How to Utilize LTC AP/ TS Employee – Guidelines in Telugu : Check List and Rules for Leave Travel Concession (LTC) for AP, Telangana Teachers and Employees. LTC Leave Travel Concession for AP & Telangana | LTC Application Form | LTC Rules Download in Telugu. LEAVE TRAVEL CONCESSION (LTC) for AP and Telangana States Traveling Allowance (TA) Instructions.
ఉద్యోగి సెలవు పై కుటుంబం తో హెడ్ క్వార్టర్స్ నుండి స్వస్థలం లేదా రాష్ట్రంలోని ఏ ప్రాంతంనకు ఐనా వెళ్ళటానికి LTC వాడుకోవచ్చు.
ఉద్యోగికి 5 ఇయర్స్ సర్వీస్ ఉండాలి.
ఉద్యోగి, అతని కుటుంబం వేర్వేరుగా, కలసి కూడా LTC ని వాడుకోవచ్చు.
ఉద్యోగి కుటుంబం వేరేచోట నివాసం ఉండి, ఈ సౌకర్యం ఉపయోగించక పోతే,ఆ ఉద్యోగి స్వస్థలం వెళ్లి వచ్చేందుకు LTC వాడుకోవచ్చు.
కుటుంబ సభ్యులు ఒక బ్లాక్ పీరియడ్ లో ఒకసారి మాత్రమే LTC కి అర్హులు.
ఈ సౌకర్యం ఉద్యోగి సంతానంలో ఇద్దరికి మాత్రమే పరిమితం.
ప్రతి 4 ఇయర్స్ ఒక బ్లాక్ పీరియడ్
మొదటి 2 ఇయర్స్ స్వస్థలం వెళ్లేందుకు, తర్వాత 2 ఇయర్స్ లో రాష్ట్రంలోని ఏ ప్రాంతంనకు ఐనా లేదా స్వస్థలం వెళ్లి వచ్చేందుకు LTC వాడుకోవచ్చు.
ఉద్యోగి తన సర్వీస్ మొత్తం మీద ఒకసారి దేశంలో ఏ ప్రాంతంనకు ఐనా తన కుటుంబం తో LTC పై వెళ్ళవచ్చు.
4 ఇయర్స్ బ్లాక్ పీరియడ్ లో చివరి 2 ఇయర్స్ మాత్రమే వెళ్ళాలి.
రాను,పోను గరిష్ఠ దూరం 3500km.
డబ్బులు 18,750/- కి మించకూడదు.
CLs, Child Care leave కాకుండా ఏ ఇతర సెలవు నైనా పెట్టుకుని వెళ్ళవచ్చు.
ప్రభుత్వ సెలవు దినాలు వాడి గానీ,వాడకుండా గానీ వెళ్ళవచ్చు.
DDO నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
వెకేషన్ లో కూడా ఉపయోగించుకోవచ్చు.
అంచనా మొత్తం ఖర్చులో 80% డబ్బులు ముందు అడ్వాన్సు గా పొందవచ్చు.
మిగిలిన డబ్బులు బిల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇస్తారు.
మొదటి బ్లాక్ పీరియడ్ లో గానీ, రెండవ బ్లాక్ పీరియడ్ లో గానీ పూర్తి దూరానికి చెల్లింపు ఉండదు.
వేరే రాష్ట్రంలో స్వస్థలం గల వారికి రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే చెల్లింపు ఉంటుంది.
రైలు, బస్సు లేక రెండూ మార్గాలకు డబ్బులు చెల్లిస్తారు.
తిరిగి వచ్చిన 30 రోజుల లోపు బిల్ ప్రొడ్యూస్ చెయ్యాలి.
30 రోజుల లోపు బిల్ పెట్టకపోతే 15% డబ్బులు కోత పెడతారు.
బిల్ ప్రొడ్యూస్ చేసే సమయంలో ట్రైన్/బస్ టిక్కెట్లు అందజేయాలి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to Utilize LTC AP/ TS Employee – Guidelines in Telugu
Rules for LTC Leave Travel Concession in AP & Telangana
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
- Income Tax Software || Student Add / Update Childinfo || 10th Material
- DA Arrears Online Calculator || Free Messge Alert
- Follow us on - FaceBook || Twitter || Telegram