Telangana New Revenue Act 2020 (2023) Main Points – Download pdf fine in Dharani website

Telangana New Revenue Act 2020 Main Points – Download pdf fine in Dharani website

Telangana New Revenue Act 2020 Main Points – Download pdf fine in Dharani website : Telangana land revenue act telugu, land patta types in telangana, Telangana Revenue Department modified rules released by CM KCR Garu. TS revenue new acts in telugu download. Chief Minister K Chandrasekhar Rao has introduced the historical new revenue act 2020 in the Telangana monsoon assembly session and more details at Dharani portal. The CM expressed happiness on the introduction of the bill which is aimed to address all the land related disputes on a permanent basis. The bill applies to every family in the state. Many production tools have come up in modern times. He added that Man’s life revolved around the earth. Agriculture has been practiced for the last six thousand years. Since then its value has increased as land has been identified as a means of production. Even today there are land issues.

FA1 Question Papers 2024: Download (Updated)

Telangana New Revenue Act 2020 Main Points – Download pdf fine in Dharani website

రెవెన్యూ బిల్లు ను సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

  • తెలంగాణ శాసనసభ లో రెవెన్యూ బిల్లుల ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
  • ప్రవేశ పెట్టిన బిల్లుల్లో భూమి పై హక్కులు, పాస్‌ పుస్తకాల చట్టం – 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం – 2020 ఉన్నాయి.
  • కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టం లోని అంశాలు వర్తించవు అని ప్రభుత్వం తెలిపింది.
  • భూ లావాదేవీ లకు వెబ్‌ సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేయాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి.
  • భూములను మార్ట్‌గేజ్ చేస్తే ధరణి వెబ్‌సైట్‌ లో నమోదు చేయించాలి.
  • పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానం లో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది.
  • భూమి హక్కు పత్రం, పట్టాదారు పాస్‌ పుస్తకం ఏకీకృతం చేస్తాం.
  • భూహక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ఉంటాయి.
  • ధరణి పోర్టల్‌ లో ఆన్‌లైన్‌ ద్వారా భూయాజమాన్య హక్కుల బదిలీ ఉంటుంది. అని ప్రభుత్వం వివరించింది.

బిల్లు లోని ముఖ్యాంశాలు:

  • గ్రామ రెవెన్యూ అధికారుల పదవుల రద్దు చట్టం 2020 బిల్లు లను సభలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వం.
  • నిబంధనలకు విరుధ్దంగా భూమి హక్కుల రికార్డుల అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతో పాటు సర్వీసు నుంచి తొలగింపు, భర్తరఫ్, శిక్ష.
  • రైతులకు పట్టాదారు పాసు పుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్ విధానంలో రుణాలు.
  • గ్రామ రెవెన్యూ అధికారుల పదవులు రద్దు.
  • ధరణి పోర్టల్లో ఆన్లైన్ ద్వారా భూ యాజమాన్య హక్కుల బదిలీ.
  • పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూ రికార్డ్స్ నిర్వహణ.
  • వీఆర్వోగా పని చేస్తున్న వారి సేవలను పరిపాలన అవసరాలను బట్టి అదే స్థాయిలో ఇతర ప్రభుత్వ శాఖ లోకి బదిలీ.
  • కొత్త చట్టం వ్యవసాయ యోగ్యమైన భూమి కోసం మాత్రమే వర్తిస్తుంది.
  • పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రము గా పరిగణన.
  • తహశీల్దార్ కు సబ్ రిజిస్ట్రార్ కు ఉండే అధికారాలు అప్పగింత.
  • భూ వివాదాల పరిష్కారాల కోసం ఒక్కరు లేదా అంత కన్నా ఎక్కువ సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.
  • కోర్ బ్యాంకింగ్ సిస్టం – ప్రతి గ్రామం లోని భూముల హక్కుల రికార్డు ను డిజిటల్ స్టోరేజ్ చేయాలి.
  • కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు.
  • ఆ రికార్డులో పట్టాదారు పేర్లు – సర్వే నంబర్లు – విస్తీర్ణం ఉంటాయి.
  • ఈ చట్టం కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు.
  • పాయిగా – జాగీరు- సంస్థానాలు – మక్తా- గ్రామ అగ్రహారం – ఉహ్మ్లి- ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు.
  • జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి.
  • ఏ రకమైన రిజిస్టేషన్ కోసమైనా ప్రభుత్వం నిర్దేశించిన వెబ్ సైట్స్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి.
  • రిజిస్టేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ దస్తావేదులు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలి.
  • మ్యుటేషన్ ప్రక్రియ ను వెంటనే పూర్తి చేయాలి.
  • వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే హక్కుల రికార్డ్ పూర్తి చేసి కొన్నవారికి వెంటనే బదిలీ చేయాలి.
  • ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి.
  • మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసి అధికారం కలెక్టర్.
  • జారీ చేసిన చేసిన తహశీల్దార్ పై బర్తరఫ్ క్రిమినల్ కేసులు – తిరిగి భూములు స్వాధీనం.
  • కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం – ప్రభుత్వ అధికారిపై ఎటువంటి దావా వెయ్యరాదు.
  • ఇప్పటి వరకు ఎటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం తహశీల్దార్ కు ఉంది.
  • డిజిటల్ రికార్డుల ఆధారం గానే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి.
  • రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకు ల్లో పెట్టుకోరాదు.
  • ఈ చట్టం సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది.
  • ఈ బిల్లు చట్టరూపం దాల్చగానే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 రద్దు అవుతుంది.
  • రికార్డులను అక్రమంగా దిద్దడం – మోసపూరిత ఉత్తర్వులు జారీ చేస్తే అధికారులు – ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు – సర్వీస్ నుంచి తొలగింపు బర్తరఫ్ చేస్తారు.
  • 1971 యాక్ట్ రద్దు అయిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ – కేసులన్ని కొత్తగా ఏర్పాటు చేసే ప్రత్యేక ట్రిబ్యునల్ కు బదిలీ.
  • విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఫైనల్.
  • కొత్త చట్టం ఏర్పాటయిన తరువాత రూల్స్ రూపొందించాలి

Download Telangana New Revenue Act 2020

Scroll to Top