AP TET Exam Dates Announced 2024
AP TET Exam Dates 2024 | Answer Key Sheets Announced Key Sheet Dates | ఏపీటెట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) జులై లో నోటిఫికేషన్ ప్రకటించారు అనగా సోమవారం (జులై 1) విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 2 పేపర్లకు టెట్ పరీక్ష జరుగుతుంది. పేపర్-1 ఏ పరీక్ష ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1 బీ పరీక్ష స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. AP TET Model Question papers Paper-1, Paper-2 అలాగే పేపర్-2 ఏ పరీక్ష స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్-2 బీ పరీక్ష స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. డీఎడ్, బీఎడ్‌లో అర్హత కలిగిన అభ్యర్ధులకు టెట్ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. పేపర్- 2 ఏ రాసే ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మిగతావారు 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. సిలబస్, పరీక్ష విధానానికి సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. టెట్ (జులై) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలు , వివరాలు PDF Download
అర్హత కలిగిన వాళ్ళు జులై 4 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు రూ.750 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. టెట్ దరఖాస్తు రుసుమును జులై 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఆన్‌లైన్ మాక్ టెస్టులు జులై 16 నుంచి అందుబాటులో ఉంటాయి. జులై 25 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 5 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. రోజుకు రెండు సెఫన్ల చొప్పున ఈ పరీక్షలు జరుపుతారు. పరీక్షల అనంతరం ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని ఆగస్టు 10న విడుదల చెయ్యడం జరుగుతుంది. ఆగస్టు 11 నుంచి 21 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుంది , తుది ఆన్సర్ కీ షీట్ ని ఆగస్టు 25న విడుదల చేస్తారు. ఆగస్టు 30 టెట్ ఫలితాలు ప్రకటించేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు.
అభ్యర్థులు డీఎస్సీలో టెట్ పరీక్ష మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఓసీ క్యాటగిరీ కి చెందిన అభ్యర్ధులు 60 శాతం మార్కులు, బీసీ క్యాటగిరీ కి చెందిన అభ్యర్ధులు 50 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ/వికాలాంగ/ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాటగిరీ కి చెందిన అభ్యర్ధులకు 40 శాతం మార్కులు వస్తేనే టెట్‌లో అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు కాబట్టి మార్కుల కేటాయింపులో నార్మలైజేషన్ అమలు చేస్తారు.
AP TET పరీక్ష తేదీ 2024:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ APTET దరఖాస్తు ఆన్‌లైన్ 2024 లింక్‌ని జూలై 4, 2024న విడుదల చేసింది. APTET దరఖాస్తు ఫారమ్ 2024 జూలై 4 నుండి 17, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. AP TET దరఖాస్తు రుసుము చెల్లింపు 2024 లింక్ జూలై 3 నుండి 16, 2024 వరకు సక్రియంగా ఉంటుంది. AP TET జూలై 2024 నోటిఫికేషన్ జూలై 2, 2024న అధికారిక వెబ్‌సైట్- https://aptet.apcfss.inలో విడుదల చేయబడింది. AP TET హాల్ టిక్కెట్ 2024 జూలై 25, 2024న విడుదల చేయబడుతుంది. AP TET పరీక్ష ఆగస్టు 5 నుండి 20, 2024 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది.AP TET Exam Dates