Yoga Day Daily yoga Asanalu Benefits | యోగ దినోత్సవం రోజు చేయవలసిన యోగ క్రమసారిణి

Yoga Day Daily yoga Asanalu Benefits | యోగ దినోత్సవం రోజు చేయవలసిన యోగ క్రమసారిణి : యోగాను దినచర్యలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. అందుకు ఉపయోగపడే యాప్‌లు, మహిళలకు అవసరమయ్యే ఆసనాలు ఏంటో… అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందామా..


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

FA1 Question Papers 2024: Download (Updated)

Yoga Day Daily yoga Asanalu Benefits | యోగ దినోత్సవం రోజు చేయవలసిన యోగ క్రమసారిణి

1.ప్రార్థన ..

ఓం సంగచ్చధ్వం సంవదద్వమ్
సంవో మనాంసి జానతామ్
దేవా భాగం యధా పూర్వే
సంజానాన ఉపాసతే

భావం…

ఐక్యంగా కదులుదాం..ఐక్యభావం పలుకుదాం..తొలిలో ఉన్నట్లు మన మనస్సులను సమచిత్తం చేద్దాం..దైవాన్ని ఉపాసన చేద్దాం.

2.సడిలజ లేదా చలన క్రియలు

మెడ సంబంధించినవి

1. మెడ ముందుకు వెనక్కు వంచడం.(Forward and back ward movement)
2. మెడను కుడి, ఎడమలకు చెవులు భుజాలు తాకే విధంగా వంచడం (left right)
3. మెడను కుడి ఎడమలకు త్రిప్పడం (Twist)

భుజా కదలికలు

1.చేతులు పైకి ఎత్తి భుజాలు సాగదీయడం.
2. భుజాలపై చేతి వేళ్ళు ఉంచి త్రిప్పడం
ఛాతిని త్రిప్పడం (Trunk movement) right to left
మోకాళ్ళ పై కూర్చోవడం

3.యోగ అసనములు

1.నిలబడి చేయు అసనములు

తాడాసన
వృక్షాసన
పాద హస్తాసన
అర్ధ చక్రాసన
త్రికోణాసన

2. కూర్చొని చేయు అసనములు

భద్రాసన
వజ్రాసన
అర్థ ఉష్ట్రాసన
ఉష్ట్రాసన
శశాంకాసన
ఉత్తాన మండుకాసన
వక్రాసన

3. బోర్లా పడుకొని చేయు అసనములు

మకారాసన
భుజంగాసనం
శలభాసన

4.వెల్లకిలా పడుకొని చేయు అసనములు

సేతు బంధాసన
ఉత్తాన పాదాసనం
అర్థ హలాసనం
పవన ముక్తానసనం
శవాసనం

4. కపాలభాతి
5.ప్రాణాయామం

నాడీ శోధన /
అనులోమ విలోమ
సీతలి ప్రాణాయామం
భ్రామరీ ప్రాణాయామం

6. ధ్యానం
7. సంకల్పం

నాకు నేనుగా ప్రమాణం చేసేది ఏమనగా ఎల్లప్పుడూ మానసికంగా స్థిరత్వం కలిగి ఉంటాను. ఎంత వీలయితే అంతవరకు నా ఉత్కృష్టమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటాను. నేను నా కర్తవ్య నిర్వహణలో నాకు, నా కుటుంబానికి, చేసే పని, సంఘానికి మరియు ఈ ప్రపంచానికి శాంతి, ఆరోగ్యం కలిగేలా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

8.శాంతిపథం

సర్వే భవతు సుఖినా
సర్వే సంతు నిరామయం
సర్వే భద్రాణి పష్యంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
ఓం శాంతి శాంతి శాంతి
యోగ దినోత్సవ శుభాకాంక్షలతో

పంచకోశాలు, జీవాత్మ చుట్టూ అరలు ఆరలుగా ఉన్నందున దీనిని కోశము అందురు.

1. అన్నమయ్య కోశం:

‘అన్న’ అనగా ఆహారం.ఇది భౌతిక శరీరం. అయిదు జ్ఞానేంద్రియాలను కలిగి ఉంటుంది. 1.చూపు,2.వాసన, 3.స్పర్శ,4.రుచి,5.వినికిడి లతో ఉన్న శరీరం అన్న మాట. అలాగే ఆ శరీరంలో ఎముకలు,కండరాలు,అవయవాలు ఈ అన్నమయ్య కోశం పరిధిలోకే వస్తాయి.మానవుని శరీరం భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది.

2. ప్రాణమాయ కోశం:

‘ప్రాణ’ అంటే శక్తి. ఈ కోశము vital life force అంటేప్రాణ శక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రాణ మరో 5 పెద్ద మరో 5 చిన్న భాగాలుగా ఉంటుంది.అవి 1.ప్రాణ,2. అపాన,3.ఉదాన,4. సమాన,5. వ్యాన అనే 5 భాగాలుగా ఉంటుంది. శరీరంలో ఈ ప్రాణ శక్తి వల్ల నియంత్రణ కలిగి ఉంటుంది.మానవ శరీరంలో రక్త ప్రసరణ మరియు నాడులకు ప్రాణ శక్తి అందించేది ఇదే. అంతేగాక 5 ఉప ప్రాణములు ఉన్నాయి అవి 1. నాగ, 2.కూర్మ, 3.క్రీకర, 4.దేవదత్త, 5.ధనుంజయ అనేవి ఉంటాయి. శరీరంలోని 72000 నాడులకు ప్రాణశక్తిని అందిస్తుంది.

3.మనోమయ కోశం :

‘మన” అంటే మనస్సు.ఇది ఆలోచనలు మరియు భావనలు, మెదడు మరియు ఎమోషన్ ల సమ్మిళితం. ఇందులో చేతనా, ఉప చేతనా మరియు అచేతనా అవస్థలు ఉంటాయి. దీనినే కాన్సియస్, సబ్ కాన్సియెస్ మరియు అన్ కాన్స యెస్ అంటాము. ఇది జ్ఞానేంద్రియముల ద్వారా విషయాలను గ్రహించి పంజ్ చేస్తుంది. అరిషడ్ వర్గాలు ఈ కోశం కు చెందినవి. కామ, క్రోధ,లోభ,మద,మాత్సర్యములు.

4.విజ్ఞానమయ కోశం:

‘విజ్ఞాన’ గురించి అవగాహనే విజ్ఞానమయ కోశం. సుప్రీం అంటే పరమాత్మ ఉన్నదనే అవగాహన ఉంటుంది.ధారణ సాధన ద్వారా అంతర్గత క్రమశిక్షణ ఏర్పడి పరమాత్మతో ధ్యాన స్థితిలో వుండడడం.నేను అనే తత్వం నశించి ప్రాపంచిక విషయాలు వదలి సమాధి స్థితిని పొందడం. ఇది పూర్తిగా విషయ అవగాహనకు చెందినది.

5.ఆనందమయ కోశం:

‘ఆనందమ’ కోశం అంటే పూర్తిగా ఇది ఆధ్యాత్మిక పరమైన దేహం.ఆత్మ పరమాత్మలో ఐక్యమైయ్యే స్థితి. దీనిని మనం ముక్తి అంటున్నాము.ఆనందమైన స్థితి ఇది. మన శరీరంలో అనారోగ్యం ఏర్పడితే ఏ కోశంలో సమస్య ఉంటే ఆ సమస్యకు తగినట్టు థెరఫీ ఉంది. భౌతిక శరీరం అన్నమయ్య కోశం అయితే అందుకు ఆసనాలు, ప్రాణాయమలు వాడాలి అలాగే మానసిక సమస్యలు మనోమాయ కోశం కావున ధ్యానం చేయించవచ్చు అలాగే విజ్ఞానం కోశం కోసమయితే ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజనలు, మంచి పుస్తకాలు చదవడం అవగాహన పెంచుకోవడం ఆనందమయకోశం అయితే ధ్యాన స్థితి నుండి ధారణ స్థితికి చేరి సమాధి (సమ+అది) స్థితిని పొందడం దీనినే ముక్తి అంటున్నాము.

ప్రపంచదేశాలన్నీ ఆరోగ్యంకోసం మనం పరిచయం చేసిన “యోగా” చుట్టూ తిరిగితే, మనం మాత్రం యోగాని ఎప్పుడో మరిచిపోయాం. పైగా అదేదో ఫారిన్ వాళ్ళు ఇక్కడకు తీసుకొచ్చారేమో “ఏమిటీ చేదస్తం” అని తప్పుకునే ప్రభుద్ధులను మనం రోజు చూస్తూనే ఉంటాం…. ఏం చేస్తాం, నవతరం కాలిపోతోంది భోగిమంటల్లో కట్టెలా…!!!!

గమనిక: పైన పేర్కొన్న అంశం, కొన్ని పుస్తకాలు, మరియు అంతర్జాలం నుండి సేకరించబడినది

Scroll to Top