Corona How to Know open shop in your Area – Say Google Anna, let's say Google

Join WhatsApp

Join Now

Corona How to Know open shop in your Area – Say Google Anna, let’s say Google

Corona How to Know open shop in your Area – Say Google Anna, let’s say Google : How to find your area essentials shop open close in Google. The shop has opened, let’s go through Google. కరోనా: గూగుల్‌లో చెప్పేయ్‌ అన్నా…దుకాణం తెరిచింది, లేనిదీ గూగుల్‌ ద్వారా తెలిపే వీలు : కోవిడ్‌-19 లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువులు లభించే దుకాణాలు తెరిచి ఉన్నాయో లేదో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాంతంలో ఏయే షాపులు తెరిచి ఉన్నాయో తెలియక అంతా తిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దుకాణ యజమానులు తాజా సమాచారాన్ని వినియోగదారులకు ఎప్పటికప్పుడు తెలియచేసే వీలును గూగుల్‌ కలిగిస్తోంది. ఈ కొత్త సదుపాయాన్ని దుకాణదారులు ‘గూగుల్‌ సెర్చ్‌’ ద్వారా మాత్రమే కాకుండా ‘గూగుల్‌ మ్యాప్‌’ల ద్వారా కూడా తెలియజేయవచ్చని ఈ మేరకు చేసిన ఓ ప్రకటనలో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలియచేశారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Join for Update Information

Corona How to Know open shop in your Area – Say Google Anna, let’s say Google

ఎలా చెప్పాలంటే…(How to Say) :

  1. దుకాణ యజమానులు గూగుల్‌లో ‘గూగుల్‌ మై బిజినెస్‌’ ఖాతా తెరవాలి. (ఇప్పటికే లేనివారు)
  2. అనంతరం దాని మెనూలో ఉండే ‘CLOSE THE BUSINESS ON GOOGLE’ (క్లోజ్‌ ద బిజినెస్‌ ఆన్‌ గూగుల్‌) అనే సెక్షన్‌కు వెళ్లాలి.
  3. అక్కడ ఉండే మూడు ఆప్షన్లలో “MARK AS TEMPORARILY CLOSED” (మార్క్‌ యాజ్‌ టెంపరరీలీ క్లోజ్డ్‌‌) అనే దానిని ఎంచుకోవటం ద్వారా… తమ దుకాణం తాత్కాలికంగా మూసివేయబడింది అనే సమాచారాన్ని తమ ప్రొఫైల్‌లో అని అప్‌డేట్‌ చేయవచ్చు.
  4. ఇక తమ వ్యాపార వేళల్లో మార్పులు చోటుచేసుకున్నట్లయితే, ‘SPECIAL HOURS’ (స్పెషల్‌ అవర్స్‌) అనే ఫీచర్‌ ద్వారా ఆ విషయాన్ని కూడా తమ ఖాతాదారులకు తెలియచేయవచ్చు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇదివరకు ప్రభుత్వ సమాచారం ఆధారంగా మాత్రమే దుకాణాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేది. కాగా, తమ దుకాణాలు మూసి ఉన్నట్లయితే ఆ విషయాన్ని వ్యాపారులు ప్రజలకు నేరుగా తెలిపే విధంగా అప్‌డేట్‌ చేయగల సదుపాయాన్ని గూగుల్‌ ఇప్పుడు కల్పించింది. ఐతే సరైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత దుకాణదారులపైనే ఉందని… ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూగుల్‌ విజ్ఞప్తి చేసింది.

Benefits of Pradhan Mantri Garib Kalyan Yojana in Telugu