Teachers are Must Read 10 Books – పుస్తకాలు విజ్ఞాపు వాకిళ్ళు

Teachers are Must Read 10 Books – పుస్తకాలు విజ్ఞాపు వాకిళ్ళు

10 Inspiring Books Every Teacher Needs to Read, As a teacher, you may long to read up on new ideas for your classroom, but with the demands on your time this amounts to nothing more than a fantasy. Staying up to date on the best books for teachers is a challenge for any busy professional. ఉపాధ్యాయులు తప్పక చదవవలసిన పుస్తకాలు. పుస్తకాలు విజ్ఞాపు వాకిళ్ళు, పుస్తకాలు ఎందుకు కచదవాలి అని ప్రశ్నంచుకొంటే_?. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకొని కొత్తదనంతో బోధించాలి.దీనికి మార్గం పుస్తకాలే! పుస్తకాలు.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Teachers are Must Read 10 Books – పుస్తకాలు విజ్ఞాపు వాకిళ్ళు

పుస్తకాలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి.
పుస్తకాలుఉత్తేజాన్ని కలిగిస్తాయి.
పుస్తకాలు మనకు మార్గదర్శకులవుతాయి.

1. పిల్లలకే నా హృదయం అంకితం: (1918-1970)– వి. సుహోమ్మీన్స్ స్కీ :

“ప్రాధమిక పాఠశాల అనేది ఒక ఉపాధ్యాయుడి సృజనాత్మక కృషి”.

“ప్రాథమిక విద్యే విద్యార్థికి పునాది” అని నమ్మి పిల్లలతో దగ్గరగా మెలగి ప్రాథమిక విద్యలో మనం చేస్తున్న తప్పులను వేలెత్తి చూపే ఒక అద్భుత పుస్తకం “పిల్లలకే నా హృదయం అంకితం”.

2. పగటి కల(దివాస్వప్న) – గిజుభాయి

కవలం ఉద్యోగం, జీతం అనే పరిమిత స్థాయిలో జడంగా ఉండే ఉపాధ్యాయులకు ఆదర్శంగా, ప్రేరణనిచ్చే, వ్యక్తిత్వంతో దైర్యంతో, ఒక ఆశయం కోసం జీవించాలనే తపనను పెంచే పుస్తకం పగటి కల.

3. సమ్మర్ హిల్ – ఎ. ఎస్. నీల్

మనసిక రుగ్మతలున్న (న్యూరోటిక్) పండితుడిని తయారు చేయటం కంటే సంతోషంగా బ్రతికే వేదులు ఊడ్చేవారిని తయారు చేస్తే స్కూలే మంచిదని నా అభిప్రాయమని నిర్మోహమాటంగా స్కూలు వ్యవస్థని హెచ్చరిస్తారు నీల్.

4. విద్య –జీవితమునకు గల ప్రాధాన్యము ( Education and signification ఆఫ్ జె జిడ్డు కృష్ణమూర్తి life)

విద్యార్థి ఒక సంపూర్ణ వ్యక్తిగా సమగ్ర వికాసాన్ని, పాఠశాల ద్వారా పొందాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య బాంధవ్యం ఎలా ఉండాలి? పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత ఏమిటి? స్వేచ్చా, స్వాతంత్ర్యాలు అంటే ఏమిటి? మొదలైన అనేక విషయాలను వాస్తవిక దృక్పదంతో తాత్విక దృష్టితో ఎంతో విపులంగా వివరించే సమగ్ర పుస్తకం!

5.పిల్లల పెంపకంలో మెళుకువలు –యూరి అజారోవ్

“విద్యా బోధన శాస్త్ర అకాడమి సభ్యునిగా పిల్లలతో తన అనుభవాలను ఈ పుస్తకంలో వివరిస్తారు. అజారొవ్!.

6. విద్య -రవీంద్రనాథ్ ఠాకూర్.

విద్యా ప్రణాళికలను గూర్చి మన బోధనా పద్ధతుల గురించి, ఆంగ్ల విద్య గురించి, ప్రకృతి పాఠాలను గూర్చి నిర్మొహమాటంగా, ఘంటాపదంగా, సూటిగా, వేడిగా, వాడిగా మన విద్యా విధానం మీద సంధించిన బాణాలు రవీంద్రనాధ్ ఠాగూరు రచించిన పుస్తకం “విద్య”.

7. రైలు బడి –తెక్సికో కురోయ్

పిల్లల మంచి స్వభాలను వెలికి తీసి వారిని వ్యక్తిత్వంగల మనుషులుగా తయారు కచేయటమే రైలు బడి వృత్తాంతం.

8. ద బ్లాక్ బోర్డ్ (The Black Board)ఎలినార్ వాట్స్

చాలా సులభ రీతిలో సరళమైన రీతిలో బ్లాక్ బోర్డ్ మీద బొమ్మలు గీచి విద్యాబోధన చేయవచ్చునని, సులభ శైలిలో భావ వ్యక్తీకరణలు చేయవచ్చని తెలిపే అద్భుత పుస్తకం. ప్రతి ప్రాథమిక టీచరు వద్ద ఉండవలసిన పుస్తకమిది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
9. పిల్లల భాష –ఉపాధ్యాయుడు – ప్రొఫసర్ కృష్ణకుమార్‌

ఈ పుస్తకంలో ఆయన వివిధ కోణాలనుండి భాషను పిల్లలకు ఎలా భోధించాలో చాలా సరళంగా వివరించారు .

10. మనం పిల్లలం –జై సీతారాం

అద్భుతంగా వత్తులను గేయ రూపంలో కూర్చి అందించిన ఘనత జై సీతారామ్ దే!.

పిల్లల్లో ఊహశక్తిని, పరిసరాల పట్ల ప్రేమని, ఆధునిక విజ్ఞానం పట్ల ఆశక్తిని, జీవితం పట్ల మమకారాన్ని, వ్యక్తుల పట్ల గౌరవాన్ని ముఖ్యంగా భాష పట్ల అభిమానాన్ని ఈ గేయాలు పెంపొందిస్తాయి.

Scroll to Top