School Prayer News on 7th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం
School Prayer 7th Sep, 2019 పాఠశాల అసెంబ్లీ – AP / Telangana Today’s News, Good Poem, Today’s Good News, Today’s GK, Today’s Good Word, Today’s Good News, Today’s Nationalism, National / International Days, Today’s Child, Today’s Story, The Great Man’s Word, Today’s Proverb etc for School Assembly on 7th September, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
School Prayer News on 7th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి-ఆణిముత్యం
పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు
- విఫలమైన చంద్రయాన్ 2. నిరాశ చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు: మరికొద్ది నిముషములలో 1, 2 కిలోమీటర్ల దూరంలో చేరువగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా “విక్రమ్ రోవర్ ల్యాండర్ నుండి ఎలాంటి సిగ్నల్స్ అందక గతి తప్పినది.
- పోషణ్ అభియాన్ అమలుకు కమిటీల ఏర్పాటు: పోషణ్ అభియాన్ పర్యవేక్షణ, అమలుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలను ఖరారు చేస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
- రష్యా దేశంలోని తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కొరకు ప్రధాని నరేంద్ర మోడీ 7 వేల కోట్ల రూపాయల రుణాన్ని ప్రకటించారు.
- జమ్మూకాశ్మీర్లో ఏడు సంవత్సరాల పాటు GST సహా అన్ని పన్నుల మినహాయింపు కు కేంద్రం సిద్ధమవుతోంది.
- బొగ్గు గనుల త్రవ్వకాల్లో పర్యావరణ నిబంధనలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- వాస్తవిక అంచనాలతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను రూపొందిస్తామని ముఖ్యమంత్రి KCR వెల్లడించారు.
- రాష్ట్ర గవర్నర్ ESL నరసింహన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడో తారీఖున ఘనంగా వీడ్కోలు పలకనుంది.
- యుఎస్ ఓపెన్ సెమీఫైనల్లోకి రఫెల్ నాదల్ ప్రవేశించాడు.
నేటీ ఆణిముత్యం
చపలాత్ము డవని లోపల
నపాత్ర జనులకును దాన మందిచ్చుట హీ
నపు గుక్క నోటి లోపల
నిపుణత నెయిపోసినట్లు నెగడు కుమారా!
భావం:
ఓ కుమారా! ఈ భూమిలో చంచల స్వభావులైనవారు, అయోగ్యులైన ప్రజలకు దానం చేయటం నీచమైన కుక్క నోట్లో నేతిని పోసిన విధమౌతుంది. యోగ్యాయోగ్యతలను తెలిసి పాత్రాపాత్రదానం చేయాలి.
చరిత్రలో ఈరోజు సప్టెంబర్ 7
జననాలు
1533: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (మ.1603)
1914: జరుక్ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు. (మ.1968)
1925: భానుమతి, ప్రముఖ దక్షిణ భారత సినిమా నేటీ, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు. (మ.2005)
1953: మమ్ముట్టి, మలయాళ సినీ నటుడు.
1983: గుత్తా జ్వాల, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి.
మరణాలు
1976: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (జ.1905)
1986: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. (జ.1918)
1990: ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత. (జ.1928)
1991: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (జ.1908)
2004: కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నేటీంచిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923)
నేటీ సుభాషితం
ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకడం అన్నింటికంటే హీనమైనది.
నేటీ సామెత
దొందూ దొందేరా తొందప్పా
ఎవరో ఇద్దరు మాటలు సరిగ్గా రాని వాళ్ళు మాట్లాడుకుంటుంటే వారిని వెక్కిరిస్తూ మూడవ వ్యక్తి అయిన వాడు వాడి స్నేహితునితో అన్న మాట ఇది “దొందూ దొందేరా తొందప్పా” అని. అసలు వాడు “రెండూ రెండేరా కొండప్పా” అనాలి. కానీ వాడికి కూడా సరిగ్గా అనడానికి నోరు తిరగలేదు. తన చేతకాని తనాన్ని చూసుకోలేని వాడు ఎదుటి వాళ్ళ లోపాలను వెక్కిరించితే వాడే నవ్వుల పాలు అవుతాడు అని నీతిని బోధించే సామెత ఇది.
నేటీ జాతీయం
కుక్కకు పావుశేరు
దేశం సుభిక్షంగా ఉందని తెలియజెప్పటం.పంటలు బాగా పండుతున్నప్పుడు రైతులు, అసాములు తమ దగ్గరున్న పని వాళ్ళకు జీతంలో కోత లేవీ లేకుండా అడిగినంత ధాన్యమో, ధనమో ఇస్తూ ఉంటారు. యాచకులకు ఎంతో కొంత ఇచ్చి పంపుతుంటారు.పావుశేరు బియ్యాన్ని ఇంటి ముందు కాపలాగా ఉండే కుక్క కోసం కూడా తీసి పక్కన పెడతారు.
నేటీ చిన్నారి గీతం
నా కాళ్ల గజ్జెల్
నా కాళ్ల గజ్జెల్
మోకాళ్ల చిప్పల్
అబ్బబ్బ నడుము
అద్దాల రవిక
ముక్కుకు ముక్కెర
కళ్ళకు కాటుక
కస్తూరి బొట్టు
నెత్తిమీద కుండ
కుండనిండ పెరుగు
పెరుగోయమ్మ పెరుగు
తిరుగోయమ్మ తిరుగు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటీ కథ
కవితాయ స్వాహా
విజయనగర సామ్రాజ్యం లోని ఒక వూరిలో అక్కిసెట్టి అనే ఒక కోమటి వుండేవాడట అతను గుగ్గిళ్ళు చేసి అమ్ముతూ వుండే వాడట అతనికి తెనాలి రామకృష్ణుడు అన్ని పద్యాలు చెప్తాడు కదా నేనూ కవిత్వం వ్రాస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది రామకృష్ణుడు దగ్గరికి వెళ్లి కవిత్వం వ్రాయడానికి చిట్కా లేమైనా చెప్పమని అడిగాడు.
రామకృష్ణుడు నీకు ఈ కవిత్వం వ్రాయాలనే పిచ్చి ఎందుకు అందరికీ కవిత్వం పట్టుబడదు హాయిగా గుగ్గిళ్ళు అమ్ముకుంటూ బ్రతుకు అని నచ్చ చెప్పాడు కానీ ఆ కోమటి కాదుకూడదు మీరు నాకు చిట్కాలు చెప్పాల్సిందే అని పట్టు బట్టాడు అప్పుడు రామకృష్ణుడు సరే అయితే పున్నమి రాత్రి వెళ్లి ఏదైనా మంచి తోటలో చెట్టుక్రింద కూచుని ఆలోచిస్త్తూ వుండు ఏదైనా స్ఫురించ వచ్చు అని చెప్పి పంపించాడు.
సరే నని ఆ అక్కిసెట్టి పున్నమ నాటి రాత్రి ఒక తోటలో కూర్చుని ఆలోచిస్తున్నాడట అలా చంద్రుడిని చూస్తూ వుంటే అతనికేదో స్ఫురించింది వెంటనే వ్రాసుకున్నాడు పున్నమి వెన్నెల కాసెగా అది చాలా బాగుంది అని పించింది సెట్టికి యింక ఉత్సాహం వచ్చేసింది ఒక పాదం వచ్చింది కదా అని ఆలోచిస్తూ వుంటే ఒక కోయిల కుహూ కుహూ అని కూసింది.
వెంటనే అతనికి యింకో పాదం స్ఫురించింది పోనాపై కోయిల కూసెగా చాలా బాగుంది అనుకున్నాడు యింక యెంత ఆలోచించినా మూడో పాదం రాలేదు అప్పటికే అర్ధరాత్రి అయి పోయింది యింక యివ్వాల్టికి చాలని యింటికి వెళ్లి పోయాడు యింటికి వెళ్ళగానే చూస్తే ఎప్పుడో ప్రొద్దున చేసిన గుగ్గిళ్ళు అన్నీ పాసిపోయాయి.
ఆ దినం ఆదాయం కూడా పోయింది అయిన అతనికి వెంటనే యింకో పాదం స్ఫురించింది అంగట్లో గుగ్గిళ్ళు పాసేగా
అదీ వ్రాసుకున్నాడు.నాలుగో పాదం యెంత ఆలోచించినా రాలేదు యింక రేపు చూసుకోవచ్చు లే అని పడుకున్నాడు ప్రోద్దునలేచి యెంత ప్రయత్నించినా నాలుగో పాదం రాలేదు సరే అనుకోని రామకృషుని దగ్గరకు వెళ్లి మూడు పాదాలూ వినిపించాడు. నాలుగో పాదం చెప్పమని బ్రతిమలాడాడు.
పున్నమి వెన్నెల కాసెగా పొన్న పై కోయిల కూసెగా అంగట్లో గుగ్గిళ్ళు పాసెగా రామకృష్ణుడు వెంటనే 4వ పాదం అక్కి శెట్టి ముండ మోసెగా అంటే వ్యాపారం జరుగక అక్కిసెట్టి నష్ట పోయాడు అని దాని అర్థం నేను చెప్పాను కదా కవిత్వము అందరికీ రాదు అనీ వెళ్లి చక్కగా వ్యాపారం చేసుకో అని బుద్ధి చెప్పి పంపించేశాడు అక్కిసెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకుంటూ బ్రతికేసాడు.ఈ కథ మీ పిల్లలకు చెప్పండి నవ్వుకోడానికి బాగుంటుంది.
నేటి సుభాషితం
“మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.”
“Remember our dreams are as hungry as our demons. Make sure you are feeding the right ones.”
మంచి పద్యం
పుణ్య భరతభూమిపూర్ణత గోల్పోవ
మూలకారణంబు ముఖ్యముగను
కులకుఠార హతియె గూఢముగా జూడ
నరకె రెండు గతుల నరకు ముందు
(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన “శ్రుతి సౌరభము” అనే శతకములోనిది. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)
నేటి జీ.కె
ప్రశ్న: ‘జనాశ్రయ’ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: మల్లియరేచన
నేటీ సూక్తి:
అతి సులభమైన పని
ఇతరులకు సలహాలివ్వడం.
అతి కష్టమైన పని
నీలోని బలా బలాల్ని గ్రహించగలగడం.
రూజ్వెల్ట్.
నేటీ ప్రశ్న:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ?
జవాబు: ముంబాయి.
మహానీయుని మాట
” పెద్దలు మనకు చదవడం నేర్పారు, కానీ ఆలోచించడానికి శిక్షణను ఇవ్వలేదు ”
నేటీ మంచి మాట
” బండి మందుకు సాగేటప్పుడు చక్రం అడుగుభాగం పైకీ పైభాగం కిందకి రాక మానవు. జీవనయానంలో సుఖదు:ఖాలూ అంతే. “