Vidyakanuka distribution Instructions – Check List and Acquittance Form Download

Jagananna Vidyakanuka distribution Instructions of education-kits (revision)- Vidyakanuka distribution Instructions to HM – Check List and Acquittance Form Download

Vidyakanuka distribution Instructions – Check List and Acquittance Form Downlaod. విద్యాకానుక-కిట్ల పంపిణీ సూచనలు (పునశ్చరణ) ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC-SSA,తేది: 14-08-2020. జగనన్న విద్యాకానుక కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత గౌరవ విద్యాశాఖా మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు 19.8.2020 వ తేదీన సచివాలయంలోని తన చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ (ఐ.ఎ.ఎస్) గారు, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు (ఐ.ఎ.ఎస్) గారు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి (ఐ.ఎ.ఎస్) గారు సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు పథక సంచాలకులు నిర్ణయించిన విషయాలు. శ్రీ ఆర్.మధుసూదనరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్ణయించిన విషయాలు.

FA1 Question Papers 2024: Download (Updated)

Jagananna Vidyakanuka distribution Instructions – Check List and Acquittance Form Downlaod

జగనన్న విద్యా కానుక’ కిట్లు సిద్ధం చేయాలని, అందులో ఉండాల్సిన అన్ని వస్తువులు ఖచ్చితంగా విద్యార్థులకు పాఠశాల తెరిచే రోజుకే అందాలని ఈ సమావేశంలో ఆదేశించారు.

Vidyakanuka distribution Instructions - Check List and Acquittance Form Downlaod
Vidyakanuka distribution Instructions

సకాలంలో కిట్లు అందించడానికి ప్రణాళిక:

    • 1. అన్ని పాఠశాలల్లో ‘జగనన్న విద్యా కానుక’ కిట్ రూపొందించడం 21.8.2020 వ తేదీ నుంచి ప్రారంభించాలి.
    • 2. అందుకోసం మండల రిసోర్సు కేంద్రాల్లో కిట్ కు సంబంధించి ఉన్న వస్తువులు, వస్తూన్న సరుకు వచ్చినట్లుగా ఆయా పాఠశాలలకు తరలించాలి.
    • 3. పాఠశాలకు సరుకు చూడగానే ఆయా తరగతుల ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థుల పేర్లు వారీగా (పేరు, తరగతి, రోల్ నంబర్) గుర్తింపు కార్డు కాగితం మీద రాసి ‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా వచ్చే బ్యాగుపై ఉన్న పౌచ్ లో పెట్టాలి. (ఉదాహరణకు: ఓ తరగతిలో 50 మంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థుల పేర్లు, వివరాలు రాసి 50 బ్యాగులు సిద్ధం చేయాలి).
    • 4. బ్యాగులన్నింటిని తరగతి, విద్యార్థి రోల్‌ నంబర్‌ వారీగా ఓ వరుసలో పేర్చుకోవాలి.
    • 5. తర్వాత బాలురు/ బాలికకు అందించబోయే వస్తువులన్నీ విద్యార్థి పేరు ప్రకారం ఆ బ్యాగులో పెట్టాలి.
    • 6. బ్యాగులో అన్ని వస్తువులు పెట్టడానికి తగినంత స్త స్థలం లేకపోతే ఆయా వస్తువులను సంబంధిత విద్యార్థికి చెందిన బ్యాగు పక్కనే పెట్టి, బ్యాగుతో పాటు కిట్‌ రూపంలో అందజేసేలా సిద్ధంగా ఉంచుకోవాలి.
    • 7. బ్యాగులో కిట్‌ కు సంబంధించి కొన్ని వస్తువులు ముందే వచ్చాయి. ఇంకా కొన్ని వస్తువులు కాస్త ఆలస్యంగా వస్తుంటాయి. బ్యాగులను తరగతి, బాలురు / బాలికల పేర్లు వారీగా పేర్చుకోవడం వల్ల మిగిలిన వస్తువులు వచ్చినప్పుడు సంబంధిత విద్యార్థికి చెందిన బ్యాగులో త్వరగా, సులువుగా పెట్టడానికి వీలవుతుంది.
  • 8. ప్రతి బ్యాగుకు అన్ని అంశాలతో కూడిన చెక్‌ లిస్ట్‌ తయారు చేసి బ్యాగుపైన అతికించుకోవాలి. తరగతి వారీగా ఉపాద్యాయులు చెక్ లిస్ట్ లో వచ్చిన వస్తువుల దగ్గర టిక్ మార్క్ ✅ పెట్టా
  • 9. తరగతి వారీగా ఉపాధ్యాయులు చేయవలసిన చెక్ లిస్టులో వచ్చిన వస్తువుల దగ్గర ‘టిక్’ మార్కు పెట్టాలి.(నమూనా దీనితో పాటు జతపరచడమైనది)
    రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

Download Vidyakanuka distribution Instructions
Check List and Acquittance Form Download

Scroll to Top