో లక్షణాలు ఏవి కనబడవు కానీ వారికి కూడా టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంది వారికి ఏసిమిటమాటిక్ కరోనా సోకినట్టుగా డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Central Government New Guidelines for Corona without Symptoms Patient

  • మన దేశంలో ఏసిమిటమాటిక్ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
  • కేంద్ర ఆరోగ్య శాఖా ఓ కీలక నిర్ణయం తీసుకుంటూ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది…
  • కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే ( క్రింది మార్గదర్శకాలు కేవలం లక్షణాలు లేకుండా కరోనా బారిన పడిన వారికి మాత్రమే )
  • లక్షణాలు లేకుండా కరోనా ఉన్న భాధితులు తమ గృహాల్లో సరైన సౌకర్యాలు ఉంటే అక్కడే ఇసోలేషన్ లో ఉండటానికి ఎంచుకోవచ్చు. వారి గృహాల్లో ఎవ్వరినీ తగలకుండా సెపరేట్ రూములో ఉంటూ ఇసోలేషన్ పొందవచ్చు.
  • ఎవరైతే ఇప్పటికే ప్రమాదకర ( హెచ్‌ఐవీ క్యాన్సర్ వంటివి) రోగాలు అనుభవిస్తున్నారో వారికీ గృహ ఇసోలేషన్ కుదరదు. వారిని ప్రభుత్వ ఇసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలి.
  • బిపీ, షుగర్, హృద్రోగాలు, కిడ్నీ, లివర్ వంటి సమస్యలు అనుభవిస్తున్న 60 ఏళ్ళు దాటిన వారికి కూడా ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి ఆపై వారికి గృహ ఇసోలేషన్ విధించాలి.
  • గృహ ఇసోలేషన్ లో ఉంటున్న లక్షణాలు లేని కరోనా బాధితులు (ఏసిమిటమాటిక్ కరోనా) పది రోజుల పాటు తమ గృహాల్లో ఇసోలేషన్ లో ఉండాలి. ఆపై వారు ఇసోలేషన్ నుండి బయటకు రావచ్చు.
  • ఒకవేళ ఇసోలేషన్ లోనికి వెళ్ళిన వారికి 3 రోజులుగా ఎటువంటి జ్వరం కానీ లక్షణాలు కానీ కనిపించకపోతే వారు 3 రోజుల తరువాత ఇసోలేషన్ నుండి బయటకు రావచ్చు.
  • లక్షణాలు లేని కరోనా బాధితులు ప్రభుత్వం తరఫున ఇసోలేషన్ లో ఉన్నప్పటికీ 10 రోజుల ఇసోలేషన్ అనంతరం తమ గృహాలకు వెళ్ళి అక్కడ మరో 7 రోజుల పాటు ఇసోలేషన్ లో ఉండాలి వారికి డిశ్చార్జ్ అవుతున్న సమయంలో కరోనా టెస్టులు చేయడం అవసరం లేదు.
  • ఇలా గృహ ఇసోలేషన్ లో ఉన్న బాధితులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వారికోసం ఓ కేర్ టేకర్ ను నియమిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ఆ కేర్ టేకర్ నిత్యం ఫోన్ లో అందుబాటులో ఉంటారని ఎప్పుడు అవసరం వచ్చినా వారికి ఫోన్ చేసి సూచనలు చికిత్స పొందవచ్చు.
  • గృహ ఇసోలేషన్ తీసుకుంటున్న వారికి తమ గృహాల్లో ఉండే ఇతర కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు అందుతాయని అవి వారికి చాలా ఉపయోగపడతాయని ప్రభుత్వం తెలియజేస్తుంది.
  • బధితులకు అండగా వైద్యులు నిత్యం ఫోన్ ద్వారా సమాచారాన్ని అదిస్తూనే ఉంటారు. బాధితులకు సూచనలు చికిత్స అందిస్తూనే ఉంటారు.
  • రాష్ట్ర ప్రభుత్వాలు అలా గృహ ఇసోలేషన్ లో ఉన్న వారికి ఇసోలేషన్ అనంతరం వైద్య సహాయం అందించాలని వారి గృహాలకు ప్రభుత్వం తరఫున ఓ టీమ్ ను పంపిచాలని కేంద్రం ఆదేశించింది.

Scroll to Top