Teachers as Resource Persons in AP | Online Apply last date 14-09-2019
Teachers as Resource Persons in AP | Online Apply last date 14-09-2019: రిసోర్సు పర్సన్లుగా ఉపాధ్యాయులు Inviting applications for Computer Based Test (CBT) for selection of Resource Persons for SCERT to conduct training’s at state and district levels and E-Content Developers for E-Content Cell, SCERT –Regarding. Last Date for Submission of Applications for CBT for Selection of Resource Persons is 14th Sept 2019.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Teachers as Resource Persons in AP | Online Apply last date 14-09-2019
★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్ ఎడ్యుకేటర్స్), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు.
★ ప్రస్తుతం ఎస్జీటీ, పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 14వ తేదీ వరకు గడువు పొడిగింపు.
★ ఈ నెల 22న ఆన్‌లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహణ.
★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్‌ఎన్) కింద ఎస్‌ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్‌సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది.
★ ఆసక్తిగల ఉపాధ్యాయులు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో సీబీటీ పరీక్ష నిర్వహించనున్నారు.
★ ఉపాధ్యాయులకు హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్లో పంపనున్నారు. ఉపాధ్యాయులుగా రెండేళ్లు పని చేసిన అనుభవం, ఇంకా కనీసం మూడేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు.
★ అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరూ…పాఠశాల విద్యాశాఖ గుణాత్మక విద్య నందించే ఏకైక లక్ష్యం తో. రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో, DIET, SCERT, IASEలలో. STRONG RESOURCE POOL ద్వారా continuous professional development ఉపాధ్యాయులందరికీ అందించాలనే ఉద్దేశ్యం తో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించి అప్లికేషన్లు ఆహ్వానించిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 12000 మంది ఉపాధ్యాయులు అప్లై చేసుకున్నారు. మన పాఠశాల విద్యాశాఖ టెస్ట్ కు అప్లై చేసుకోవడానికి. ఈ నెల 14వరకూ పొడిగించింది.. ఇప్పటికే అప్లై చేసిన ఉపాధ్యాయులందరూ మీ మీ పాఠశాల లలో అప్లై చేయని మరో ముగ్గురు ఉపాధ్యాయులచే అప్లై చేయించండి. ఇది మీ బోధన నైపుణ్యాలను Upgrade చేసుకోవడానికి. ఆధునికంగా వస్తున్న అనేకానేక నూతన విధానాలపై సాధికారత సాధించడానికి పనికొచ్చే పరీక్ష. ఉపాధ్యాయ వృత్తిని ఒక ప్యాషన్ గా భావించే ప్రతి ఉపాధ్యాయుడూ స్వీయ ప్రతిభకు తెలుసుకోవడానికి పనికొచ్చే పరీక్ష ఎలాంటి అపోహలు అనుమానాలు లేకుండా పరీక్ష కు అప్లై చేయండి, రాయండి. మీలోని బోధన నైపుణ్యాలను స్వీయమూల్యాంకనం చేసుకొని ఎప్పటికప్పుడు Upgrade కావడానికి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
https://schooledu.ap.gov.in/DSE/cbtApplication.do
Teachers CBT Syllabus Computer Based Test Sample Questions