APPSC Forest Dept FBO, FSO, ABO Notification
APPSC Forest Dept FBO, FSO, ABO Notification 2025, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC నుండి 791 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వంటి పోస్ట్ లకు ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఖాళీల వివరాలను APPSC అధికారిక జాబ్ క్యాలెండర్ 2025 లో ఇవ్వడం జరిగింది. రానున్న జూలై నెలలో నోటిఫికేషన్స్ అధికారిక వెబ్సైటు ల లో విడుదల చేసి రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తారు అని సమాచారం. ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వంటి పోస్ట్ లకు రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వివరాలు తెలుసుకోగలరు. APPSC Forest Dept FBO, FSO, ABO Notification 2025.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు, వయస్సు వివరాలు:
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 256 పోస్టులు
- ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు FBO ఉద్యోగాలకు అర్హులు.
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ : 435 పోస్టులు
📢 Join Our Official Channels for Daily Updates
📱 Join WhatsApp Channel 🚀 Join Telegram ChannelGet daily TeacherNews updates directly on your mobile.
- ABO ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఇంటర్మీడియట్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ : 100 పోస్టులు
- FSO ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు Apply చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పైన తెలిపిన వయస్సులో SC, ST, OBC, EWS అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ : –
- ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు FD ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.
- ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు శాలరీతో పాటు TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది :
APPSC Dept అటవీ శాఖ FBO, ABO, FSO ఉద్యోగాలకు మొట్ట మొదటగా రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉత్తీర్ణులయిన అభ్యర్థులకు ముఖ్యంగా FBO, ABO ఉద్యోగాలకు ఫిసికల్ ఈవెంట్స్ కూడా నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.





