CPS Amount withdrawal / Payment Process in Telugu – Withdrawal Forms, DDO Covering Letter

CPS Amount withdrawal / Payment Process in Telugu -Withdrawal Forms, DDO Covering Letter : AP Telangana CPS Employees Amount withdrawal / Payment Process here.Contributory Pension Scheme- With Drawl Procedure and process for State Govt CPS Employees (Subscribers). Let us learn “How to submit and process CPS Withdrawal application”. CPS Funds withdrawal guidelines in case of Employees who died / Retired / Resigned, Withdrawal procedures for Subscribers from New Pension System(NPS) subscribers whose PRAN Number was registered and subsequently, retired/ died/ pre exited. Form N1 DTA Registration Form N2 DTO Registration Form N3 DDO Registration Form N4 DTO Covering Letter for DDO Registration CPS-PRAN Subscriber Registered Details Modification Form S2 Subscriber Details Change Form S7 Subscriber’s Photo and Signature Change Form S8 Covering Letter of DDO for Change in Photo and Signature of Subscriber CPS-PRAN Withdrawal Forms. CPS లో నిలువవున్న మొత్తం ఉపసంహరణ/చెల్లింపు విధానం ఉమ్మడి ఆంధ్రవప్రదేశ్ రాష్ట్రంలో 1.9.2004 తేది నుండి ఉద్యోగములో చేరిన నూతన పెన్షన్ పథకం (NPS) G.O.Ms.No.653 తేది:22.9.2004 ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో ఉన్నవారికి AP Revised Pension Rules-1980 వర్తించవు, అలాగే APGPF Rules-1935 కూడా వర్తించవు. వీరి జీతములో ప్రతినెలా బేసిక్ పే + డి.ఏ లో 10% చందా రూపంలో చెల్లించాలి. దీనికి సమానంగా ప్రభుత్వ వాటా ఈ పథకం లోని చందాదారుల ఖాతాలలో జమచేయటం జరుగుతుంది. కొత్త పెన్షన్ సిస్టమ్ (ఎన్పిఎస్) చందాదారుల నుండి చందాదార్లు / పదవీ విరమణ / పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కేసులో GO.123 CPS ఫండ్స్ ఉపసంహరణ మార్గదర్శకాలు, దాని పిన్ సంఖ్య నమోదయింది మరియు తరువాత, రిటైర్ / మరణించిన / ముందే ముగిసింది. పదవీ విరమణ / మరణం / రాజీనామా ముందు ఉద్యోగి చివరి పని అవసరమైన పత్రాలు / ధృవపత్రాలు సంబంధిత ట్రెజరీ ఆఫీసర్ నిధులను ఉపసంహరణ సమర్పించవచ్చు. NPS చందాదార్లు (కొత్త పెన్షన్ పథకం) ప్రతిపాదించిన ఉపసంహరణ ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం G.O.Ms.No.62 Fin తేది:7.3.2014 ద్వారా NPS పథకంలోని చందాదారులకు తమ ఖాతాలోని మొత్తాలను ఎలా ఉపసంహరించుకోవాలో తెలపడం జరిగింది. పై జీవో లో రెండు అనెగ్జర్లు పొందుపరచడం జరిగింది.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

CPS Amount withdrawal / Payment Process in Telugu – Withdrawal Forms, DDO Covering Letter

CPS Amount withdrawal / Payment Process in Telugu

CPS లో నిలువవున్న మొత్తం ఉపసంహరణ/చెల్లింపు విధానం

అనెగ్జర్-I: NPS పథకం లోని ఖాతాలలో జమ అయిన మొత్తాలను ఉపసంహరించుకోవడానికి సంబంధించిన విధివిధానాలు.
అనెగ్జర్-II: NPS పథకం లోని ఖాతాలలో జమ అయిన మొత్తాలను ఉపసంహరించుకోవడానికి దరఖాస్తు C.R.A కు ఎలా సమర్పించాలి.

ప్రస్తుతం విధివిధానాలు ప్రకారం ఈ క్రింద తెలిపిన 3 సందర్భాలలో NPS ఖాతాలలో జమ అయిన మొత్తాలను ఉపసంహరించుకోవచ్చు:

I: సూపరాన్యుయేషన్ ద్వారా పదవీ విరమణ పొందినపుడు.
II: ఉద్యోగము చేస్తూ మరణించినప్పుడు.
III: వివిధ కారణాల కారణంగా, సూపరాన్యుయేషన్ తేదీ కంటే ముందే పదవీ విరమణ పొందినపుడు.



సూపరాన్యుయేషన్ తేదీన రిటైర్మెంటు అయినవారు:

(i) దరఖాస్తు ఫారం 101 GS
(iI) నామినేషన్ సమాచారం ఆనెగ్జర్
(iii) ఒక్కరే నామీనిగా ఉంటే 101 GS
(iv) ఒకరికన్నా ఎక్కువ మంది నామీనిగా ఉంటే 101 GS-N1

  1. అతని ఖాతాలలో నిల్వ ఉన్న మొత్తాలలో 40% పెన్షన్ ఫండ్ యాన్యుటి బాండ్లు కొనడానికి వెచ్చిస్తారు. 
  2. PFRDA ఎంపికచేసిన ఏ సంస్థనైనా ఎంపిక చేసిన చేసుకోవచ్చును. 
  3. దీనిపై వచ్చిన ఆదాయమునే నెలనెలా పెన్షన్ చెల్లిస్తారు. 
  4. మిగిలిన 60% మొత్తము చందాదారునికి చెల్లిస్తారు లేక చందాదారుడు ఎంపిక చేసుకున్న వివిధ చెల్లింపు పథకాల ద్వారా చెల్లిస్తారు. 
  5. పై 60% లో తిరిగి 40% మొత్తము 70 సంవత్సరాల వరకు పెన్షన్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టుటకు అవకాశం కలదు. 70 సంవత్సరాలు పూర్తయిన వెంటనే జమలు చందాదారుని బ్యాంక్ అకౌంట్లో జమచేస్తారు. పెట్టుబడి పెట్టిన మొత్తాలను చందాదారులు ఎప్పుడైనా విరమించుకోవచ్చు. 

ఉద్యోగం చేస్తూ చనిపోతే:

(i) దరఖాస్తు ఫారం 103 GD
NPS ఖాతాలో నిల్వయున్న మొత్తము 100% అతని వారసులకు చెల్లిస్తారు.

వివిధ కారణాల కారణంగా, సూపరాన్యుయేషన్ తేదీ కంటే ముందే పదవీ విరమణ పొందినపుడు

(i) దరఖాస్తు ఫారం 102 GP
(iI) నామినేషన్ సమాచారం ఆనెగ్జర్
(iii) ఒకరికన్నా ఎక్కువ మంది నామీనిగా ఉంటే 401 AS

అతని ఖాతాలలో నిల్వ ఉన్న మొత్తాలలో 80% పెన్షన్ ఫండ్ యాన్యుటి బాండ్లు కొనడానికి వెచ్చిస్తారు.
PFRDA ఎంపికచేసిన ఏ సంస్థనైనా ఎంపిక చేసిన చేసుకోవచ్చును.
దీనిపై వచ్చిన ఆదాయమునే నెలనెలా పెన్షన్ చెల్లిస్తారు.
మిగిలిన 20% మొత్తము చందాదారునికి చెల్లిస్తారు లేక చందాదారుడు ఎంపిక చేసుకున్న వివిధ చెల్లింపు పథకాల ద్వారా చెల్లిస్తారు.
పై మొత్తంలో 20% 70 సంవత్సరాల వరకు పెన్షన్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టుటకు అవకాశం కలదు. 70 సంవత్సరాలు పూర్తయిన వెంటనే జమలు చందాదారుని బ్యాంక్ అకౌంట్లో జమచేస్తారు. పెట్టుబడి పెట్టిన మొత్తాలను చందాదారులు ఎప్పుడైనా విరమించుకోవచ్చు.

యాన్యుటి బాండులు కొనుగోలు చేయడానికి PFRDA ఈ క్రింది సంస్థలను ఎంపిక చేయడం జరిగింది.

  • LIC ఇండియా 
  • SBI లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్ 
  • ICICI ఫ్రూడెన్షియల్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్ 
  • HDFC స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్ 
  • బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్ 
  • రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్ 
  • స్టార్ ఇన్సూరెన్స్ డై-ఇచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్

Scroll to Top