Jagananna Amma vodi Eligible Procedure in Telugu GO 79 Dt.4th Nov, 2019
అందరికీ ‘జగనన్న అమ్మ ఒడి’ విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం, ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు రెసిడెన్షియల్ సంస్థలకూ వర్తింపు, దారిద్య్రరేఖకు దిగువన ఉండే ప్రతి తల్లికీ ‘జగనన్న అమ్మ ఒడి’ కింద రూ.15 వేలు.
JAGANANNA AMMA VODI PROGRAMME – Financial assistance of Rs.15,000/- per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to schools /colleges i.e., from Classes I to XII (Intermediate Education)– Implementation of the programme from the academic year 2019-2020 – Orders – Issued. AP SCHOOL EDUCATION (PROG-II) DEPARTMENT G.O.MS.No. 79 Dated: 04-11-2019. Read : From Commissioner of School Education Lr. Rc.No. 242/A&I/2019, dt:26.08.2019. ORDER: The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each mother or recognized guardian in the absence of mother, who is below poverty line household, irrespective of caste, creed, religion and region to enable her to educate her child/children from Class I to XII (Intermediate Education) in all recognized Government, Private Aided and Private Unaided schools/ Jr. Colleges including Residential Schools/Colleges in the State from the Academic year 2019-2020.
2. Accordingly, the Commissioner of School Education has submitted a proposal together with policy guidelines for implementation of “JAGANANNA AMMA VODI” programme vide reference read above.
3. After careful examination of the proposal submitted by the Commissioner of School Education, Government hereby order to provide financial assistance of Rs.15,000/- per annum to each mother or recognized guardian who is below poverty line household, irrespective of number of children of that family studying from class I to XII in all recognized Government, Private Aided and Private Unaided schools/Jr. Colleges including Residential Schools/ Jr.Colleges in the State from the Academic year 2019-2020 under a new programme “JAGANANNA AMMA VODI” as part of “NAVARATNALU” in order to enhance access to schools, ensuring equity, assuring quality education, for regulation of attendance, retention and to achieve minimum learning levels, and for overall development of the child from Classes I to XII (Intermediate Education) which will lead to a strong foundation for the increase in overall Gross Enrolment Ration (GER) at primary and secondary level of education of the state including Higher Education. Guidelines for implementation of “JAGANANNA AMMA VODI” programme are as follows:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Jagananna Amma vodi Eligible Procedure in Telugu GO 79 Dt.4th Nov, 2019
అమ్మఒడి పథకం అర్హతలు
– కుటుంబంలోని పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది.
– ఆ కుటుంబానికి ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
– లబ్ధిదారుడు/తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి
– ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఆ కుటుంబంలోని పిల్లలకూ ఆధార్ కార్డు ఉండాలి.
– రేషన్ కార్డులోని సమాచారాన్ని 6 దశల్లో పరిశీలించి ధ్రువీకరిస్తారు.
– స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో ప్రవేశం పొందిన అనాథలు/వీధి పిల్లలకు ఈ ప్రయోజనాన్ని సంబంధిత శాఖలతో సంప్రదించి అమలుచేస్తారు.
– విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.
– పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి.
– సమన్వయంతో కూడిన వ్యవస్థ ద్వారా విద్యార్థులు, లబ్ధిదారులను గుర్తిస్తారు.
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డు ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చెల్లింపు విధానం ఇలా ( Mod of Payment) :
– అర్హులైన ప్రతి లబ్ధిదారు జాతీయ బ్యాంకులో లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి.
– అర్హులైనవారి అకౌంట్లకు ప్రతి ఏటా జనవరిలో రూ.15వేలు జమ అవుతుంది.
– ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేస్తారు. దీన్ని కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌కు లింకు చేస్తారు.
– ఆయా విద్యాసంస్థలు అందించే విద్యార్ధుల డేటాను చైల్డ్ ఇన్ఫో, యూడైస్, సివిల్ సప్లయ్ డేటాలతో సరిపోల్చుతారు.
– ఆ డేటాను సంస్థ తరఫున ఉండే తనిఖీ అధికారి ధ్రువీకరించాలి.
– అనంతరం డీఈఓ, జిల్లా వృత్తి విద్యాధికారి, ప్రాంతీయ విద్యాధికారుల పరిశీలన అనంతరమే లబ్ధిదారుల ఖాతాలోకి జమచేస్తారు.
– గ్రామ వలంటీరు స్కూలు డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించాలి. తన పరిధిలో తల్లి, లేదా సంరకుడిని వలంటీరు గుర్తించాలి. నిర్ణీత ప్రొఫార్మాలో వారి వివరాలు సేకరించి, ఎంఈఓలకు సమర్పించాలి.
– డీఈఓ, ప్రాంతీయ విద్యాధికారి, వృత్తి విద్యాధికారి, జిల్లా కలెక్టర్లకు సంబంధిత లబ్ధిదారుల డేటాను సమర్పించాలి.
– పథకంలో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారులు, లబ్ధిదారులే బాధ్యులు.
– డేటా విశ్లేషణ, ఇతర కార్యకలాపాలకు ఐటీ, సివిల్ సప్లయిస్, రియల్ టైమ్ గవర్నెన్సు విభాగాలు సాంకేతిక సహకారంతో పనిచేయాలి.
– లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్‌కు వీలుగా ప్రదర్శించాలి.
Download Go 79 Amma vodi Eligible Procedure Copy