e Watch App for Election Complaint Upload Process AP Elections

e Watch App for Election Complaint Upload Process AP Elections :

e Watch App for Election Complaint Upload Process AP Elections :  How to download e-watch app in ap, e watch app for gram panchayat polls in ap, e-watch app launch by sec ramesh in ap, petition on e-watch app and Application available in Google Play Store. The app, designed under the name e-Watch, was unveiled 04-02-2021 by State Election Commissioner Nimmagadda Ramesh Kumar at the Election Commission office in Vijayawada. Complaints can be made through e-watch and information on irregularities and temptations can be provided directly.
ఫిర్యాదుల కోసం యాప్ ప్రారంభించిన నిమ్మగడ్డ.. వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌ని వెల్ల‌డి!

FA1 Question Papers 2024: Download (Updated)

e Watch App for Election Complaint Upload Process AP Elections

  • ఈ-వాచ్‌ పేరిట యాప్
  • రేప‌టి నుంచి అందుబాటులోకి యాప్
  • అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా  స‌మాచారం అందించ‌వ‌చ్చ‌న్న నిమ్మ‌గ‌డ్డ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థల ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొనసాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు ఓ యాప్ తీసుకొచ్చారు. ‘ఈ-వాచ్‌’ పేరిట రూపొందించిన ఈ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ రోజు రాష్ట్ర‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ ఆవిష్కరించారు.  ఈ -వాచ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చ‌ని, అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా స‌మాచారం అందించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

ఫిర్యాదులు చేసిన వారి వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించిన అనంత‌రం ఆ వివ‌రాల‌ను ఫిర్యాదుదారుల‌కు చెబుతామని పేర్కొన్నారు. ఈ యాప్ రేప‌టి నుంచి ప్లేస్టోర్‌లో  అందుబాటులో ఉంటుందని వివ‌రించారు.

రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పారదర్శకత, ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకే దీన్ని విడ‌దుల చేస్తున్నామ‌ని వివ‌రించారు. స్థానిక ఎన్నిక‌ల్లో ఓట‌ర్లంతా సొంత గ్రామాలకు వచ్చి ఓట్లెయ్యాలని ఆయ‌న పిలుపునిచ్చారు. కాగా, ఫిర్యాదుల స్వీకరణ కోసం కాల్‌ సెంటర్‌ని కూడా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ ప్రారంభించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ యాప్‌ను విడుదల చేశారు. యాప్‌ తయారీకి రిలయన్స్‌ జియో సంస్థ సహకారం తీసుకున్నట్లు, రూ.5లక్షలు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు తెలిపారు. మరి ఈ యాప్‌ ప్రత్యేకత.

“Which complaint has been pending for how much time and how it has been resolved, including at what level will also be available in the app,”

పనితీరు వంటి విషయాలను తెలుసుకుందామా..!

  • – 04-02-2021 నుండి గుగుల్‌ ప్లే స్టోర్‌ లో డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.
  • – ఇన్‌ హౌస్‌లోనే మొబైల్‌ అప్లికేషన్‌ ఉంటుంది.
  • – ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు.
  • – చేసిన ఫిర్యాదు ట్యాంపరింగ్‌ చేసేందుకు అవకాశం లేదు. 
  • ముందుగా కాల్‌ సెంటర్‌కు తర్వాత కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్తుంది.
  • – డబ్బు, మద్యం పంపిణీ, లౌడ్‌ స్పీకర్లు, ఉద్యోగుల విధుల్లో అలసత్వం తదితర అంశాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
  • – ఫిర్యాదు దారు ఫొటోలు, వీడుయోలు 5ఎంబీ వరకూ పంపవచ్చు.
  • – ప్రతి కంప్లైంట్‌కు సంఖ్య ఇచ్చి వెరిఫై చేస్తారు. తన ఫిర్యాదుపై సమాచారాన్ని కాల్‌ సెంటర్‌ ద్వారా ఫిర్యాదు దారు తెలుసుకునే అవకాశం ఉంది.
  • – ఫిర్యాదుదారు సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ఫిర్యాదు చేసుకునే సదుపాయమూ ఉంది.
  • – ముఖ్యమైన ప్రతి ఫిర్యాదును ఎస్‌ఈసీ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు.
  • – సీరియస్‌ ఫిర్యాదు అయితే వెంటనే.. మిగిలినవి గరిష్టంగా 3 రోజుల్లో పరిష్కారిస్తారు.
  • – దీనితో పాటు ఎఈసీ ఏర్పాటు చేసిన కంప్లైట్‌ సెల్‌ కూడా అందుబాటులో ఉంటుంది.
  • – ఎస్‌ఈసీ కంప్లైట్‌ సెల్‌ తో పాటు కాల్‌ సెంటర్‌ సమన్వయం ఉంటుంది.
  • – కంప్లైట్‌ చేసిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతారు.
  • – వెబ్‌సైట్‌గానూ, మొబైల్‌ యాప్‌గానూ ఈ యాప్‌ పనిచేస్తుంది.

Returning Officer Remuneration of Stage 1 & 2 Officer

Scroll to Top