School Assembly Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు

పాఠశాల అసెంబ్లీ నేటి వార్తలు

School Assembly Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు 

> భారత్‌తో సంబంధాలపై పాక్‌ కీలక నిర్ణయాలు: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర విభజనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన పాకిస్థాన్‌ భారత్‌లో దౌత్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయించింది.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
> దూసుకెళ్లిన బంగారం ధర. ఒక్క రోజే రూ. 1,113 పెరిగిన ధర : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగా డిమాండ్‌ ఊపందుకోవడంతో పసిడి ధర జీవనకాల గరిష్ఠానికి చేరింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1,113 పెరిగి రూ. 38వేల మార్క్‌కు చేరువైంది.

> *భారత్ నుంచి సింధు మాత్రమే!: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న క్రీడాకారిణీల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది.

> ఏపీలో నేడు వైద్యసేవల బంద్‌. 9 నుంచి 15 వరకు  శాంతియుత ఆందోళనలు. ఎన్‌ఎంసీ బిల్లుకు నిరసనగా ఐఎంఏ రాష్ట్ర శాఖ నిర్ణయం: నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లుకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్రశాఖ ప్రకటించింది.

> 3-0తో టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్: గయానా వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

                      నేటి సుభాషితం

“జీవితం చాలచిన్నది. వైఫల్యాలకు క్రుంగకూడదు!! విజయాలతో అహం పెరుగకూడదు!!”
             
“Great minds discuss ideas, average minds discuss events, small minds discuss people.”

                         మంచి పద్యం

*మోహమడుగంటె నశియెంచె అహము సగటు*
*నిర్మలంబయ్యె చుత్తము నిలకడగను*
*రాగభయములు, క్రోధమురాలి పోయె*
*దుఃఖ సుఖములు సమముగా దోచె సతము*

(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన “శ్రుతి సౌరభము” అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు).

                            *నేటి జీ.కె*

ప్రశ్న: *’శ్యాద్వాదచల సింహ’ అనే బిరుదు ఎవరిది?*


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జ: *సోమదేవసూరి*

Scroll to Top