Bank working hours change from 1st October నేటి నుంచి బాంక్ పనివేళలు మార్పు

Bank working hours change from 1st October నేటి నుంచి బాంక్ పనివేళలు మార్పు 

Bank working hours change from 1st October , 2019. నేటి నుంచి బాంక్ పనివేళలు మార్పు, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో అక్టోబరు 1నుంచి మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక చేసుకుని అమలు చేస్తారు. దేశంలోని 400 జిల్లాల్లో ఖాతాదారులు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు అక్టోబరు 3నుంచి 7దాకా ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్ కేవీ నాంచారయ్య తెలిపారు.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Bank working hours change from 1st October నేటి నుంచి బాంక్ పనివేళలు మార్పు

సోమవారం విజయవాడలో ఇండియన్ బ్యాంకు జోనల్ మనేజర్ మణిమాల, ఎస్‌బీఐ ఏజీఎం డీజే ప్రసాద్, ఆంధ్రా బ్యాంకు డీజీఎం వెంకటేశ్వర స్వామి, ఎస్ఎల్‌బీసీ ఏజీఎం కె అజయ్‌పాల్ తదితరులు విలేకర్లతో మాట్లాడారు.

మూడు రకాల పనివేళలు

భారత బ్యాంకర్ల సంఘం(ఐబీఏ) సూచనల మేరకు మూడు రకాల పనివేళలు రూపొందించారు.

* ఉదయం 9bగంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ
* ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ
* ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకూ

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి సంప్రదింపుల సమితిలో చర్చించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి పంపిస్తారు. వారి ఆమోదంతో ఈ పనివేళలు అమలు చేస్తారు. అకౌంట్ హోల్డర్లు సిబిల్ స్కోరు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇందులో రైతులకు కూడా మినహాయింపు లేదు. ప్రకృతి వైపరీత్యాలు, రుణాల రీషెడ్యూల్ వంటి అంశఆలను పరిగణణలోకి తీసుకుని స్థఆనిక బ్యాంకు మేనేజర్లు సానుకూల నిర్ణయం తీసుకుంటారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top