AP Teachers Transfers Important Points – Doubts & Clarification – Apply last Date, Highlights of Transfers 2023
AP Teachers Transfers Important Points – Doubts & Clarification – Apply last Date, Highlights of Transfers 2023: AP Teachers Transfers 2023 Allocation of logins to MEO / DYEO on the Transfers website. అందరు ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులందరికి తెలియజేయవలసిన ముఖ్య విషయాలు. Transfers Important Points – Doubts & Clarification 2023-2024. Transfers Important Points – Doubts & Clarification – Apply last Date, Highlights 2023
AP Teachers Transfers Important Points – Doubts & Clarification – Apply last Date, Highlights of Transfers 2023
- 1. బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 05.06.2023. ఈ తేది తరువాత గడువు పొడిగించబడదు.
- 2. 18.11.2015 కి ముందు జాయిన్ అయిన ఉపాధ్యాయులు మరియు 18.11.2017 కి ముందు జాయిన్ అయిన ప్రధానోపాధ్యాయులు అనగా 8/5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నవారు మరియు రేషనలైజేషన్లో పోస్టు బదిలీ చేయబడిన ఉపాధ్యాయులందరు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవలెను. అలా చేసుకోని పక్షంలో,కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత.. చివరలో మిగిలిన ఖాళీలలో ఎక్కడపడితే అక్కడ వేస్తారు. వారు ఆప్షన్ కోరుకునే అవకాశాన్ని కోల్పోతారు.
- 3. స్పోజ్ కేటగిరీ లో దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు ఆప్షన్స్ ను ఇచ్చుకొనేటప్పుడు.. వారి స్పోజ్ కి అతి దగ్గర ఖాళీలను ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చుకోవాలి. ఎక్కువ HRA ఉన్న ఖాళీలను ప్రాధాన్యతగా ఇచ్చి అతిదగ్గరగా ఉండే ఖాళీలను తరువాత ప్రాధాన్యత క్రమంలో ఇవ్వరాదు.
- 4. అందరి దరఖాస్తులను,నిబంధనల మేరకు క్షుణ్నంగా పరిశీలించాలి. ప్రతి DDO బదిలీలకు సంబంధించిన G.O లు,ఎప్పటికప్పుడు వచ్చే వివరణల ప్రతులు ప్రింట్ తీసి పెట్టుకోవాలి.వాటిని అవగాహన చేసుకోవాలి
- 5. ప్రిఫరెన్సియల్ కేటగిరీ లో ,..వైద్య కారణాలతో దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు కాంపిటెంట్ అథారిటీ/ మెడికల్ బోర్డ్ నుంచి గత 6 నెలలలో తెచ్చుకున్న సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి.
- 6. ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లలో ఎదో ఒకదాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరీక్షించాలి.
- 7. 8/5 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పటి బదిలీల్లో మళ్ళీ ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లలో ఎదో ఒకదాన్ని ఏ ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయని/HM ఉపయోగించరాదు.
- 8. 8/5 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పుడు రేషనలైజేషన్ లో పోస్ట్ షిఫ్ట్ అయ్యుంటే ఆ ఉపాధ్యాయుడు మళ్ళీ ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లో ఎదో ఒక దాన్ని ఉపయోగించుకోవచ్చు.
- 9. స్కూల్ కేటగిరి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. తప్పుడు కేటగిరీ లో ఉన్న అప్లికేషన్ని పరిశీలించకుండా అలాగే సబ్మిట్ చెస్తే దానికి పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాడు మరియు మండల విద్యాశాఖాధికారి వహిస్తారు.
- 10. Reapportionment exercise లో షిఫ్ట్ అయిన పోస్టులను ఖచ్చితంగా Reapportion వేకెన్సీ గా చూపించాలి. లేదంటే ఆ పోస్ట్ ఆ పాఠశాలకు రాదు. ఈ విషయాన్ని HM / MEO అతి జాగ్రత్తగా పరిశీలించుకొని నిర్ధారించుకోవాలి.
- 11. ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా దానికి ఆ HM/ MEO దే భాద్యత. మరియు ఆ ఉపాధ్యాయుడి పైన చర్య తీసుకొనబడును.
- 12. స్కౌట్, NCC, PH,.. మరియు అన్ని సర్టిఫికెట్స్ ని అతి జాగ్రత్తగా పరిశీలించి సర్టిఫై చేయవలెను.
చివరగా తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు మరియు రేషనలైజేషన్ లో పోస్ట్ షిఫ్ట్ అయిన ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత HM మరియు MEO లదే.
How to Apply Teacher Transfers Online Application
Teachers Transfers Upload Required Certificates
AP Teachers Transfers District wise Vacancies list
AP Teachers Transfers Points Calculation Software
AP Teachers Transfers Important Points & Guidlines 2023
AP Teachers Transfers, there are several important points to keep in mind. Here are some key considerations:
- Eligibility Criteria: Teachers must meet the eligibility criteria set by the Department of School Education, Andhra Pradesh, to be eligible for transfers. This may include criteria related to years of service, qualifications, performance evaluations, and other relevant factors.
- Transfer Guidelines: The department issues specific guidelines and rules for conducting teacher transfers. These guidelines outline the process, timelines, and criteria for transfers, as well as any special provisions or considerations.
- Online Application: Teachers need to apply for transfers through the online application system provided by the department. They must fill out the application form accurately and provide the required information, including their preferences for transfer.
- Web Options: During the transfer process, teachers are often given the opportunity to exercise web options. This allows them to choose their preferred schools, locations, or other preferences for transfer. The web options are usually done through an online portal provided by the department.
- Merit-based Transfers: Transfers are typically conducted based on a merit-based system, taking into account factors such as years of service, performance, qualifications, and other relevant criteria. The department may prioritize transfers based on these factors to ensure fairness and efficiency.
- Counseling Process: After the application and web options submission, the department conducts a counseling process to finalize the transfers. During counseling, teachers may be called for verification of documents and to provide any additional information if required.
- Transfer Orders: Once the counseling process is completed, the department issues transfer orders to the eligible teachers. These orders specify the new school or location to which the teacher has been transferred.
- Joining and Relieving: Teachers who receive transfer orders need to follow the instructions mentioned in the orders. This includes reporting to the new school or location within the specified time frame and completing the necessary joining and relieving procedures.
Allocation of logins to MEO / DYEO on the Transfers website
ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు ప్రత్యేక వెబ్ లింక్ అందుబాటు ఉపాధ్యాయుల దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉపాధ్యాయులు సబ్మిట్ చేసే ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి తదుపరి లెవెల్ కు పంపేందుకు ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయించారు.
- ఈ మేరకు వారి యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ లను వారికి మెయిల్ మరియు సందేశాల ద్వారా తెలిపారు.
- ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లు వారి పరిధి లోని ఉపాధ్యాయులు సబ్మిట్ చేసిన దరఖాస్తులను సునిశితంగా పరిశీలించి తప్పులు ఉంటే రిజెక్ట్ చేస్తారు.
- ఇలా రిజెక్ట్ చేసిన అప్లికేషన్ ను షెడ్యూల్ తేదీ పూర్తి అయ్యాక కూడా ఉపాధ్యాయులు వారి లాగిన్ లో సరి చేసి రీ సబ్మిట్ చేయవచ్చు.
- ఉపాధ్యాయుల దరఖాస్తులో అన్ని వివరాలు సరిగా ఉంటేనే తదుపరి లెవెల్ కు సబ్మిట్ చేస్తారు.
- ఆ పై జిల్లా విద్యాశాఖ కార్యాలయం వారు దరఖాస్తు లను పరిశీలించి అప్రూవ్ చేస్తారు.
Teachers Transfers Dounbts & Clarifications
టీచర్ల / హెచ్.యం ల బదిలీల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 23.05.2023 నుండి మొదలుకాగా కొన్ని సమస్యలను JD గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆ మేరకు జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) శ్రీ. డి.దేవానంద రెడ్డి గారు కొన్నింటిపై నివృత్తి చేశారు. అవి….
1) సమస్య : 2018 డీఎస్సీ ద్వారా నియామకం కాబడిన వారికి ట్రెజరీ ఐడి లేనందున వారి స్పోజ్ లకు దరఖాస్తుకు వీలులేకుండా వున్నది.
జే.డి గారు : డైరెక్టరేట్ నుండి DEO ఆఫీసులకు రాండమ్ గా నెంబర్స్ కేటాయించడం జరిగింది. తాత్కాలిక ట్రెజరీ ఐ.డి ని క్రియేట్ చేస్తారు. ఆ సమస్య గల వారు ఆయా DEO కార్యాలయాల్లో సంప్రదించాలి.
2) సమస్య : కనీస అర్హత రెండేళ్ల సర్వీస్ లేకపోయినా ఆన్లైన్ దరఖాస్తు సబ్మిట్ కాబడుతుంది.
జే.డి గారు : అటువంటి దరఖాస్తుకు అవకాశం లేకుండా సరిచేశాము. ఐతే రి అప్పోర్షన్ (రేషనలైజేషన్) కు గురైన మిగులు టీచర్స్ అయా పాఠశాలల్లో రెండు సం.ల లోపు వున్నను వారి దరఖాస్తు సబ్మిట్ కు అవకాశం కల్పించబడింది.
3) సమస్య :
- i). గత సం.లలో కేటగిరి 1V , III లలో మార్పులు,
- ii). రేషనలైజేషన్ లో మిగులుగా తేలిన వారికి జి. వో ప్రకారం పూర్వపు పాయింట్స్ కేటాయింపు ,
- iii). DEO పూల్ లో వుండే టీచర్ల సర్దుబాటు మరియు
- iv). ట్రాన్స్ఫర్ మెసేజ్ రానివారికి తగు పరిష్కారాలపై కోరగా….
జే.డి గారు : పై నాలుగు అంశాలకు సంబంధించి రాష్ట్రంలోని అందరూ DEO లకు మార్పులు – చేర్పులు – సర్దుబాటు – దోషాలను సరిచేయుటకు తగు అధికారం (సౌకర్యం ) కల్పించామన్నారు. ఈలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే వారు ఆయా జిల్లాల్లో DEO ఆఫీస్ ట్రాన్స్ఫర్ సెల్ సిబ్బందిని సంప్రదించాలని స్పష్టం చేశారు.
4) సమస్య : దరఖాస్తులో Widow కాలమును చేర్చాలి.
జే.డి గారు : ప్రిఫరెన్సియల్ కేటగిరీలో Widow కాలమ్ ను చేర్చడం జరిగింది. అప్లికేషన్ లో అవసరం లేదని తెల్పారు.
Transfers More Details https://teacherinfo.ap.gov.in/