AP Govt. Motor Vehicles Modified Fine list 2019 | వాహనదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

Join WhatsApp

Join Now

AP Govt. Motor Vehicles Modified Fine list 2019 | వాహనదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్  

AP New Motor Vehicles (Amendment) Bill and the higher penalties for traffic violations in it became applicable across our AP. Good news for motorists Jagan Government .. new fine in AP. AP Govt. Motor Vehicles Modified Fine list 2019 | వాహనదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త జరిమానాలు ఇవే! దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వాటితో వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే చాలు.. వేలు, లక్షల్లో చలాన్లు రాస్తున్నారు. ఇప్పటికే కొత్త మోటారు వాహన చట్టంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఫైన్ల విషయంలో అలోచించి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం కూడా వాహనదారులకు ఈ జరిమానాలు విషయంలో రిలీఫ్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించే యోచనలో ప్రభుత్వం లేదని సమాచారం.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Join for Update Information

AP Govt. Motor Vehicles Modified Fine list 2019 | వాహనదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

కొత్త మోటారు వాహన చట్టం, జరిమానాలు గురించి తొలుత ప్రజల్లో అవగాహన తీసుకురావాలని జగన్ సర్కార్ యోచిస్తోందట. అంతేకాకుండా ఈ భారీ ఫైన్లపై సమగ్ర అధ్యయనం జరిపి ఆమోదయోగ్యమైన జరిమానాలు సూచించాలని రవాణా అధికారులను జగన్ ఆదేశించారని సమాచారం. ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కసరత్తులు చేసిన ఈ బృందం తమ నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రవాణ అధికారుల కమిటీ సూచించిన జరిమానాలు:

1. రోడ్డు నిబంధన అతిక్రమిస్తే – రూ.250 (కేంద్రం రూ.500)
2. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే – రూ.2500 (కేంద్రం రూ.5000)
3. అర్హత లేకుండా వాహనం నడిపితే – రూ.4000 (కేంద్రం రూ.10,000)
4. ఓవర్ సైజ్డ్ వాహనాలు – రూ.1000 (కేంద్రం రూ.5000
5. డేంజరస్ డ్రైవింగ్ – రూ.2500 (కేంద్రం రూ.5000)
6. డ్రంక్ అండ్ డ్రైవ్ – రూ.5000 (కేంద్రం రూ.10,000)
7. సీట్ బెల్ట్ – రూ.500 (కేంద్రం రూ.1000)
8. ఇన్సూరెన్స్ లేకుంటే – రూ.1250 (కేంద్రం రూ.2000)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});