SBI block your Credit Card Debit Card from 16th, 2020 | Know full details and SBI Guidelines

SBI block your Credit Card Debit Card from 16th, 2020 | Know full details and SBI Guidelines 

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్‌ను బ్లాక్ చేయనున్న ఎస్‌బీఐ.. వెంటనే ఇలా చేయండి!. SBI block your Credit Card Debit Card from 16th, 2020 | Know full details and SBI Guidelines Download. మీరు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? లేకపోతే ఎస్‌బీఐ నుంచి క్రెడిట్ కార్డు తీసుకున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

SBI block your Credit Card Debit Card from 16th, 2020 | Know full details and SBI Guidelines 

ప్రధానాంశాలు:

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్

మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు బ్లాక్ అయ్యే ప్రమాదముంది.

వెంటనే ఇలా చేయండి

 ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? లేదంటే క్రెడిట్ కార్డు కలిగి ఉన్నారా? అయితే మీకు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు భారీ షాకిచ్చేందుకు రెడీ అయ్యింది. డెబిట్ కార్డులను, క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసేందుకు సిద్ధమౌతోంది.

ఎస్‌బీఐ నుంచి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు పొందిన వారు : 

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా ఒక్కసారి కూడా ఆన్‌లైన్ లావాదేవీ నిర్వహించకపోతే అప్పుడు మీ కార్డులపై ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు. బ్యాంక్ ఈ సర్వీసులను రద్దు చేయనుంది. స్టేట్ బ్యాంక్ ఇప్పటికే కస్టమర్లకు ఎస్ఎంఎస్‌లు కూడా పంపుతోంది. ఒక్కసారైనా కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ నిర్వహించాలని సూచిస్తోంది.

మీరు ఇప్పటికీ కూడా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ నిర్వహించకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. లేదంటే మీ కార్డును ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఉపయోగించడం కుదరదు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై ఆన్‌లైన్ సర్వీసులకు సంబంధించి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 16 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం : 

ప్రస్తుతం జారీ అయిన కార్డులకు సంబంధించి కార్డు జారీ చేసిన సంస్థలకు నిర్ణయాధికారం ఉంటుంది. కార్డుపై ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్సన్లు నిర్వహిచకపోతే.. కార్డుపై ఆ సర్వీసులను రద్దు చేయాలి. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ లోని సెక్షన్ 10 (2) ప్రకారం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఇకపోతే గత కొన్నేళ్లుగా Credit Card, డెబిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూజర్లకు మెరుగైనా, సురక్షితమైన సేవలు అందించడం కోసం ఆర్‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు, కార్డు జారీ సంస్థలను ఇప్పటికే ఈ విషయమై హెచ్చరించింది. అంతేకాకుండా కార్డు యూజర్ల కోసం కొత్త సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Scroll to Top