Nadu Nedu Programme Instructions by AP CM YS Jagan 14th Nov, 2019

Nadu Nedu Programme Instructions by AP CM YS Jagan 14th Nov, 2019 

స్పందన కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు :

FA1 Question Papers 2024: Download (Updated)

★ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నవంబర్‌ 14న నాడు- నేడు కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

★ మొదటి దశలో 15 వేలకు పైగా పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన ఉంటుందన్నారు.

★ ఒక్కో ఏడాది తదుపరి తరగతుల్లో ఇంగ్లీషు విద్యా బోధన ప్రవేశపెడతామని.. అయితే తెలుగు తప్పనిసరి సబ్జెక్టు అన్నారు.


★ జనవరి 1 నుంచి టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 

★ స్కూళ్లలో ఇంగ్లిషు ల్యాబ్స్‌ కూడా ఉండాలి. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్‌ పనులు, మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు,

★ హైస్కూల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం.. ఇవన్నీ నాడు- నేడు కార్యక్రమంలో భాగమే.

★ తల్లిదండ్రులతో ఏర్పడ్డ కమిటీల భాగస్వామ్యం తీసుకోండి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. డిసెంబర్‌లోగా పాఠ్యాప్రణాళిక ఖరారు చేయాలి’ అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

మనబడి నాడు-నేడు 9 రకాల పనులు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా తల్లిదండ్రుల కమిటీలతో సామాజిక కాంట్రాక్టు విధానంలో పాఠశాలల్లో 9 రకాల పనులు చేపడుతున్నారు.

9 రకాల పనులు ఇవే:

* నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు
* విద్యుదీకరణతోపాటు ఫ్యాన్లు, లైట్లు
* తాగునీటి సదుపాయం
* విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్‌
* పాఠశాలలకు రంగులు
* మరమ్మతులు
* గ్రీన్‌ చాక్‌ బోర్డులు
* అదనపు తరగతి గదులు
* ప్రహరీ నిర్మాణం

Scroll to Top