School Assembly on 22nd August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి
పాఠశాల అసెంబ్లీ – 22nd August, 2019 : AP / Telangana Today’s News, Good Poem, Today’s Good News, Today’s GK, Today’s Good Word, Today’s Good News, Today’s Nationalism, National / International Days, Today’s Child, Today’s Story, The Great Man’s Word, Today’s Proverb etc for School Assembly on 22nd August, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
School Assembly on 22nd August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ – నేటి వార్తలు – మంచి పద్యం – సూక్తి
నేటి వార్తలు : 22-08-2019
1. భారత్ కు వ్యతిరేకంగా వాడుతున్న పదజాలం పరిధి దాటకుండా చూసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కి సూచించారు.
2. కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పాకిస్తాన్ మంగళవారం పేర్కొంది.
3. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ 2 విజయవంతంగా ప్రవేశించడం పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.
4. కొత్త రెవెన్యూ చట్టం గాంధీ జయంతి రోజునుండి అమల్లోకి తెస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు.
5. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత ఆటగాడు ప్రణయ్ ప్రిక్వార్టర్ లోకి ప్రవేశించాడు.
6. రాష్ట్రంలో తప్పుల తడకలుగా ఉన్న భూ రికార్డులను రెండు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు.
నేటి సూక్తి:
వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగా,
చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికి వాడిగానే మిగిలిపోతారు.
– మార్క్ ట్వైన్.
నేటి ప్రశ్న( Today Question) :
5G మొబైల్ నెట్ వర్క్ ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఏది?
జవాబు: దక్షిణ కొరియా.
నేటి సుభాషితం
“ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలో కూడా మంచి అనే మొగ్గ చిగురిస్తూ పెరుగుతుంది”
“Take a good look at your failure, and then say with gritty determination. “You’re not going to keep me down! I may be defeated, but I’m not giving up!”
మంచి పద్యం
పదవి యున్నవాని పడిపడి మ్రొక్కేరు
దుష్టుడైన పరమ ధూర్తుడైన
పదవి లేనివాని పంచకు జేరరు
పుణ్యుడైన పరమ పూజ్యుడైన
(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన “శ్రుతి సౌరభము” అనే శతకములోనిది. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)
నేటి జీ.కె
ప్రశ్న: ‘విచిత్రచిత్త’ అని పిలిచే పల్లవ రాజు ఎవరు?
జ: మహేంద్రవర్మ
మహానీయుని మాట
” నేను ఓడిపోయాను అని అంటే ఇక నేను ఎప్పటికి గెలవలేనని కాదు! “
నేటీ మంచి మాట
” ఓటమి గురువులాంటిది. ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది. “
నేటి చిట్టి కథ
ఒక రాజు గారికి ఒకటే కన్ను మరియు ఒకటే కాలు ఉండేవి.
రాజ్యంలో ఉన్న చిత్రకారులందరినీ పిలిచి తన చిత్రం అందంగా వెయ్యమని అడిగారు. రాజుగారిలో ఉన్న లోపం వల్ల ఎవ్వరూ చిత్రం గీయలేకపోయారు.
ఒక చిత్రకారుడు ముందుకు వచ్చి చాలా అందమైన చిత్రం గీశాడు. అంత అందమైన చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాజుగారు వేటకి వెళ్ళి గుర్రం మీద కూర్చుని, ఒక కన్ను మూసుకుని మరొక కన్ను లక్ష్యంమీద గురి పెడుతున్నట్లు అందమైన చిత్రం గీసాడు.
రాజుగారి శరీరంలో ఉన్న లోపాలు కనిపించకుండా, రాజుగారి మనసు నొప్పించకుండా చిత్రం గీశాడు.
కథ లోని నీతి
మనం కూడా మనలో ఉన్న బలహీనతలు పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండగలగాలి. అలాగే ఎదుటివారిలోని బలహీనతలు చూపించి వారిని నొప్పించకుండా వారి బలాలను వారికి గుర్తు చేస్తూ అందరికి ఆనందాన్ని పంచగలగాలి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 22
1860: నిప్కోడిస్క్ ను కనుగొన్న పాల్ గోటిలిబ్ నిప్కో జననం.
1864: మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
1869: హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితుడైన మొదటి హిందువు పింగళి వెంకట రామారెడ్డి జననం (మ.1953).
1922: అల్లూరి సీతారామరాజు ద్వారా మన్యం విప్లవం ప్రారంభించబడినది.
1924: ప్రముఖ హిందీ కవి హరిశంకర్ పరసాయి జననం.(మ.1995)
1932: టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.
1933: భారతీయ నృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం (మ.1994).
1955: తెలుగు సినిమా కథానాయకుడు, కాంగ్రెసు పార్టీ నాయకుడు మరియు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి జననం.
1964: ప్రముఖ రంగస్థల నటీమణి రేకందార్ గుణవతి జననం.
2014: ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి మరణం (జ.1932).